Art of Living
-
కళాత్మక భావనలు విరిసిన వేదిక!
హైదరాబాద్: ఆర్ట్ ఆఫ్ లివింగ్, వరల్డ్ ఫోరమ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరపు అతిపెద్ద సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేడుక భావ్-2024 బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో వైభవంగా జరిగింది. దిగ్గజ కళాకారులచే కదిలించే ప్రదర్శనలు, పౌరాణిక పాత్రల ఆధారంగా రచించిన కళారూపకాలు, రామాయణ భావోద్వేగ చిత్రణలు, అంతరించి పోతున్న కళారూపాల పునరుజ్జీవనం మొదలైన అంశాలతో జరిగిన ఈ సదస్సుకు దేశం నలుమూలల నుండి అత్యుత్తమ సాంస్కృతిక ప్రతిభావంతులు, వర్ధమాన కళాకారులు హాజరయ్యారు. మానవతావాది, గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ మార్గదర్శకత్వం, ప్రేరణతో జనవరి 25 నుండి 28 వరకు జరిగిన ఈ కార్యక్రమం సంస్కృతి, కళలతో ఆధ్యాత్మికతను మేళవించి సరికొత్త ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది. కళాకారుడి భావోద్వేగ స్థితి ఎలా ఉండాలి అనే ప్రశ్నకు సమాధానంగా, “కళాకారులు భావోద్వేగాలు కలిగి ఉంటారు. ప్రేక్షకులను సంతోషపెట్టే ప్రయత్నంలో కళాకారులు తరచుగా తమను తామే మరచిపోతారు. పాత్రలతో మమేకమై తమ అంతరంగాన్ని, తమ సహజ స్వభావాన్ని సైతం గమనించలేరు. పైగా మనకు ఒకటి కాదు, కోపం, ధైర్యం, దుఃఖం, విరహం – ఇలా తొమ్మిది రకాలైన భావోద్వేగాలు (నవ రసాలు) ఉన్నాయి. జీవితంలో స్థిరత్వం కావాలంటే ఈ భావాలన్నిటినీ అధిగమించి వెళ్లాలి. వీటికి ఆవలగా వెళ్లగలిగినప్పుడే మనకు బలం వస్తుంది.” అని ప్రబోధించారు. ఈ కార్యక్రమానికి తెలుగురాష్ట్రాలకు చెందిన సంగీత, నృత్య కళాకారులు హాజరయ్యారు. వర్ధమాన కళాకారులను, ఇందులో భాగంగా 61 అంశాలపై 153మంది కళాకారులతో పరస్పర చర్చలు, ప్రదర్శనలు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, బృందచర్చలు మొదలైనవి ఏర్పాటు చేశారు. శతాబ్దాల క్రిందటి సంప్రదాయ వర్కరీ యాత్ర, శేషులత కోసురు మొదలైన కర్ణాటక సంగీత ప్రముఖులచే త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఈ భావ్-2024 లో భాగంగా నిర్వహించారు. ఈ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఆధ్యాత్మిక అంశం గురించి వరల్డ్ ఫోరమ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ డైరెక్టర్ శ్రీవిద్య యశస్వి మాట్లాడుతూ.. “ఇటువంటి ప్రదర్శనలలో మనం ఆ ప్రాచీన కాలానికి వెళ్ళిపోయి చూస్తాం. కళాకారుడు కేవలం దైవానికి సమర్పణగా మాత్రమే ప్రదర్శన ఇస్తాడు. ఇక చూసేవారు ఆ అనుభవానికి ప్రేక్షకులుగా ఉంటారు” అని పేర్కొన్నారు. “ఉదాహరణకు, అయోధ్యలోని దేవాలయాల నుండి 7000 సంవత్సరాలకు పైగా తరతరాలుగా సంప్రదాయబద్ధంగా నాట్యం చేస్తున్న కళాకారులను మేము ఆహ్వానించాము. వారి కళానిబద్ధత, అనుభవ సారాంశం ఇక్కడ జరుగుతున్న అన్ని ప్రదర్శనలలోనూ మనం చూడవచ్చు.” అని ఆమె పేర్కొన్నారు. కళారూపాలకు తమ జీవితాలను అంకితం చేసి, వాటిని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేసిన ప్రముఖ కళాకారులకు కళాసారథి అవార్డులను అందజేశారు. అవార్డు గ్రహీతలలో ఈలపాటకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డా. కొమరవోలు శివప్రసాద్, కేరళకు చెందిన డా. కళామండలం సరస్వతి, మొదలైనవారు ఉన్నారు. డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ శిష్యుడు, ఈలపాట మాంత్రికునిగా, ఆంధ్రకోకిలగా పేరొందిన డా. కొమరవోలు శివప్రసాద్ మాట్లాడుతూ.. ''కళా సారథి అవార్డు అందుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో అవార్డులు అందుకున్నాను కానీ ఈ కళాసారథి అవార్డు దివ్యత్వంతో కూడినది. పవిత్రమైన ఈ ఆశ్రమ వాతావరణంలో ఎక్కడ చూసినా చాలా కష్టపడి పనిచేసిన కళాకారులు కనిపిస్తున్నారు. 