Arjun Suravaram
-
ఖరీదైన కారు కొన్న యువ నటుడు
తాను నటించిన సినిమా విజయవంతం కావడంతో తనకు తానే బహుమతి ఇచ్చుకున్నట్లు యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ చెప్పాడు. ఈ సందర్భంగా తాను కొత్తగా కొన్న రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ కారు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. లాక్డౌన్ వలన కారు కొనడం ఆలస్యమైందని తెలిపాడు. ఈ కారు విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుంది. ‘హ్యాపీడేస్’ సినిమాతో సినీ పరిశ్రమలోకి వచ్చిన నిఖిల్ ఆ తర్వాత ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుర్తింపు పొందాడు. గతేడాది ‘అర్జున్ సురవరం’ సినిమా విడుదలై విజయవంతమవడంతో ఈ కారు కొన్నట్లు తెలిపారు. కరోనా వలన కారు కొనుగోలు ఆలస్యమైందని పేర్కొన్నాడు. దీంతోపాటు గతేడాది తన ప్రేయసిని పెళ్లాడాడు. ప్రస్తుతం వైవాహిక జీవితం ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక సినిమాలపరంగా చూస్తే నిఖిల్ కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ- 2, గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ‘18 పేజెస్’ అనే సినిమాలు చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
బతికుండగానే చంపేశారు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ‘అర్జున్ సురవరం’ సినిమా వచ్చింది. నిరుద్యోగుల డిగ్రీ సర్టిఫికెట్లను వారికి తెలియకుండా సేకరించి, బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకుంటారు. ఈలోగా లోన్ కట్టలేదంటూ బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులొచ్చి అరెస్టు చేస్తారు. బాధితుడైన హీరో.. ఆ స్కాంను బయటపెట్టడంతో కథ సుఖాంతమవుతుంది. సరిగ్గా హైదరాబాద్‌లో ఇదే తరహాలో ఓ ఘటన జరిగింది. తమ తోటి వ్యాపార భాగస్వామి తండ్రిని బతికుండగానే చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, వారి ఆస్తినే తాకట్టు పెట్టి రూ.16 కోట్లు రుణం తీసుకున్నారు. వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, ఆస్తులకు సంబంధిం చిన డాక్యుమెంట్లు నేర స్వభావం ఉన్నవారి చేతిలో పడితే చిక్కులు ఎదురవుతాయనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. సీన్ కట్ చేస్తే..: బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 5లో రెన్‌లైఫ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఉంది. ఇది రక్తం నుంచి తీసిన సీరమ్, అల్బుమిన్ తదితరాలను సేకరించి విక్రయిస్తుంది. 2017లో ఈ కంపెనీని ఆరుల్ ప్రకాశ్, మహమ్మద్ అబ్దుల్ అజీజ్‌లు స్థాపించారు. వీరిద్దరూ కూడా కంపెనీ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. తర్వాత కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన విజయ్.. మైసూర్ రాఘవేంద్ర మూడో డైరెక్టర్‌గా చేరాడు. రాఘవేంద్ర కుటుంబం పేరు మీద దక్షిణ బెంగళూరులోని కెంగెరి గ్రామంలో 3.3 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై ఆరుల్, అజీజ్‌లు కన్నేశారు. రాఘవేంద్రకు తెలియకుండా ఈ భూమి నకిలీ సేల్ డీడ్ సంపాదించారు. జానకీ రమాశర్మ అనే ఫైనాన్సియల్ కన్సల్టెంట్ సాయంతో సదరు భూమిని తనఖాగా ఉంచి రుణం కోసం తొలుత ఎస్బీఐ సైఫాబాద్ శాఖలో రుణం కోసం యత్నించారు. అక్కడ యత్నం బెడిసికొట్టింది. ఈసారి మరింత పకడ్బందీగా మహబూబ్‌గంజ్ ఎస్బీఐ బ్రాంచ్‌లో రాఘవేంద్ర పేరిట రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. నకిలీ డెత్ సర్టిఫికెట్.. డైరెక్టర్ రాఘవేంద్ర తండ్రి బతికుండగానే చనిపోయినట్లు, నకిలీ డెత్ సర్టిఫికెట్, నకిలీ ఫొటోలు, పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలు సంపాదించారు. రుణం కోసం దరఖాస్తు పత్రాలకు జతచేసిన వివరాలు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లోని వివరాలతో పొంతనలేదు. అయినా వాటిని అలాగే సమర్పించారు. ఈ పత్రాలను సరిగ్గా పరిశీలించకుండానే.. మహబూబ్‌గంజ్ బ్రాంచ్ ఆర్ఎంఎంఈ పవన్‌కుమార్, చీఫ్ మేనేజర్ జే.నాగేశ్వరశర్మ, బ్యాంకు మేనేజర్ శశిశంకర్లు రూ.16 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాఘవేంద్ర అవాక్కయ్యాడు. తన తండ్రి చనిపోయాడంటూ పత్రాలు సృష్టించారని తెలుసుకుని కంగుతిన్నాడు. ఈ విషయంపైతానే స్వయంగా దర్యాప్తు చేశాడు. బ్యాంకుకు వచ్చి లోను మంజూరు చేసినఫైళ్లలో ఫొటో, సంతకం తనవి కావని నిరూపించాడు. దీంతో నాలుక్కరుచుకున్న ఎస్బీఐ ఉన్నతాధికారులు లోను ఖాతాను నిరర్ధక ఆస్తి (నాన్‌పెర్ఫామింగ్ అసెట్)గా గతేడాది మార్చి 8న ప్రకటించారు. బ్యాంకు అంతర్గత విచారణలో విభాగాధిపతి ధనార్జనరావు సహా పలువురు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని గుర్తించారు. అనంతరం సీబీఐకి ఫిర్యాదు చేశారు. తమ అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని కోరారు. దీంతో ఐపీసీలోని పలు సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గురువారం రాత్రి నిందితులుగా ఉన్న ఎస్బీఐ అధికారులు, రెన్‌లైఫ్ నిందితుల ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించి పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకుంది. -
ఈ విజయానికి మూడు ప్రధాన కారణాలు
