విడాకులకు నటి అను ప్రభాకర్ దంపతుల అర్జీ
బెంగళూరు, న్యూస్‌లైన్ : నటి అనుప్రభాకర్, కృష్ణకుమార్ దంపతులు విడాకుల కోసం బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో అర్జీ సమర్పించారు. బుధవారం ఇద్దరు వేర్వేరుగా విడాకుల కోసం అర్జీ దాఖలు చేశారు. అలనాటి బహుభాష నటి జయంతి కుమారుడు కృష్ణకుమార్, కన్నడ నటీన టులు ఎంవీ. ప్రభాకర్, గాయత్రీ ప్రభాకర్‌ల కుమార్తె అనుప్రభాకర్ వివాహం 2002 మార్చి నెలలో జరిగింది.
అయితే కుటుంబ సమస్యల కారణంగా ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకు రూ. కోటి భరణం ఇవ్వడానికి కృష్ణకుమార్ అంగీకరించారు. ఇదే విషయంపై ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చి విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారని వారి తరఫు న్యాయవాదులు తెలిపారు. ఒకటి రెండు రోజులలో వీరి అర్జీ విచారణకు వచ్చే అవకాశం ఉంది.