93 ఏళ్ల వయస్సు ఉన్న కళాకారులు సైతం ఉన్నారు. వారిని కలుసుకోగలగడం, వారి ఆశీస్సులు తీసుకోవడం ఒక అందమైన అనుభవం." అని పేర్కొన్నారు. భావ్-2024 సదస్సులో తన అనుభవాన్ని శేషులత కోసూరు పంచుకున్నారు, తనకు సంగీతమే గొప్ప సాంత్వన చేకూరుస్తుందని తెలిపారు. ఇతరుల అనుభవాలను తెలుసుకునేందుకు గొప్ప అవకాశాన్నిచ్చిందని ప్రముఖ వైణికుడు ఫణి నారాయణ పేర్కొన్నారు. ఇలాంటికార్యక్రమాలు ప్రతీ ఏటా జరగాలన్నారు. సంగీతకారులకు భావ్ అనేది చాలా సముచితమైన గౌరవం అని ఈమని శంకరశాస్త్రిగారి కుమార్తె ఈమని కళ్యాణి పేర్కొన్నారు. భానుమతీ నరసింహన్ రచించిన ‘సీత’ పుస్తకం ఆధారంగా నృత్యరూపకాన్ని ప్రదర్శించిన ప్రముఖ శాస్త్రీయ నృత్యకళాకారిణి క్రాంతి నారాయణ్, వర్ధమాన నాట్య కళాకారిణి వనజా ఉదయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్తాద్ ఫజల్ ఖురేషీతో పండిట్ కాళీనాథ్ మిశ్రా తబలా వాద్య కచేరీ, కేరళకు చెందిన ఇర్రంగాపురం బాబు చెండ వాద్యం, కథక్ కేంద్ర చైర్పర్సన్ ఉమా డోగ్రా ప్రదర్శించిన ‘శబరి’ నృత్యరూపకం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మూడు తరాలకు చెందిన కథక్ నృత్య కళాకారిణులు పద్మాశర్మ, గౌరీ, తారిణి తమ అభినయాన్ని ఈ వేదికపై లయబద్ధంగా ప్రదర్శించారు. దృష్టిలోపం, ప్రత్యేక అవసరాలు కలిగిన కళాకారులు రంగ్ గంధ్ పేరిట ప్రదర్శించిన ప్రత్యేక కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇవి చదవండి: ఈజిప్ట్ అమ్మాయి నోట మన దేశభక్తి గీతం..మోదీ ప్రశంసల జల్లు! -
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు (ఫోటోలు)
-
USA : ఘనంగా జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ 4వ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు
వాషింగ్టన్ డి.సి. లోని నేషనల్ మాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 4వ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలలో మొదటిరోజునే రికార్డు స్థాయిలో పది లక్షలమంది ప్రజలు ప్రత్యక్షంగా హాజరై తిలకించారని చెప్పడానికి మేము చాలా ఆనందిస్తున్నాము. ప్రపంచంలోని భిన్న సంస్కృతుల సమాహారంగా, మానత్వం, శాంతి సందేశాల ద్వారా మానవాళిని ఏకంచేసే ఉద్దేశ్యంతో రూపొందిన ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు 180 దేశాలనుండి కళాకారులు ఇక్కడకు చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులలో ఐక్యరాజ్యసమితి 8వ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, వాషింగ్టన్ డి.సి. నగర మేయర్ మురియెల్ బౌసర్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పోంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఛాన్సలర్ బిషప్ ఎమెరిటస్, మార్సెలో శాంచెజ్ సోరోండో మొదలైనవారు ఉన్నారు. మొదటిరోజు కార్యక్రమంలో భాగంగా గ్రామీ అవార్డు గ్రహీత చంద్రికా టాండన్, 200 మంది కళాకారుల బృందంచే అమెరికా ది బ్యూటిఫుల్, వందేమాతరం మనోహర సంగీత ప్రదర్శన, పంచభూతం పేరిట, 1000 మంది భారతీయ శాస్త్రీయ నృత్యకళాకారులచే శాస్త్రీయ నృత్య-వాద్య సంగమం, గ్రామీ అవార్డు విజేత మిక్కీ ఫ్రీ నేతృత్వంలో 1000 మంది కళాకారులచే ప్రపంచ గిటార్ వాద్యగోష్టి, ఇంకా ఆఫ్రికా, జపాన్, మధ్యప్రాచ్య దేశాల కళాకారుల ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి. -
USA : ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు
అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జరుగనున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి అక్టోబర్ 1 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రపంచ సంస్కృతులలోని భిన్నత్వాన్ని ఒకే వేదికపైకి చేర్చే ఈ ఉత్సవాలను గతంలో 3 సార్లు వివిధ దేశాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించింది. 4వ విడత ఉత్సవాలను ఈ ఏడాది వాషింగ్టన్ డిసిలోని నేషనల్ మాల్ ప్రాంగణంలో మరింత ఘనంగా, చిరస్మరణీయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసిలోని క్యాపిటల్ భవనం ముందున్న విశాల ప్రాంగణంలో ఫుట్ బాల్ మైదానమంత విస్తీర్ణంలో భారీ వేదికను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుండి 17,000 మంది కళాకారులు, అనేక దేశాల నేతలు, ప్రముఖులు ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నారు. లక్షలమంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటారని అంచనా వేస్తున్న ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా 50కి పైగా ప్రదర్శనలు జరుగబోతున్నాయి. