కొనసాగుతున్న రెండో ఏఎన్ఎంల సమ్మె
ఆత్మకూర్ : పీహెచ్సీల్లో పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంలను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి జీఓను విడుదల చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ మండల అధ్యక్షురాలు లక్ష్మమ్మ అన్నారు. ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ చేపట్టిన సమ్మె మంగళవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదో పీఆర్సీ ప్రకారం రూ.21వేల వేతనంతోపాటు డీఏ, హెచ్ఆర్ఏలు తదితర డిమాండ్లు పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో బాలేశ్వరీ, చంద్రమ్మ, వరలక్ష్మి, కె.లక్ష్మమ్మ, ఉమామహేశ్వరీ, పద్మావతి, భాగ్యమ్మ, పద్మమ్మ, అలివేలు, జయంతి, పరిమళ, లక్ష్మినర్సమ్మ, శోభారాణి, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.