‘‘మా సినిమాకు హెల్ప్ చేయడానికి దేవుడిలా వచ్చిన చిరంజీవిగారు, ప్రేక్షకుల మౌత్ టాక్, మీడియా సపోర్ట్... మా ‘అర్జున్ సురవరం’ చిత్రం విజయం సాధించడానికి ఈ మూడు ప్రధాన కారణాలు’’ అని అన్నారు నిఖిల్. టి. సంతోష్ దర్శకత్వంలో నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా బి.మధు సమర్పణలో రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. నవంబరు 29న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నిఖిల్ మాట్లాడుతూ–‘‘మా సినిమాను నమ్మి, ప్రమోట్ చేసిన నిర్మాతలకు ధన్యవాదాలు. నటనలోనే కాదు.. ప్రమోషన్స్‌లోనూ కోపరేట్ చేసిన లావణ్యాత్రిపాఠికి ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘ఎంతో కష్టపడ్డాం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఫైనల్‌గా విజయం సాధించాం. సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు సంతోష్. ‘‘మోసం విశ్వవ్యాప్తమైనప్పుడు నిజం చెప్పడం విప్లవాత్మకమైన చర్య అని జార్జ్ ఆర్వెల్ చెప్పిన కొటేషన్ ఈ సినిమాకు స్ఫూర్తి’’ అన్నారు రాజ్‌కుమార్. ఇంతటి ఘనవిజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. ‘‘అనుక్షణం సినిమా గురించి ఆలోచించే వ్యక్తి నిఖిల్. తనను చూసి చాలా నేర్చుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించడం హ్యాపీ’’ అన్నారు నటుడు రాజ్ తరుణ్. నిర్మాతలు ‘ఠాగూర్’ మధు, సుధాకర్ రెడ్డి, ఏషియన్ సునీల్, అభిషేక్ అగర్వాల్ నటీనటులు సత్య, కేదార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.40కే సినిమాను అమ్మేస్తారా అంటూ హీరో ఆవేదన
సాక్షి, హైదరాబాద్: నిఖిల్ హీరోగా టీఎన్ సంతోష్ దర్శకత్వంలో వచ్చిన మూవీ అర్జున్ సురవరం.. మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అర్జున్ సురవరం మూవీకి హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను చిత్ర యూనిట్ నేరుగా కలుస్తోంది. ఈ సందర్భంగా గుంటూరు వెళ్లిన హీరో నిఖిల్ అక్కడ రోడ్డు మీద ఓ బండిపై తాజాగా విడుదలైన సినిమాలకు సంబంధించిన పైరసీ డీవీడీలను ఓ మహిళ అమ్ముతుండడం గమనించి షాక్‌కి గురయ్యాడు. ఎంతో కష్టపడి సినిమా తీస్తున్నాం. చదవండి: వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన కేఏ పాల్ ఎందరో జీవితాలు సినిమాపై ఆధారపడి ఉంటాయి. ఇలా.. రూ.40కే మా సినిమాను అమ్మేస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఆ బండిపై సీడీలు విక్రయిస్తున్న మహిళ తనకు ఏమీ తెలియదని చెప్తూ.. తన కుటుంబ పోషణ కోసమే ఈ వ్యాపారం చేస్తున్నట్టు చెప్పింది. ఇక ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియోని నిఖిల్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. Had so much fun interacting with Housefull Crowds in Guntur yesterday and on the way back stopped for tea and Found This ... #ArjunSuravaram and other movie DVD’s being openly sold🤦🏻♂️ pic.twitter.com/nEBCbtAeqh — Nikhil Siddhartha (@actor_Nikhil) December 8, 2019 -
ఇన్వెస్టిగేషన్ జర్నలిజం కేరాఫ్ అర్జున్ సురవరం
నగరంలో సినీసందడి నెలకొంది. అర్జున్ సురవరం చిత్ర యూనిట్ విజయ యాత్రలో భాగంగా శ్రీకృష్ణా థియేటర్‌కు ఆ చిత్ర హీరో నిఖిల్, క్యారెక్టర్ నటుడు నాగినీడు, దర్శకుడు చేరుకుని కాసేపు ప్రేక్షకులను అలరించారు. వారితో మాట్లాడి సినిమా విశేషాలు పంచుకున్నారు. అనంతరం హీరో నిఖిల్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఈ చిత్రం ప్రత్యేకతని తెలిపారు. నకిలీ ధ్రువపత్రాలవల్ల ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారని... దానిపైనే తమ కథనం సాగిందని వివరించారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే ఏమిటో అర్జున్ సురవరం సినిమా ద్వారా తెలియజేశామని ఆ చిత్ర హీరో నిఖిల్ తెలిపారు. విజయయాత్రలో భాగంగా ఆ చిత్ర యూనిట్ నగరంలోని కృష్ణా థియేటర్‌కు గురువారం మధ్యాహ్నం వచ్చింది. తొలుత థియేటర్లో ప్రేక్షకులతో కాసేపు మాట్లాడి, వారిని పలకరించి... వారితో సెల్ఫీలు దిగిన అనంతరం విలేకరులతో హీరో నిఖిల్ మాట్లాడుతూ నకిలీ విద్యార్హత ధ్రువపత్రాల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమైపోతున్నాయని చెప్పడం ఈ సినిమా ఉద్దేశమన్నారు. జర్నలిస్టుగా నటించేందుకు కొన్నాళ్లపాటు జర్నలిస్టుల పనితీరును కూడా పరిశీలించినట్లు తెలిపారు. విజయనగరంలో ఇంతటి భారీస్ధాయిలో ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుందని అసలు ఊహించలేదన్నారు. కేరెక్టర్ ఆర్టిస్టు నాగినీడు మాట్లాడుతూ మంచి సందేశం ఉన్న చిత్రాలను ప్రతీ ఒక్కరూ ఆదరిస్తారని మరో మారు రుజువైందన్నారు. చిత్ర దర్శకుడు టి.ఎన్.సంతోష్ నటులు విద్యులేఖా రామన్ మాట్లాడుతూ తెలుగులో తమ తొలి సినిమాకు ఇంత విజయం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. -
మా ప్రేమ పుట్టింది ముంబైలో