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి అమరుడయిన మార్టిన్ లూధర్ కింగ్ ప్రఖ్యాత ఉపన్యాసం “ఐ హావ్ ఎ డ్రీమ్” ను నేషనల్ మాల్ వేదికపై నుండే ఇచ్చారు.1963వ సంవత్సరంలో జరగిన ఈ ఉపన్యాసం ద్వారా ప్రపంచ సమైక్యత, సమానతా సందేశాన్ని అందరికీ చాటిచెప్పాడు. దానికి ఒక శతాబ్ది క్రితం షికాగోలోని ప్రపంచ పార్లమెంటు సదస్సులో స్వామి వివేకానందుని ఉపన్యాసం అక్కడి ప్రజలను సన్మోహితులను చేసి, ఆయన జ్ఞానానికి పాదాక్రాంతులను చేసింది. ప్రపంచంలోని వివిధ మత నాయకులను తన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు గా పేర్కొంటూ మతవిశ్వాసాల పేరుతో ప్రజలను విభజించడం, ఇతర ధర్మాల పట్ల అసహనం విడనాడ వలసిందిగా అతడు హితవు పలికాడు. ఈ సెప్టెంబర్ 29వ తేదీన ప్రారంభం కానున్న ఈ చారిత్రాత్మక ఉత్సంలో శ్రీ శ్రీ రవిశంకర్, ప్రపంచంలో దేశాలు, ధర్మాలు, జాతుల మధ్య భేదాభిప్రాయాలను, అంతరాలను చెరిపివేసి, 180 దేశాలకు చెందిన ప్రజలను “ఒకే ప్రపంచ కుటుంబం” గా ఒకే వేదికపై ఆవిష్కరిస్తారు.మానవాళిని సమైక్యంగా ఉంచేవాటిలో ప్రధాన పాత్రగా ఉండే ఆహారం అనేది ఇక్కడ కూడా తన పాత్రను పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధదేశాలకు చెందిన వంటకాలు ఇక్కడి కార్యక్రమాలకు హాజరయ్యే ప్రేక్షకులకు విందుచేయనున్నాయి. ఈ సారి అనేకమంది ఔత్సాహిక కళాకారులు సైతం తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం విశేషం. ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా హాజరౌతున్నవారిలో ఐక్యరాజ్య సమితి 8వ సెక్రటరీ జనరల్ బాన్-కి-మూన్, భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్, అమెరికాలోని ప్రముఖ వైద్యుడు వివేక్ మూర్తి, అమెరికా సెనేటర్ రిక్ స్కాట్, నాన్సి పెలోసి, భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, సురినామ్ దేశ రక్షణ మంత్రి కృష్ణకుమారి మాథెరా ఉన్నారు. -
‘ఇండియా మెడిటేట్స్’ ప్రచారాన్ని ప్రారంభించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్
బెంగుళూరు\హైదరాబాద్: ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ‘హర్ ఘర్ ధ్యాన్’ కార్యక్రమానికి తోడుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఈ నెల 24 నుండి 31 వరకూ ‘ఇండియా మెడిటేట్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. విభిన్న నేపథ్యాలకు చెందిన అన్ని వయస్సుల వ్యక్తులకూ ధ్యానాన్ని పరిచయం చేసి వారిలో స్వీయ అవగాహన తీసుకురావటం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టింది. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంపూర్ణ మద్దతుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15న) ముగుస్తుంది. దేశపు సర్వతోముఖ అభివృద్ధిలో కీలకమైన మైలురాయిగా ఈ కార్యక్రమం నిలిచిపోనుంది. ఇండియా మెడిటేట్స్ కార్యక్రమంలో భాగంగా ప్రతీరోజూ ఎనిమిది సార్లు (ఉదయం 6గం, 7గం, 8గం. లకు, మధ్యాహ్నం 2గం, 3గం, 4గం. లకు, మరలా సాయంత్రం 7గం, 8గం. లకు)ఆన్లైన్ ద్వారా ఉచితంగా ధ్యాన శిక్షణను అందిస్తున్నారు. ఈ ప్రత్యక్ష ఆన్లైన్ సెషన్లను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి నిపుణులైన శిక్షకులు నిర్వహిస్తారు ఇండియా మెడిటేట్స్ కార్యక్రమంలో పాల్గొనటం కోసం ఔత్సాహికులు indiameditates.org వెబ్ సైట్ లో పేరు నమోదు చేసుకోవలసి ఉంటుంది. అనంతరం వారికి వాట్సప్ గ్రూపు ద్వారా ప్రత్యక్ష ప్రసారపు లింకు అందించబడుతుంది. అంతేకాక ఈ విధానంలో ధ్యానం నేర్చుకున్న వారంతా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా గుర్తింపు పొందిన సర్టిఫికెట్ ను కూడా అందుకుంటారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో 2 లక్షలమందికి పైగా భారతీయులు రిజిస్టర్ చేసుకున్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలలో భాగంగా భారతసాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్ట్ ఆఫ్ లివింగ్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ధ్యానానికి గల సుగుణాలను, మన జీవితాలలో ధ్యానం కలిగించే పరివర్తనను గురించి భారతీయులందరికీ తెలియజేయడమే దీని లక్ష్యం.