మావోయిస్ట్ రాష్ట్రాల్లో అభివృద్ధి: గడ్కారీ
న్యూఢిల్లీ: దేశంలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రూ.11వేల కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు చేశామని కేంద్ర ఉపరితలరవాణా, జాతీయరహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, యూపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, వంతెనల నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను వినియోగించనున్నట్టు వెల్లడించారు.
ఎన్డీఏ ఏడాది పాలనలో మంత్రిత్వశాఖ సాధించిన ప్రగతి సూచిక ఈ-పుస్తకాన్ని గురువారం ఇక్కడ ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశ జీడీపీలో ఉపరితల రవాణా, జాతీయ రహదారులు, నౌకాయాన మంత్రిత్వశాఖ 2 శాతం అభివృద్ధి రేటు భాగస్వామ్యం తీసుకుందన్నారు. రానున్న ఏళ్లలో రోడ్డురవాణా, నౌకాయాన రంగం ద్వారా 25 లక్షలఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఆరు నెలల్లో కనీసం రూ.3.50 లక్షల కోట్ల పనుల వ ర్క్ ఆర్డర్లుఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.