‘‘నేను మోడలింగ్ నుంచి వచ్చాను. అందుకే ప్రతి సినిమాలో స్టయిలిష్‌గా కనిపిస్తాను. అది నా నటనలోనూ కనిపించేలా చూసుకోవడం నా బాధ్యత’’ అన్నారు నటుడు తరుణ్ రాజ్ అరోరా. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి.సంతోష్ తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో విలన్‌గా నటించిన తరుణ్ రాజ్ అరోరా మాట్లాడుతూ – ‘‘అస్సామ్‌లో పుట్టాను. చెన్నైలో చదువుకున్నాను. బెంగళూర్‌లో మోడలింగ్ చేశా. సౌత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. హిందీలో ఎక్కువ సినిమాలు చేసినా నన్ను సౌత్ యాక్టర్‌గా గుర్తిస్తున్నారు. ‘అర్జున్ సురవరం’ ఒరిజినల్ చిత్రం ‘కణిదన్’లో నేనే నటించాను. తెలుగు వెర్షన్లో సెంటిమెంట్ యాడ్ చేశారు. చూసినవాళ్లందరూ సినిమా బావుంది అంటున్నారు. భావం, భావోద్వేగాలు ఎక్కడైనా ఒక్కటే. నటనకి భాషతో సంబంధం లేదు. ప్రస్తుతం హిందీలో ‘లక్ష్మీ బాంబ్, మలయాళంలో ‘మామాంగం’, తమిళంలో ‘దగాల్తీ’ సినిమాలు చేస్తున్నాను. నా భార్య అంజలా జవేరి నేను చేసిన సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తుంది. మేమిద్దరం ముంబైలో ప్రేమలో పడ్డాం. ముందు నేనే తనకి ప్రపోజ్ చేశాను. కావాలనే పిల్లలు వద్దనుకున్నాం. మేం ఒకరినొకరం పిల్లలుగా చూసుకుంటాం’’ అన్నారు. -
డైరెక్టర్ కాకుంటే రిపోర్టర్ అయ్యేవాణ్ణి
‘‘ఇతర ఇండస్ట్రీ ప్రేక్షకులతో పోల్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు భావోద్వేగభరిత అంశాలను ఇష్టపడతారు. మంచి సినిమాలను బాగా ప్రోత్సహిస్తారు. కంటెంట్ ఉన్న సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తాయి. కన్నడ ఇండస్ట్రీలో నాకు అవకాశం వచ్చినప్పటికీ నేను వదలుకున్నాను. తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం’’ అని టి. సంతోష్ అన్నారు. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి. సంతోష్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. గత శుక్రవారం (నవంబరు 29) విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా టి. సంతోష్ చెప్పిన విశేషాలు... ► ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘సెవెన్త్ సెన్స్, తుపాకీ’ సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశాను. ఆ తర్వాత ‘కణిదన్’ సినిమాకి దర్శకత్వం వహించాను. ఈ సినిమాను చూసి మురుగదాస్‌గారు మెచ్చుకున్నారు.. తెలుగు రీమేక్ అవకాశం వస్తే వదులుకోవద్దన్నారు. ► ‘కణిదన్’ సినిమా చూసిన నిఖిల్..నిర్మాత థానుగారి ద్వారా నన్ను సంప్రదించారు. ► నిఖిల్ అంకితభావం ఉన్న నటుడు. ఈ పాత్ర కోసం బరువు పెరిగారు. తెలుగు స్క్రిప్ట్‌పై వర్క్ చేశాం కాబట్టే అవుట్‌పుట్ బాగా వచ్చిందనిపిస్తోంది. తమిళ వెర్షన్ కన్నా, తెలుగు వెర్షన్లోనే ఎక్కువ ఎమోషన్స్‌ను జోడిస్తే వర్కౌట్ అయ్యింది.. టీమ్ అందరూ సహకరించారు. ఈ సినిమా విడుదల ఆలస్యం కావడం బాధించింది. ► నేను డైరెక్టర్ని కాకపోయి ఉంటే రిపోర్ట్‌ని అయ్యి ఉండేవాణ్ణి. అందుకే జర్నలిజం నేపథ్యంలో ‘కణిదన్’లాంటి కథ రాసుకున్నాను. భవిష్యత్‌లో సీక్వెల్ గురించి ఆలోచిస్తా. నా తర్వాతి చిత్రం గురించి త్వరలో వెల్లడిస్తా. -
ఇది సినిమా కాదు.. ఒక అనుభవం
‘‘ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో ‘అర్జున్ సురవరం’ హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను, మా డైరెక్టర్ సంతోష్ వాదించుకునేవాళ్లం. ఈ సక్సెస్ తనదే. ఈ విజయం నా ముఖంలో నవ్వు తెచ్చింది’’ అని నిఖిల్ అన్నారు. టి. సంతోష్ దర్శకత్వంలో నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించారు. తమిళ చిత్రం ‘కణిదన్’కి తెలుగు రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్ మీట్‌ను శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా తొలి రోజు 4.1 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ‘అర్జున్ సురవరం’ సినిమా కాదు.. ఒక అనుభవం. మీడియా పవర్ చూపించే సినిమా. ఈ సినిమా వల్ల మా టీమ్ అందరం గౌరవం పొందుతున్నాం. సినిమా కొన్న బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. అల్లు అరవింద్‌గారు పర్సనల్‌గా అభినందించారు. చిరంజీవిగారికి స్పెషల్ థ్యాంక్స్. రిలీజ్లు వాయిదా పడి హిట్ కొట్టిన సినిమాలు తక్కువ. మేం హిట్ సాధించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా చేయడానికి మా టీమ్ అందరం చాలా కష్టపడ్డాం. ఇంతమంచి సక్సెస్ అందించిన ఆడియన్స్‌కి థ్యాంక్స్. మా సినిమాను చూసి అభినందించిన చిరంజీవిగారికి ధన్యవాదాలు’’ అన్నారు రాజ్‌కుమార్ ఆకెళ్ల. ‘‘నేను రాసిన ప్రతీ సీన్‌ను తన నటనతో అద్భుతంగా ఎలివేట్ చేశాడు నిఖిల్. ‘ఠాగూర్’ మధు, రాజ్‌కుమార్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు టి. సంతోష్. ‘‘పరీక్షలు రాసి చాలా రోజులు ఎదురు చూశాం. ఫైనల్‌గా ప్రేక్షకులు పాస్ అన్నారు. చాలా సంతోషం’’ అన్నారు నాగినీడు. ‘‘అనుకున్నదానికంటే ప్రేక్షకులు ఎక్కువ రెస్పాన్స్ అందించారు. దర్శకుడు చాలా కష్టపడ్డారు’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. -
అర్జున్ సురవరం ప్రెస్‌మీట్
-
అర్జున్ సురవరం : మూవీ రివ్యూ