అక్టోబరు 26, 2022న బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ చేతులమీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. అప్పటి నుండి హర్ ఘర్ ధ్యాన్ దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును పొందింది. ఇటీవలి కాలంలోనే లక్షలాదిమంది ఔత్సాహికులు అంతర్జాలం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుదేవ్ రవిశంకర్ మాట్లాడుతూ “ధ్యానం మీ దృక్కోణాన్ని మార్చడానికి సహాయపడుతుంది. ఇది మీరు విషయాలను గ్రహించే విధానాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీ సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుస్తుంది. మీరు మాట్లాడే విధానం, వివిధ పరిస్థితులలో మీ స్పందనలు, మీరు వ్యవహరించే తీరు. వీటి పట్ల మీరు మరింత ఎరుకతో వ్యవహరిస్తారు’’ అని పేర్కొన్నారు. ధ్యానం రోగనిరోధక శక్తిని పెంచుతుందని, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించి, వారి మనస్సును అదుపులో ఉంచి శారీరక మానసిక సామర్థ్యాన్నిపెంచుకోవడానికి తోడ్పడుతుందని నిరూపించబడింది. ఇండియా మెడిటేట్స్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణా పోలీసు శాఖ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ధ్యానశిక్షణను ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసు అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా సూచన మేరకు తెలంగాణాలోని 13 బెటాలియన్లలో సిబ్బందికి ధ్యానశిక్షణ ఇవ్వటం జరుగుతోంది. ఇప్పటికే 1000మందికి పైగా సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా యూనియన్ బ్యాంకు బ్రాంచీలలోని ఉద్యోగులందరికీ ఈ శిక్షణను అందిస్తున్నట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ఉద్యోగులు, కళాశాలలు, విద్యాలయాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ధ్యాన శిక్షణను పొందారు. -
శక్తి.. యుక్తి.. భక్తిల మేలు కలయికే హనుమంతుడు: స్వామి సూర్యపాద
హైదరాబాద్: ధ్యానం, జ్ఞానం ద్వారా మనిషి జీవితంలో ఒత్తిడిని తొలగించి ప్రపంచ శాంతిని తేవటమే గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ లక్ష్యమని స్వామి సూర్యపాద పేర్కొన్నారు. 10వ తేదీ శనివారం సాయంత్రం కర్మన్ ఘాట్‌లోని ధ్యానాంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా సత్సంగానికి వందలాది భక్తులు హాజరయ్యారు. సాయంత్రం 6.30 గంటలకు ఓంకారం, గణేశస్తుతితో కార్యక్రమం ప్రారంభమైంది. శక్తి, యుక్తి, భక్తిల కలయికగా హనుమంతుని స్తుతించిన స్వామీజీ, ప్రశాంతత, ధైర్యం, విశ్వాసం సమపాళ్లలో కలిగి ఉండాలనే విషయాన్ని ధ్యానాంజనేయస్వామి నుండి మనం నేర్చుకోవాలని సూచించారు. అనంతరం శ్రీరామ, కృష్ణ, సరస్వతీ దేవతలను, సద్గురువును స్తుతిస్తూ సాగిన స్వామీజీ సుమథుర గానంతో భక్తులందరూ గొంతు కలిపారు. ప్రతీ భజన అనంతరం కొద్ది సేపు భక్తులందరితో చేయించిన ధ్యానం వారికి అలౌకికానుభూతిని కలిగించింది. స్వామి సూర్యపాద గారు పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ గురుదేవుల స్ఫూర్తితో గత మూడు దశాబ్దాలుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగ, జ్ఞాన, ధ్యాన కార్యక్రమాలను ప్రజలకు నేర్పుతున్నారు. భక్తిపూర్వకమైన హృదయంతో వారు సత్సంగాలలో పాడే భజనలు, వాటికి తోడుగా చేసే ఉపదేశ వాక్యాలు బహుళ జనాదరణ పొందటమే కాక, ప్రజల్లో చక్కని పరివర్తనను కలిగించేందుకు, వారిని మంచి మార్గంలో నడిపించేందుకు దోహదపడుతున్నాయి. పూర్వం లక్ష్మీదేవి పల్లెగా పేరొందిన కర్మన్ ఘాట్‌లోని ఆంజనేయస్వామి దేవాలయానికి ఘనమైన చరిత్ర ఉంది. అప్పటి గోల్కొండ కోటను జయించి చుట్టుపక్కల హిందూ దేవాలయాలను నాశనం చేస్తూ వస్తున్న అల్లాఉద్దీన్ ఖిల్జీ ఈ పల్లెకు వచ్చి, అక్కడి ధ్యానాంజనేయస్వామి మూర్తిని చూసి నిరుత్తరుడై నిలిచిపోగా, ఈ మూర్తిని దర్శించాలంటే నీ మనసు స్థిరంగా ఉండాలని చెబుతూ ఆలయ పూజారి 'కరో మన్ ఘట్' అని అన్న మాటతో, ఆ ఆలయానికి హాని చేయకుండా ఖిల్జీ మరలిపోయాడని, ఆనాటి నుంచి ఆ ప్రాంతం కరో మన్ ఘట్ లేదా కర్మన్ ఘాట్‌గా పేరు తెచ్చుకుందని చెబుతారు. ఇంతటి చారిత్రక ప్రాధాన్యం కలిగిన ధ్యానాంజనేయస్వామి ప్రాంగణంలో జరిగిన ఈ మహా సత్సంగం భక్తుల హృదయాల్లో మధురానుభూతులను మిగిల్చి, ఈ ప్రాంతమంతటికీ సకల శుభాలను కలిగించినదనడంలో సందేహం లేదు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అపెక్స్ సభ్యులు రామ్‌కుమార్ రాఠీ, కృష్ణమూర్తి, కో-ఆర్డినేటర్లు శ్రీనివాస్, రోహన్, అనూప్ తదితరులు పాల్గొన్నారు. -
మత్తుమందులను వదిలేద్దాం : శ్రీశ్రీ రవిశంకర్
హిసార్, (చంఢీగఢ్) : చంఢీగఢ్ విశ్వవిద్యాలయ ప్రాంతం 'నేను డ్రగ్స్ తీసుకోను, ఎవరిని తీసుకోనివ్వను' అనే నినాదాలతో మారుమ్రోగింది. మత్తుమందుల రహిత భారతదేశం పేరిట ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రారంభించిన కార్యక్రమంలో రెండు రోజులపాటు 60 వేల మంది విద్యార్థులు ప్రత్యక్షంగా, కోటిమంది సామాజికమాధ్యమాల ద్వారా పాల్గొని మత్తుమందులకు వ్యతిరేకంగా పని చేస్తామని ప్రతిన పూనారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి శ్రీశ్రీ రవిశంకర్ ప్రసంగించారు. 'మన దేశపు యువతను బలోపేతం చేయాలి. వారిని బలహీనపరిచే మత్తు మందులు వంటి వాటిని నిషేధించాలి. ఆనందం, సరదా, ప్రేమ కోసం ప్రజలు మత్తు పదార్థాల ఊబిలో పడతారు. వాటికి బదులుగా మాతో చేయి కలపండి. మిమ్మల్ని ఎప్పటికీ వీడిపోని ఆనందాన్ని, ప్రేమమత్తును మేం చూపిస్తాం. ఉన్నతంగా ఉండే మనసు మాత్రమే ప్రేమను, ఆనందాన్ని ఇవ్వగలదు' అని పేర్కొన్నారు. దేశంలో మత్తు మందుల వాడకానికి వ్యతిరేకంగా అనేక సంవత్సరాలుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేపడుతున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. 'మత్తు పదార్థాల నుండి భారత దేశాన్ని విముక్తం చేసేందుకు శ్రీశ్రీ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేపట్టిన కార్యక్రమాలను మన పూర్వకంగా ప్రశంసిస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రజల హృదయాలలోకి ఎంతగా చొచ్చుకుపోయిందో నేను గమనించాను. వివిధ వర్గాల ప్రజలు, చలనచిత్ర పరిశ్రమ, క్రీడాకారులు, సామాజిక మాధ్యమాలలో కోట్లాదిమంది ఈ కార్యక్రమానికి చేయూత నివ్వడం ముదావహం' అని మోదీ అన్నారు. ఇది కేవలం మానసిక- సామాజిక- ఆరోగ్య సమస్య మాత్రమే కాదని, మత్తు మందుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం జాతి వ్యతిరేక శక్తులు, తీవ్రవాదుల చేతుల్లోకి వెళుతుందని గమనించాలని కోరారు. చండీగఢ్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ సహా, ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, ర్యాప్ గాయకుడు, గేయ రచయిత బాద్షా, హాస్య నటుడు కపిల్ శర్మ, ప్రముఖ పంజాబీ జానపద గాయకుడు గురుదాస్ మాన్, పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్ పాల్గొన్నారు. రెండవరోజున హిస్సార్ లో జరిగిన కార్యక్రమాన్ని హర్యానా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో గురుదేవులతో పాటు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ప్రముఖ నటుడు వరుణ్ శర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించి, ప్రజలను మత్తుమందులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచటం కోసం దేశంలోని పట్టణాలు, గ్రామాలలో మార్చి 10వ తేదీన వాకథాన్ నిర్వహించనున్నట్లు గురుదేవ్ శ్రీశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు సంజయ్ దత్ మాట్లాడుతూ మత్తు మందుల వలన తాను ఎదుర్కొన్న మానసిక క్షోభను, తాను చేసిన యుద్ధాన్ని వివరించారు. 'నా నోటి నుండి, ముక్కు నుండి రక్తం పడేది. తిండి తినలేక పోయే వాడిని. నన్ను నేను అద్దంలో చూసుకుంటే భయపడేవాడిని. నాకు సహాయం కావాలని మా నాన్నని అర్థించాను' అని గుర్తుచేసుకున్నారు. ఆ అలవాటు నుండి బయటపడ్డ అనంతరం సైతం ఒక మత్తు మందుల వ్యాపారి తనను సంప్రదించినట్లు, ఆ క్షణం నుండే తాను జీవితంలో మరలా వాటి జోలికి పోకూడదని నిర్ణయించుకున్నట్లు సంజయ్‌దత్ తెలిపారు. దేశవ్యాప్తంగా 12 వేల కళాశాలలోని కోటి మంది విద్యార్థులు అంతర్జాలం (వెబ్ కాస్ట్) ద్వారా జరిగిన కార్యక్రమంలో మత్తుమందులకు వ్యతిరేకంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ పూనారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ గాయకుడు బాద్షా మాట్లాడుతూ, మీ జీవితంలో ఉన్నత ఆశయాలను గుర్తుంచుకోమని కోరారు. ఆశయాలు ఉన్నతంగా ఉంటే అవి మిమ్మల్ని మత్తు మందుల వైపు పోకుండా చూస్తాయని అన్నారు. 'నేను ఎప్పుడూ వాడలేదు. కానీ నా మిత్రుడు, అతను నాకంటే బాగా పాడేవాడు. అతడు వీటి బారిన పడ్డాడు, ఇవాళ ఆతడు జీవించి లేడు. నా ఆనందాన్ని సంగీతంలో చూశాను. మీరు మీ ఆనందాన్ని తెలుసుకోండి. ఎందుకంటే ఈ దేశానికి మీరే భవిష్యత్తు' అని బాద్షా అన్నారు. కార్యక్రమంలో భాగంగా దేశంలోని కళాశాలలో స్వాట్ క్లబ్ (సోషల్ వెల్నెస్ అండ్ అవేర్నెస్ ట్రైనింగ్) పేరిట సంఘాలను నెలకొల్పి, వాటి ద్వారా మత్తుమందుల దుష్ప్రభావాలపై అవగాహన కలిగించటం, వాడకుండా నివారించే చర్యలు చేపట్టనున్నారు. డ్రగ్ ఫ్రీ ఇండియా (మత్తుమందుల రహిత భారతదేశం) సామాజిక మాధ్యమాలలో ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందింది. చలనచిత్ర పరిశ్రమ, క్రీడలు, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన 90 మందికి పైగా ప్రముఖులు ఈ కార్యక్రమానికి మద్దతు పలికారు. -