టైటిల్: అర్జున్ సురవరం నటీనటులు: నిఖిల్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళీ, సత్య, తరుణ్ అరోరా, నాగినీడు, విద్యుల్లేఖ రామన్ దర్శకత్వం: టీఎన్ సంతోష్ సంగీతం: సామ్ సీ.ఎస్ సమర్పణ: ‘ఠాగూర్’ మధు నిర్మాత: రాజ్‌కుమార్ ఆకెళ్ల బ్యానర్: మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పీ మొదటినుంచీ డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిఖిల్ సిద్ధార్థ్. హ్యాపీడేస్ నుంచి మంచి కథలతో ఎంచుకుంటూ ప్రతి సినిమాకీ తన గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా ఆయన నటించిన చిత్రం అర్జున్ సురవరం. తమిళ సూపర్‌హిట్ ‘కణితన్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ.. ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిఖిల్ జర్నలిస్ట్‌గా నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌తోపాటు ఇప్పటివరకు రిలీజైన పాటలు మంచి క్రేజ్తెచ్చాయి. ఇంతకు రిపోర్టర్ అర్జున్ సురవరం ఎలా రిపోర్ట్ చేశాడు? ఏ స్కామ్‌ను బయటపెట్టాడు? తెలుసుకుందాం పదండి. కథ: అర్జున్ లెనిన్ సురవరం (నిఖిల్).. తండ్రికి కూడా చెప్పకుండా సాప్ట్వేర్ ఉద్యోగాన్ని మధ్యలో వదిలేసి జర్నలిజంపై మక్కువతో ఓ టీవీ చానెల్లో రిపోర్టర్‌గా చేరుతాడు. బీబీసీలో పనిచేయాలన్నది అతని కల. ఈ విషయమై కావ్య (లావణ్య త్రిపాఠి)కు అబద్ధం చెప్తాడు. కానీ, కావ్య అర్జున్ పనిచేస్తున్న టీవీ చానెల్ సీఈవో కూతురు కావడంతో నిజం వెంటనే బయటపడుతుంది. మొదట అబద్ధం చెప్పాడని అర్జున్ గురించి నెగిటివ్‌గా థింక్ చేసినా.. బాధ్యతాయుతమైన రిపోర్టర్‌గా అతను పనిచేస్తున్న తీరును గుర్తించి.. బీబీసీలో ఉద్యోగం కోసం కావ్యనే అర్జున్ అప్లికేషన్ పంపుతుంది. అర్జున్‌కు బీబీసీలో ఉద్యోగం వస్తుంది. ఈ క్రమంలో అర్జున్, కావ్య మధ్య ప్రేమ చిగురిస్తుంది. కావ్యకు అర్జున్ ప్రేమ వ్యక్తం చేస్తున్న సమయంలో పోలీసులు హఠాత్తుగా వచ్చి అర్జున్ను అరెస్టు చేస్తారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టి అర్జున్‌తో పాటు మరికొందరు ఎడ్యుకేషన్ లోన్స్ పేరిట బ్యాంకులకు పెద్దమొత్తంలో టోకరా వేసినట్టు పోలీసులు అభియోగాలు మోపుతారు. అర్జున్‌తోపాటు ఇతర నిందితులకు కోర్టు శిక్ష కూడా విధిస్తుంది. కానీ ఒక నిందితుడు ఆత్మహత్య చేసుకోవడంతో బెయిల్‌పైన బయటకు వచ్చిన అర్జున్ సురవరం ఫేక్ సర్టిఫికెట్స్, ఫోర్జరీ డాక్యుమెంట్స్ రాకెట్‌ను ఎలా వెంటాడుతాడా? నకిలీ సర్టిఫికెట్లతో సమాజానికి ఎంతో చేటు చేస్తున్న ఎంతోమందిని బయటపెట్టి.. అతి పెద్ద స్కాంను, దాని సూత్రధారిని ఎలా పట్టించడాన్నది మిగతా కథ. విశ్లేషణ: ఫేక్ సర్టిఫికెట్స్‌తో సమాజానికి పెనుసవాలుగా నిలిచిన ఓ భారీ నెట్‌వర్క్‌ను, వ్యవస్థతో మమైకమై అతిపెద్ద స్కాంను ఓ రిపోర్టర్ ఎలా వెలుగులోకి తీసుకొచ్చడన్నది అర్జున్ సురవరం కథ. తమిళంలో సూపర్‌హిట్ అయిన ఈ సినిమా పవర్ఫుల్ కథతో తెరకెక్కింది. ఫేక్ సర్టిఫికెట్స్ వల్ల చదువుకున్న నిరుద్యోగులు మోసపోవడమే కాదు.. తప్పుడు పత్రాలతో డాక్టర్లు, ఇంజినీర్లు అయిన వాళ్లు సమాజానికి ఎలా ముప్పుగా మారుతున్నారన్నది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. తమిళ రీమేక్ అయిన ఆ భావన రాకుండా పూర్తి తెలుగు నేటివిటీతో అర్జున్ సురవరంను తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మొదటి అర్ధభాగం ఇంట్రస్టింగ్ కథనంతో వరుస ట్విస్టులతో దర్శకుడు వేగంగా నడిపాడు. సెకండాఫ్‌లోనే కథ కొంచెం నెమ్మదించింది. ఫేక్ సర్టిఫికెట్స్ నెట్‌వర్క్‌ను బయటపెట్టేందుకు హీరో ప్రయత్నించడం.. తన లోగుట్టును బయటకు లాగుతున్న హీరోను తెలుసుకునేందుకు విలన్ వెంటాడటం సెంకడాఫ్‌లో ప్రధానంగా కనిపిస్తుంది. ఫైట్లు, ఛేజింగ్‌లతో అక్కడక్కడ ఓవర్ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు సినిమాను నిలబెట్టేలా బావున్నాయి. ఎమోషనల్ సీన్లను దర్శకుడు బాగా చిత్రీకరించాడు. కానిస్టేబుల్ సుబ్బారావు (పోసాని కృష్ణమురళీ) చనిపోయిన సీన్లో అతని కొడుకు (వెన్నెల కిషోర్) భావోద్వేగాలు.. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ నిజాయితీ గురించి చెప్పే సీన్లు బాగా పండాయి. డైలాగులు బావున్నాయి. పాటలు అంతంతమాత్రం ఉండగా.. నేపథ్య సంగీతం చాలావరకు రణగొణ ధ్వనులతో సీన్లకు సంబంధం లేనట్టుగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువులు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. నిఖిల్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. మొదటి నుంచి చివరివరకు సినిమాను తన భుజాలపై మోశాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాత్ర హీరో వెంట క్లైమాక్స్ వరకు ఉన్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యం లేదు. ఫస్టాప్‌లో లవ్‌ట్రాక్ కూడా ఒకటిరెండు సీన్లకే పరిమితమైంది. హీరో స్నేహితుడిగా, లాయర్‌గా వెన్నెల కిషోర్ మరోసారి హాస్యాన్ని పంచాడు. విలన్ పాత్రలో తరుణ్ అరోరా ఆకట్టుకోగా, పోసాని కృష్ణమురళి, నాగినీడు, విద్యుల్లేఖ, ఇతర నటులు తమ పరిధమేరకు ఆకట్టుకున్నారు. బలాలు పవర్ఫుల్ కథ ప్రీక్లైమాక్స్‌కు ముందు వచ్చే ట్విస్టులు ఏమోషనల్ సీన్స్ బలహీనతలు సెకండాఫ్‌లో నెమ్మదించిన కథనం అక్కడక్కడ ఓవర్ సినిమాటిక్‌గా ఉండటం నేపథ్య సంగీతం అంత ఆప్ట్‌గా లేకపోవడం - శ్రీకాంత్ కాంటేకర్ -
నిద్ర లేని రాత్రులు గడిపాను