'శ్రీశ్రీ రవిశంకర్ మమ్మల్ని మోసంచేశారు'
శ్రీనగర్: ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌కు కశ్మీర్లో ఊహించని పరిస్థితి ఎదురైంది. కశ్మీర్లో ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగా.. యువకులు ఒక్కసారిగా 'ఆజాదీ' నినాదాలు ఇచ్చారు. దీంతో రవిశంకర్ ఉలిక్కిపడ్డారు. అసలు రవిశంకర్ అంటే ఎవరో తమకు తెలియదని, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తే.. తాము ఇక్కడికి వచ్చామని స్థానిక యువకులు తెలిపారు. ఇక్కడికి వచ్చాక 'మెసేజ్ ఆఫ్ లవ్' గురించి ప్రసంగాలు చేస్తున్నారని, వాటికి తాము వ్యతిరేకమని సభ మధ్యలోనే వారు వెళ్లిపొయారు. మరికొందరు యువకులు క్రికెట్ కిట్లు, డబ్బులు ఇస్తామంటే చాలా దూరం నుంచి వచ్చామని, రవిశంకర్ మమ్మల్ని మోసం చేశారని బారాముల్లా నుంచి వచ్చిన యువకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మధ్య కశ్మీర్ నుంచి వచ్చిన మరికొంతమంది ఇస్లాం మతగురువులు వస్తున్నారని చెప్పి, ఈ ఆధ్యాత్మిక గురువును తీసుకొచ్చారని నిర్వాహకులపై మండిపడ్డారు. దీనిపై స్పందించిన రవిశంకర్ కశ్మీర్ ప్రజల్లో ప్రేమ, శాంతిని నెలకొల్పాలని ఇక్కడ సభను ఏర్పాటు చేశానని తెలిపారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, మరో రెండు రోజులపాటు ఇక్కడే ఉండి కశ్మీర్ ప్రజల్లో ప్రేమ, ఆప్యాయత, సంతోషంతో కూడిన సుహృద్భావ వాతావరణం కోసం ప్రయత్నిస్తానని తెలిపారు. -
గ్రామీ అవార్డుల రేసులో ‘అనంత’ ఆల్బమ్
సాక్షి, హైదరాబాద్: ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ విడుదల చేసిన ‘అనంత వాల్యూమ్–1 మెస్ట్రోస్ ఆఫ్ ఇండియా’ శాస్త్రీయ సంగీత ఆల్బమ్ 60వ గ్రామీ అవార్డుల ‘వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్’ పోటీకి ఎంపి కైంది. ప్రసిద్ధ ఘటం విద్వాంసుడు పండిట్ విక్కు వినాయక్ రామ్ ఆధ్వర్యంలో మూడు తరాలకు చెందిన విద్వాంసులు పండిట్ విక్కు వినాయక్ రామ్, సెల్వగణేశ్ స్వామినాథన్‌ల సహకారంతో సిద్ధాంత్ భాటియా స్వరపరచిన ‘గురుస్తోత్రం’ అనే పాట గాత్రవాద్య విభాగంలో పోటీకి ఎంపికైనట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది.‘అనంత’ ఆల్బమ్ రికార్డింగ్ 33 రోజులలో పూర్తి చేశారు. దాని రూపశిల్పి సిద్ధార్థ్ భాటియా దేశవ్యాప్తంగా పర్యటించి.. ఆయా ప్రాంతాల్లో సహజమైన సంగీతాన్ని అప్పటికప్పుడు రికార్డు చేశారు. సంగీతం సహజంగా జాలువారే అపురూప క్షణాలను ఒడిసిపట్టడమే లక్ష్యంగా సాగిన ఈ ఆల్బమ్‌లోని పాటలు సైతం అప్పటికప్పుడు తయారుచేసినవే. ఈ ఆల్బమ్ 30 మంది సంగీత దిగ్గజాల గాత్ర, స్వర సహకారంతో 300 నిమిషాల నిడివితో ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ సంగీత సంకలనంగా నిలిచింది. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ బాలల విద్య, సంక్షేమ పథకాలకు వినియోగించనుంది. త్రివేణి సంగమంలా.. ప్రేమ, భక్తి, మౌనంల త్రివేణి సంగమంలో నుంచి ఈ ఆల్బమ్‌లోని పాటలు పుట్టాయని.. సంగీత, ఆధ్యాత్మిక ప్రపంచంలోని అత్యుత్తమ స్థాయిని ‘అనంత’ ఆవిష్కరించిందని రూపశిల్పి సిద్ధాంత్ భాటియా పేర్కొన్నారు. ఈ ఆల్బమ్‌లో గ్రామీ విజేతలు పండిత్ విక్కు వినాయక్రామ్ (ఘటం), పండిత్ విశ్వమోహన్ భట్ (మోహన వీణ), స్వరకర్త కళారామ్నాథ్, గ్రామీ అవార్డుకు గతంలో నామినేటైన యు.రాజేష్ (మాండలిన్), పండిత్ తేజేంద్ర నారాయణ్ మజుందార్ (సరోద్)ల వాద్య సంగీతాలున్నాయి. గాత్ర సంగీతంలో ప్రముఖులైన పండిత్ జస్రాజ్, అరుణా సాయిరామ్, ఉస్తాద్ షహీద్ పర్వేజ్ ఖాన్, ఉస్తాద్ రషీద్‌ఖాన్, లైఫ్ ఆఫ్ పై చిత్రానికి ఆస్కార్ అవార్డును అందించిన బోంబే జయశ్రీల కృతులూ ఉన్నాయి. యువ కళాకారులైన పుర్బయాన్ ఛటర్జీ (సితార్), రాజేశ్ వైద్య (వీణ), రాకేష్ చౌరాసియా (వేణువు), బాలీవుడ్ గాయకులు హరిహరన్, కె.ఎస్.చిత్ర, జావేద్ అలీ కూడా ఇందులో పాలుపంచుకున్నారు. -