‘‘నేను ఇప్పటివరకూ 17 సినిమాల్లో నటించా. సినిమా విడుదల విషయంలో ఎప్పుడూ ఇబ్బందులు రాలేదు. ‘కార్తికేయ, స్వామిరారా’ సినిమాల విడుదలకు కాస్త ఆలస్యం అయింది.. అంతే. ‘అర్జున్ సురవరం’ సినిమా ఈ ఏడాది మే 1న విడుదల కావాల్సింది. కానీ, కొందరివల్ల విడుదల కాలేదు. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా? అనే భయం వేసింది. ఇంటికెళ్లి ఏడ్చాను.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను’’ అన్నారు నిఖిల్. టి. సంతోష్ దర్శకత్వంలో నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిఖిల్ చెప్పిన విశేషాలు. ► మా సినిమా బిజినెస్ బాగా జరిగింది. కానీ, నిర్మాతలకు, థియేటర్స్ ఓనర్స్‌కి మధ్య ఉండేవారు మా సినిమాని వాడేసుకున్నారు. ఈ విషయంలో నేను, నిర్మాతలు ఏమీ చేయలేకపోయాం. సమస్యలన్నీ పరిష్కరించేందుకు సమయం పట్టింది. అందుకే నేను కూడా నా పారితోషికంలో 50 శాతం మాత్రమే తీసుకున్నా. ఈ సినిమాకి లాభాలొస్తే నిర్మాతలే నాకు ఇస్తారు. ► ‘అర్జున్ సురవరం’లో నిజాయతీ కలిగిన అర్జున్ అనే జర్నలిస్ట్ పాత్ర చేశా. నేను, లావణ్య, ‘వెన్నెల’ కిషోర్, సత్య ఓ యంగ్ టీమ్. అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కునే మేం దాన్ని ఎలా పరిష్కరించామన్నదే ఈ చిత్రకథ. సమాజానికి సందేశంతో పాటు క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుంది. కొందరి చర్యల వల్ల గ్రాడ్యుయేట్స్, వారిపై ఆధారపడ్డ తల్లిదండ్రులు ఎలా ఇబ్బందులు పడుతున్నారనే విషయాలు చెప్పాం. ఈ చిత్రం తమిళ సినిమాకి రీమేక్ అయినా కొన్ని మార్పులు చేశాం. ► ముందు మా చిత్రానికి ‘ముద్ర’ అని టైటిల్ అనుకున్నాం. అదే టైటిల్‌తో వేరే సినిమా విడుదలవుతోందని తెలిసి, మార్చాం. ఈ చిత్రంలో నా పేరు అర్జున్. సురవరం ప్రతాపరెడ్డిగారు ప్రముఖ జర్నలిస్ట్. ఆయన స్ఫూర్తితో సురవరం అనే పేరు తీసుకుని ‘అర్జున్ సురవరం’ అని పెట్టాం. ఈ టైటిల్‌కి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. దర్శకుడు టి. సంతోష్ ఓ రాక్షసుడు. కొన్ని సీన్స్‌ని 30 నుంచి 40 టేక్‌లు కూడా చేశారు. అందుకే కొంచెం బడ్జెట్ కూడా ఎక్కువ అయింది. వాళ్ల నాన్నగారు జర్నలిస్టు. అందుకే ఆయనకు జర్నలిజంపై మంచి అవగాహన ఉంది. ► నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు హరిహర కళాభవన్‌లో స్కూల్ చిల్డ్రన్ కల్చరల్ ప్రోగ్రామ్‌కి చిరంజీవిగారు వచ్చారు. అప్పటికే చాలా సమయం కావడంతో నా ప్రదర్శన చూడకుండానే ఆయన వెళ్లిపోయారు. ఆయన నా డ్యాన్సులు చూసి ఉంటే నన్ను సినిమాల్లోకి తీసుకెళతారేమో అనుకునేవాణ్ణి (నవ్వుతూ). ► రోజుకు పది నుంచి పదిహేను కథలు వింటున్నాను. అలాగని ప్రతి సినిమా చేసుకుంటూ వెళ్లలేను కదా? ‘హ్యాపీడేస్’ సినిమా చేసే ముందే మా అమ్మగారు ‘కుటుంబమంతా కలిసి చూసేలా నీ సినిమాలు ఉండాలి.. లేదంటే ఇంటి నుంచి బయటికి వెళ్లిపో’ అన్నారు. అందుకే అలాంటి మంచి కథలు ఎంచుకుంటున్నాను. ► ‘కార్తికేయ 2’ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెం బరులో ప్రారంభమవుతుంది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నా. ‘శ్వాస’ సినిమా ఆగిపోవడానికి కారణం డైరెక్షన్ టీమే. నాకు చెప్పిన కథ ఒకటి.. తీస్తోంది మరొకటి. అందుకే చేయకూడదనుకున్నా. అయితే ఆ సినిమాకి ఇచ్చిన అడ్వాన్స్‌ని నిర్మాతలు వెనక్కి తీసుకోకపోవడంతో వారితో ‘హనుమాన్’ అనే సినిమా చేసేందుకు ఒప్పుకున్నా. -
కారులో నుంచి బయటపడేదాన్ని!
‘‘ఒకేసారి నాలుగైదు సినిమాల్లో కనిపించేయాలనుకోవడం లేదు. ఒక దాని తర్వాత ఒక సినిమా చేసినా నాకు నచ్చిన సినిమాలే చేయాలనుకుంటున్నాను. చేసే ఒక్కటి అయినా మంచి సినిమా చేయాలి. స్క్రిప్ట్ నాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించకపోతే సినిమా అంగీకరించడం లేదు’’ అని లావణ్యా త్రిపాఠి అన్నారు. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టీఎన్ సంతోష్ తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్ సురవ రం’. తమిళ చిత్రం ‘కణితన్’కి ఇది తెలుగు రీమేక్. బి.మధు సమర్పణలో రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించారు. ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ – ‘‘మొదట ఈ సినిమాకు నో చెప్పాను. రీమేక్ సినిమాలో చేయడానికి ఏం ఉంటుంది? అనే ఉద్దేశంతో అలా అన్నాను. కానీ కథ వినగానే చాలా నచ్చింది. ఇందులో జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తాను. చాలా స్ట్రాంగ్ అమ్మాయిని. నకీలి సర్టిఫికెట్స్ మాఫీయా గురించి ఈ సినిమాలో చర్చించాం. దాని వల్ల టాలెంట్ ఉన్నవాళ్లు కూడా ఎలా నష్టపోతున్నారో చూపించాం. ఈ సినిమాలో కొన్ని రిస్కీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ఒక సన్నివేశంలో కారులో నుంచి బయటపడబోయేదాన్ని. కొంచెంలో మిస్ అయింది. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్‌గా ఉంది (నవ్వుతూ). ‘అర్జున్ సురవరం’ రిలీజ్ ఆలస్యం కావడంతో సినిమా ఏమైనా అవుడ్ డేట్ అయిపోతుందా, స్టేల్ అయిపోతుందా? అనే ఆలోచన నాక్కూడా వచ్చింది. కానీ మా ట్రైలర్‌ని చూసినవాళ్లందరూ ఫ్రెష్‌గానే ఉంది అంటున్నారు. ‘ఈ మధ్య వరుసగా సినిమాలు చేయడం లేదేంటి?’ అని కొంతమంది అడుగుతున్నారు. సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ నాకు నచ్చిన పాత్రలు రావడం లేదు. ఈ గ్యాప్‌లో నాకు నచ్చిన ప్రదేశాలకు వెళుతున్నాను. కొత్త డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. జిమ్నాస్టిక్స్ చేస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాను. నెక్ట్స్ చేయబోయే సినిమాలో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తాను. దానికోసం డిసెంబర్లో హాకీ శిక్షణ ప్రారంభిస్తాను. కాలేజీ రోజుల్లో మా అమ్మగారు కూడా హాకీ ఆడేవారట’’ అన్నారు. ‘అర్జున్ సురవరం’ ప్రీ–రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరు కానున్నారు. ఈ నెల 29న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను 26న హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. చిత్రబృందం తరఫున ఈ వేడుకకు చిరంజీవిని అహ్వానించారు నిఖిల్. చిరంజీవి, నిఖిల్ -
అన్యాయంపై పోరాటం
నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘మేము ఎంతో శ్రమించి తీసిన చిత్రమిది. అన్యాయాన్ని ఎదిరించే ఒక రిపోర్టర్ పాత్రలో నేను నటించాను’’అన్నారు నిఖిల్. ‘‘ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుంది’’ అన్నారు సంతోష్. ‘‘ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు హీరోయిన్ లావణ్యా త్రిపాఠి. -
‘అర్జున్ను వెంటనే అరెస్ట్ చేయాలి’
యంగ్ హీరో నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ ఎల్ పి పతాకంపై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ‘అర్జున్ సురవరంతో’ నిఖిల్ ఖాతాలో మరో విజయం పడటం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను కొద్ది సేపటి క్రితమే మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో జర్నలిస్టుగా కనిపించనున్న నిఖిల్.. నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసే ఓ ముఠా గుట్టురట్టు చేసినట్లు కనిపిస్తోంది. దీంతో అతడు ఎదుర్కొనే సమస్యలు, కోల్పోయే ప్రేమ, మర్యాద, ప్రత్యర్థులపై తీసుకునే రివేంజ్ ఇలా అన్ని కలగలిపి సినిమాకు సంబంధించి ప్రధాన అంశాలను ట్రైలర్ రూపంలో చూపించారు. అర్జున్ను వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ బ్యాగ్రౌండ్లో వచ్చే డిమాండ్‌తో ట్రైలర్ ప్రారంభమై అందరిలోనూ ఆసక్తి రేకిత్తిస్తోంది. ‘ఈ కోపం నువ్వు నిజం చెప్పనందుకు కాదు.. నువ్వే నిజం కానందుకు, ఒక బాధితుడిలా కాదు.. ఒక రిపోర్టర్లా ఆలోచించాలి, వాడికి కావాల్సింది ఎవిడెన్స్.. తప్పకుండా వెతుక్కుంటూ వస్తాడు, ప్రతీ ఒక్క స్టూడెంట్‌కు ఇచ్చే మెసేజ్ ఇదే.. ఇది మన ప్రాబ్లమ్ మనమే సాల్వ్ చేసుకోవాలి’అంటూ ట్రైలర్లో వచ్చే డైలాగ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కథను ట్రైలర్లోనే రివీల్ చేసిన దర్శకుడు.. పెద్ద భారాన్ని తగ్గించుకున్నాడు. ఇక ట్రైలర్ రిలీజ్ సందర్బంగా ‘ఈ సినిమాకు పడిన కష్టాలు ఇప్పటివరకు చేసిన నా 17 చిత్రాలకు పడలేదు. నిజాయితీగా మీ దగ్గరికి తీసుకరావాలన్న ప్రయత్నమే అర్జున్ సురవరం చిత్రం. ఆశీర్వదించండి’అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు. పోసాని కృష్ణమురళి, ‘వెన్నెల’ కిషోర్, తరుణ్ అరోరా, నాగినీడు, సత్య, విద్యుల్లేఖా రామన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ సంగీతమందిస్తున్నారు. -
నిజం చెప్పడం నా వృత్తి
‘ఒక అబద్ధాన్ని నిజం చేయడం చాలా ఈజీ.. కానీ, ఒక నిజాన్ని నిజం అని ప్రూవ్ చేయడం చాలా కష్టం. నా పేరు అర్జున్ సురవరం లెనిన్. జనాలకు నిజం చెప్పడం నా ప్రొఫెషన్’ అంటూ మొదలయ్యే ‘అర్జున్ సురవరం’ సినిమా టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్ సురవరం’. నిర్మాత ‘ఠాగూర్’ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ ఎల్ పి పతాకంపై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మా సినిమా పోస్టర్స్‌కు, టీజర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. పవర్ ఫుల్ కంటెంట్‌తో రూపొందిన మా మూవీ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. పోసాని కృష్ణమురళి, ‘వెన్నెల’ కిషోర్, తరుణ్ అరోరా, నాగినీడు, సత్య, విద్యుల్లేఖా రామన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సామ్ సి.ఎస్, కెమెరా: సూర్య. -
నిఖిల్ క్లారిటీ.. సాహో తరువాతే రిలీజ్!
ఒకప్పుడు వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు తన సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు పడుతున్నాడు. కిరాక్ పార్టీ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నిఖిల్... అర్జున్ సురవరం సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా రిలీజ్ విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ లేదని తేల్చి చెప్పేశాడు. ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘పెద్దన్న ప్రభాస్ సాహో సినిమా రిలీజ్ తరువాతే అర్జున్ సురవరం రిలీజ్ ఉంటుంద’ని చెప్పాడు. సాహో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే నిఖిల్ సినిమా రిలీజ్‌కు ఇక నెలపైనే సమయముందన్న మాట. ప్రస్తుతానికి ప్రమోషన్ కూడా పక్కన పెట్టేసిన చిత్రయూనిట్, ఇంత గ్యాప్ తరువాత ఈ మూవీపై తిరిగి హైప్ తీసుకురావటంలో ఎంతవరకు సక్సెష్ అవుతుందో చూడాలి. కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన కనితన్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న అర్జున్ సురవరం మూవీలో నిఖిల్ జోడిగా లావణ్య త్రిపాఠి నటించారు. ముందుగా టైటిల్ వివాదంతో ఇబ్బంది పడ్డ ఈ మూవీ తరువాత రిలీజ్ విషయంలోనూ తడబడుతోంది. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, కావ్య వేణుగోపాల్‌లు నిర్మిస్తున్నారు. The wait will b worth.. After pedannas Saaho... release of #ArjunSuravaram #WaitingForArjunSuravaram https://t.co/LPQsdd3M9j — Nikhil Siddhartha (@actor_Nikhil) July 27, 2019 -
గూగుల్‌లో ఉద్యోగం చేశాను..