శాంతితోనే సామరస్యం
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ సాక్షి, హైదరాబాద్: అభిప్రాయభేదాలు ఉండ టం తప్పు కాదని, శాంతితోనే ఈ భేదాలన్నీ సమసిపోయి సామరస్యం వెల్లివిరుస్తుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. అజ్ఞాతంలో పనిచేస్తోన్న ఎలాంటి తీవ్రవాద సంస్థలైనా తిరిగి జనజీవనస్రవంతిలో కలిసేందుకు తమ వంతు సహాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అస్సాంలోని గువాహటిలో గురు వారం ‘భిన్నత్వంలోని బలం – ఈశాన్య రాష్ట్రాల ఆదిమ ప్రజల సదస్సు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అనంతరం అస్సాం తీవ్రవాద సంస్థ ఉల్ఫా జనరల్ సెక్రటరీ అనూప్ చెతియాతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.వివిధ తీవ్రవాద గ్రూపులు ఒకే వేదికపై ఈశాన్య రాష్ట్రాల సమస్యలపై చర్చించడం సంతోషంగా ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఈ సదస్సు ఒక గొప్ప ముందడుగుగా అభివర్ణించారు. ఆయుధాలను వీడి జనజీవనస్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎంతోమంది యువకులు తమ ఆకాంక్షను వెలిబుచ్చుతున్నా రన్నారు. ఇటీవల ప్రభుత్వానికి లొంగి పోయిన 68 మంది మిలిటెంట్ల విషయంలో ప్రభుత్వ స్పందన కోసం వారు ఎదురు చూస్తు న్నారన్నారు. గత కొన్నేళ్లుగా జరిగిన హింసలో బాధితులైన వారిని చూస్తే హృదయం ద్రవి స్తుందని, ఇప్పటికైనా శాంతి వాతావరణం నెలకొనాలి అని కోరారు. ఈ రోజు తుపాకుల సంస్కృతి నుంచి పూలదండల సంస్కృతి వైపు పయనించామని, బాంబులకు బదులుగా పూలబొకేలు విరుస్తున్నాయని సభను ఉద్దే శించి అన్నారు. ఆఖరి ఆయుధం శాంతించే వరకు ఈశాన్య రాష్ట్రాల్లోని పలు గ్రూపులతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ పని చేస్తూనే ఉంటుం దన్నారు. సదస్సులో తీవ్రవాద నాయకులు, వివిధ గ్రూపుల ప్రతినిధులు, అజ్ఞాత సంస్థల మాజీ నాయకులు పాల్గొన్నారు. -
మీకసలు బాధ్యత లేదా.. రవిశంకర్‌పై కోర్టు మండిపాటు
ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ మీద దేశంలోని అత్యున్నత పర్యావరణ కోర్టు తీవ్రంగా మండిపడింది. ''అసలు మీకు బాధ్యత అన్నది లేదా.. మీరు ఏం కావాలనుకుంటే అది చెప్పేసే స్వేచ్ఛ ఉందని అనుకుంటున్నారా'' అని ప్రశ్నించింది. గత సంవత్సరం ఢిల్లీలో యమునానది తీరంలో తాము మూడు రోజుల పాటు భారీగా నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవం వల్ల ఏమైనా నష్టం కలిగితే, దానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వాన్ని, కోర్టులను అడగాలి తప్ప తనను కాదని రవిశంకర్ వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎవరికైనా జరిమానా విధించాల్సి వస్తే, అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు విధించాలని అన్నారు. యమునా నది నిజంగానే అంత స్వచ్ఛంగా ఉండి ఉంటే, వాళ్లు ముందుగానే అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాన్ని ఆపేసి ఉండాల్సిందని కూడా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులున్న రవిశంకర్ ఈ వ్యాఖ్యలను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. వాటిపైనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా మండిపడింది. ట్రిబ్యునల్ ఆగ్రహంతో కామెంట్ చేసిన తర్వాత రవిశంకర్ తరఫున ఒక ప్రతినిధి స్పందించారు. తాము వేరేలా భావించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, అలాగే ట్రిబ్యునల్ చివరగా ఏమంటుందో దాని తుది ఉత్తర్వులలో తెలుస్తుందని చెప్పారు. తదుపరి విచారణ మే 7వ తేదీకి వాయిదా పడిందని చెప్పారు. ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన వేదిక, మొత్తం వెయ్యి ఎకరాల్లో విస్తరించిన కార్యక్రమం కారణంగా యమునానది తీరం మొత్తం సర్వనాశనం అయ్యిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన నిపుణుల బృందం తేల్చిచెప్పింది. ఈ నష్టాన్ని పూడ్చాలంటే పది సంవత్సరాల సమయం, రూ. 42 కోట్ల ఖర్చు అవుతాయని నిపుణులు చెప్పారు. అయితే యమునానది తీరానికి, అక్కడున్న సున్నితమైన పర్యావరణ వ్యవస్థకు నష్టం వాటిల్లిందన్న వాదనను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, దాని వ్యవస్థాపకుడు రవిశంకర్ ఖండించారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వొద్దని పర్యావరణ వేత్తలు గత సంవత్సరమే అడిగినా.. అప్పటికే సమయం చాలా తక్కువ ఉందని చెప్పిన ఎన్జీటీ.. నిర్వాహకులకు రూ. 5 కోట్ల జరిమానా విధించింది. ప్రపంచంలోనే ఇంత ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తనకు అవార్డు ఇవ్వాల్సింది పోయి ఇలా చేస్తారా అని అప్పట్లోనే రవిశంకర్ మండిపడ్డారు. -