భీమవరం(ప్రకాశం చౌక్): సినిమాల్లో నటించాలని తపనతో ఉండే యువత ముందు చదువు పూర్తి చేసుకుని రావాలని, తాను అలాగే చేసి సినిమాల్లోకి వచ్చానని హీరో నిఖిల్ తెలిపారు. పరిశ్రమలో ఏదైనా ఇబ్బంది వస్తే చదువే వారికి దారి చూపిస్తుందని చెప్పారు. తన కొత్త సినిమా అర్జున్ సురవరంలో జర్నలిస్టు పాత్ర చేసినట్టు వివరించారు. మంగళవారం భీమవరంలో రక్షదళ్ సేవా సంస్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. అనంతరం స్థానిక మంగదొడ్డి మహేంద్ర నివాసంలో ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు ఇలా ఉన్నాయి. ప్రశ్న: మీ స్వస్థలం ఎక్కడ, ఏమి చదువుకున్నారు? నిఖిల్: నేను హైదరాబాది. ఇంజినీరింగ్ పూర్తి చేసి గూగుల్‌లో కూడా వారం రోజుల పాటు ఉద్యోగం చేశాను. సినిమాలపై ఇష్టంతో పరిశ్రమకు వచ్చాను. ప్రశ్న: మీకు మొదటి అవకాశం ఎలా వచ్చింది? నిఖిల్: దర్శకులు శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ సినిమాకు సెలక్షన్స్ జరుగుతుంటే వెళ్లాను. ఆయన నన్ను ఆ సినిమాలో స్టూడెంట్ పాత్రలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నాకు నిజంగానే హ్యాపీడేస్ ప్రారంభమయ్యాయి. ప్రశ్న: ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు? నిఖిల్: ఇప్పటికి 17 సినిమాలు చేశాను. ప్రశ్న: గుర్తింపు తెచ్చిన సినిమాలు? నిఖిల్:నేను నటించిన అన్ని సినిమాలు నాకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ముఖ్యంగా కార్తీకేయ, స్వామి రారా, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి. ప్రశ్న: ప్రస్తుతం ఏ సినిమాలు చేశారు? నిఖిల్: త్వరలో అర్జున్ సురవరం సినిమా వస్తుంది. అలాగే కార్తీకేయ–2, మరో రెండు కొత్త సినిమాలు చేయబోతున్నాను. ప్రశ్న: అర్జున్ సురవరం సినిమా ఏలా ఉండబోతుంది? నిఖిల్: : ఈ సినిమాలో నేను జర్నలిస్టు పాత్రలో నటించాను. విద్యార్థులకు జరుగుతోన్న అన్యాయంపై రాసిన కథ ఇది. మంచి సందేశం ఉంటుంది. ప్రశ్న: మీకు ఇష్టమైన హీరో? నిఖిల్: నాకు ఇష్టమైన హీరో చిరంజీవి. ఆయన గ్యాంగ్ లీడర్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా చూసి సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. ప్రశ్న: యువతకు మీరిచ్చే సలహా? నిఖిల్: యువత డ్రగ్స్, మద్యం, సిగరెట్లు వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అప్పుడే వారు ఖచ్చితంగా వారి లక్ష్యాలను చేరుకుని విజయం సాధిస్తారు. ప్రశ్న: భీమవరం గురించి చెప్పమంటే? నిఖిల్: భీమవరం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ నాకు మంచి మిత్రులు ఉన్నారు. ఇక్కడ ప్రజల ఆప్యాయతలు నాకు ఎంతో నచ్చుతాయి. భీమవరం పరిసర ప్రాంతాలు ఎంతో అందమైనవి. నాతో సినిమాలు చేసిన సుధీర్ వర్మ, చందు పశ్చిమ గోదావరి జిల్లా వాసులే. ఈ జిల్లాకు చెందిన ప్రతిభ గల వారు సినిమా పరిశ్రమలో ఉన్నారు. -
‘శ్వాస’ ఆగిపోయిందా?
వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో కనిపించిన నిఖిల్ ఇటీవల తడబడ్డాడు. రీమేక్‌గా తెరకెక్కిన అర్జున్ సురవరం రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ముందుగా టైటిల్ విషయంలో విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ సినిమా తరువాత రిలీజ్ విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా మరో వార్త అభిమానులను కలవరపెడుతోంది. కిషన్ కట్టా దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ‘శ్వాస’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా గతంలో ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. కథా కథనాల విషయంలో దర్శక నిర్మాతల మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగానే ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారట. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంది. -
‘అర్జున్ సురవరం’ కొత్త రిలీజ్ డేట్
యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం అర్జున్ సురవరం. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ రావటం లేదు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ మూవీ మే 1న రిలీజ్ కావాల్సి ఉండగా మరో వాయిదా వేశారు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న అన్ని సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తుండటంతో థియేటర్ల సమస్య ఎదురవుతుందని భావించి సినిమాను వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమాను మే 17న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ డేట్‌న రిలీజ్ చేయటం కూడా రిస్క్ అంటున్నారు విశ్లేషకులు మే 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మహేష్ మహర్షికి సూపర్ హిట్ టాక్ వస్తే ఆ ప్రభావం రెండు వారాల పాటు ఉంటుంది. అలాంటి సమయంలో సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లు దొరకటం కూడా కష్టమే. మరి నిఖిల్ ఆ రిస్క్ చేస్తాడా..? లేదా చూడాలి. తమిళసూపర్ హిట్ సినిమా కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ కు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
‘అర్జున్ సురవరం’ మరోసారి వాయిదా!
యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడుగా తెరకెక్కుతున్న అర్జున్ సురవరం సినిమాకు కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టైటిల్ విషయంలో ఎదురైన సమస్యల నుంచి బయటపడి రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. మే 1న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించిన చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. అయితే తాజా సమాచారం ప్రకారం అర్జున్ సురవరం వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్‌తో పాటు సినిమా రిలీజ్‌ను కూడా వాయిదా వేసినట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న మజిలీ, చిత్ర లహరి, జెర్సీ సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తుండటం, అవెంజర్స్ ఎండ్ గేమ్ కూడా భారీ వసూళ్లు సాధిస్తుందన్న టాక్ వినిపిస్తుండటంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ అధికారికంగా వెల్లడించారు. మహర్షి రిలీజ్ తరువాత అర్జున్ సురవరం రిలీజ్ అవుతుందని తెలిపారు. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కించారు. pic.twitter.com/3scqEuhKAO — Asian Cinemas (@AsianCinemas_) 25 April 2019 -
పబ్జీ : తూటా పేల్చకుండానే హీరో చికెన్ డిన్నర్
సాక్షి, హైదరాబాద్ : ఇప్పుడు దేశవ్యాప్తంగా యువతకు వ్యసనంగా మారిన ఆన్లైన్ గేమ్ పబ్జీ. ఈ గేమ్‌లో విజేతలుగా నిలిచిన వారు గెలుచుకునే టైటిలే విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్. విజేతలుగా నిలవడానికే గంటలు గంటలు ఈ గేమ్‌లో గడుపుతుంటారు. టైటిల్ దక్కాలంటే తమతో పాటు ఆన్లైన్లో పాల్గొన్నవారిని కాలుస్తూ ముందుకు వెళ్లాల్సిందే. అయితే పబ్జీ గేమ్‌లో ఒక్కరిని కూడా చంపకుండానే ఏకంగా చికెన్ డిన్నర్ కొట్టేశాడు టాలీవుడ్ హీరో నిఖిల్. ఈ మేరకు నిఖిల్ తన ట్విట్టర్ అకౌంట్లో ఓ పోస్ట్ కూడా పెట్టారు. ఒక్కరిని కూడా చంపకుండానే సోలో గేమ్‌లో చికెన్ డిన్నర్ కొట్టేశా అంటూ పోస్ట్ పెట్టారు. ఎలాంటి హింసలేకుండానే విజేతగా నిలిచానని పేర్కొన్నారు. గేమ్‌కు సంబంధించి స్క్రీన్ షాట్‌ను కూడా పోస్ట్ చేశారు. ఈ గేమ్‌లో ఆఖరి వరకు సేఫ్ గేమ్ ఆడినా చివరికి ఇంకోకరు మిగులుతారు కదా. అలాంటప్పుడు కనీసం ఒక్కరినైనా చంపాల్సి వస్తుంది కదా అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. దీనికి బదులుగా.. చివరికి మిగిలిన వ్యక్తి బ్లూజోన్‌లో చిక్కుకొని ఫినిష్ అయ్యిఉంటాడని మరికొందరు బదులిస్తున్నారు.ఇటీవలే అర్జున్ సురవరం చిత్రం ప్రమేషన్‌లో భాగంగా పబ్జి గేమ్‌లో ప్రత్యేకంగా ఓ రూమ్‌ను క్రియేట్ చేసి తన అభిమానులతో కలిసి నిఖిల్ గేమ్ ఆడిన విషయం తెలిసిందే. ZERO KILLS Yet Solo Game CHICKEN DINNER... This happened yesterday in PUBG to me 😁😁😁 Non Violent Peaceful Chicken Dinner... 🤣 pic.twitter.com/1HVBw6KUwS — Nikhil Siddhartha (@actor_Nikhil) March 28, 2019 -
వాయిదా పడిన ప్రతిసారీ హిట్టే
నిఖిల్ సిద్ధార్థ్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్ పి అండ్ ఔరా ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. పతాకాలపై టి. ఎన్. సంతోష్ దర్శకత్వంలో రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయాలనుకున్నారు. అయితే వాయిదా వేశారు. మే 1న విడుదల చేయనున్నట్లు శనివారం చిత్రబృందం ప్రెస్మీట్లో పేర్కొంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ– ‘‘హ్యాపీడేస్’ నుండి ‘అర్జున్ సురంవరం’ వరకు 16 చిత్రాలు చేశాను. అన్ని సినిమాల్లోకి ఈ చాలా బాధ్యత గల సినిమా ఇది. టాప్ రిపోర్టర్ అవ్వాలనుకునే అర్జున్ క్యారెక్టర్ని ఈ చిత్రంలో ప్లే చేస్తున్నాను. ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా, పడగొట్టాలన్నా మీడియాకి పవర్ ఉంటుంది. మీడియాలో ఉన్న పాజిటివ్, నెగిటివ్ అన్ని విషయాలు ఈ చిత్రంలో చూపిస్తున్నాం. నా కెరీర్లోనే మోస్ట్ రెస్పాన్సిబుల్‌గా ఫీలై ఒళ్లు దగ్గర పెట్టుకొని చేసిన సినిమా ఇది. ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. సినిమా అంతా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మే 1న రిలీజ్ చేస్తున్నాం. నైజామ్ ఏషియన్ సునీల్ విడుదల చేస్తున్నారు. ఆయనకి థ్యాంక్స్. నా సినిమాలు పోస్ట్‌పోన్ అయిన ప్రతిసారీ హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. మా చేతిలో మంచి సినిమా రెడీగా ఉంది. అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైనా సినిమా బాగా రావడానికి నిర్మాతలు ‘ఠాగూర్’ మధు, రాజ్‌కుమార్ ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు’’ అన్నారు. నిర్మాత రాజ్‌కుమార్ ఆకెళ్ల మాట్లాడుతూ – ‘‘సినిమా బాగుండాలని కాంప్రమైజ్ కాకుండా చేశాం. సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇప్పుడు ఎన్నికల జోరు ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు మే 1న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు ‘ఠాగూర్’ మధు పాల్గొన్నారు. -
‘అర్జున్ సురవరం’ వాయిదా పడనుందా!
యువ కథనాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం అర్జున్ సురవరం. కోలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముందగా ముద్ర అనే టైటిల్‌ను నిర్ణయించారు. కానీ శ్రీకాంత్ హీరోగా అదే పేరుతో ఓ సినిమా ఇటీవల రిలీజ్ కావటంతో నిఖిల్ సినిమాకు టైటిల్‌కు మార్చక తప్పలేదు. రిలీజ్ విషయంలోనూ అర్జుణ్ సురవరంకు ఇబ్బందులు తప్పటం లేదు. ఈ సినిమాను గత ఏడాది నవంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవటంతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మార్చి 29న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ఉండటంతో ఈ టైంలో రిలీజ్ చేస్తే వసూళ్ల మీద ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారట. ఒకవేళ వాయిదా వేయాల్సి వస్తే ఏప్రిల్‌లో రిలీజ్ చేయటం కూడా కష్టమే. ఇప్పటికే ఏప్రిల్ డైరీ ఫుల్ అయి పోయింది. దీంతో మే 1న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట అర్జున్ సురవరం టీం. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. -
‘శ్వాస’ ఆగిపోయిందా?
‘కిరాక్ పార్టీ’తో ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయాడు నిఖిల్. సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న ఈ యువ హీరో కెరీర్‌కు కిరాక్ పార్టీ అడ్డుకట్టవేసింది. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఓ తమిళ రీమేక్‌పై దృష్టి సారించాడు. కోలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన కణిథణ్ చిత్రాన్ని ‘అర్జున్ సురవరం’ పేరుతో టాలీవుడ్‌కు తీసుకువస్తున్నాడు. టీజర్‌తో ఈ మూవీ ఒక్కసారిగా భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. అయితే నిఖిల్ హీరోగా,నివేదా థామస్ హీరోయిన్గా అప్పట్లో శ్వాస అనే చిత్రం మొదలైంది. తాజాగా ఈ మూవీపై ఓ రూమర్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పక్కన పడేశారనీ, ఈ సినిమాను ఆపేశారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా స్పందించలేదు. అర్జున్ సురవరం తరువాత నిఖిల్ కార్తికేయ సీక్వెల్లో నటిస్తాడని సమాచారం. -
‘అర్జున్ సురవరం’ మూవీ స్టిల్స్