'వరంగల్‌లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్'
వరంగల్: యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వరంగల్‌లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్ గురూజీ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మీకాంతారావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం చక్కటి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. దేశంలోనే ఆధ్యాత్మిక నగరంగా ఓరుగల్లుకు మంచి గుర్తింపు ఉందని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. -
పుష్కర హారతి బాగుంది: రవిశంకర్
-
పుష్కర హారతి బాగుంది: పండిట్ రవిశంకర్
విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఇస్తున్న పుష్కర హారతి బాగుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పండిట్ రవిశంకర్ తెలిపారు. అలాగే పుష్కర ఏర్పాట్లు కూడా బాగున్నాయని ఆయన పేర్కొన్నారు. గురువారం ఉదయం విజయవాడలోని పున్నమిఘాట్లో రవిశంకర్ పుష్కరస్నానమాచరించారు. అనంతరం విలేకర్లతో ఆయన మాట్టాడుతూ.. గోదావరి పుష్కరాలతో పోలిస్తే క్రౌడ్ మేనేజ్మెంట్... చక్కగా నిర్వహిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. గోదావరి పుష్కరాల్లో క్రౌడ్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని పండిట్ రవిశంకర్ గుర్తు చేశారు. -
బ్యాంక్ గ్యారెంటీ కుదరదు.. రూ. 4.75 కోట్లు కట్టాల్సిందే
న్యూఢిల్లీ: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) లో మరోసారి చుక్కెదురైంది. జరిమానాగా చెల్లించాల్సిన 4.75 కోట్ల రూపాయల మొత్తానికి నగదుకు బదులుగా బ్యాంక్ గ్యారెంటీ ఇస్తామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ తరపు న్యాయవాది చేసిన విన్నపాన్ని మంగళవారం ఎన్జీటీ తిరస్కరించింది. వారంలోగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అంతేగాక ఇలాంటి ప్రతిపాదనతో అప్లికేషన్ వేసినందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు ఐదు వేల రూపాయలను జరిమానా వేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ డబ్బును డిపాజిట్ చేయకపోవడాన్ని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ సారథ్యంలోని ధర్మాసనం ఆక్షేపించింది. ఈ ఏడాది మార్చిలో మూడు రోజుల పాటు యమునా నది ఒడ్డున ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 'ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం' నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ వల్ల పర్యావరణ సమస్యలు వస్తాయని, యమునా నది పర్యావరణపరంగా దెబ్బతింటుదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ కేసు విచారించిన ఎన్జీటీ.. రూ. 5 కోట్లు ప్రాథమిక జరిమానా కట్టాలని ఆదేశిస్తూ, షరతులతో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి అప్పట్లో అనుమతి ఇచ్చింది. అయితే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని ఇంతవరకు జమ చేయలేదు. -
మిగతా రూ. 4.75 కోట్లు కట్టండి
న్యూఢిల్లీ: యమునా నదిని కలుషితం చేసిందుకు విధించిన జరిమానా చెల్లించాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్(ఏఓఎల్) ఫౌండేషన్ ను జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించింది. మార్చిలో ఏఓఎల్ నిర్వహించిన ప్రపంచ సాంసృత్కిక ఉత్సవం సందర్భంగా ఎన్జీటీ రూ. 5 కోట్లు జరిమానా విధించింది. అయితే ఏఓఎల్ రూ. 25 లక్షలు మాత్రమే చెల్లించింది. మిగతా మొత్తం రూ. 4.75 కోట్లు చెల్లించాలని ఎన్జీటీ మంగళవారం ఆదేశించింది. యమునా నది తీరంలో శ్రీశ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలో మార్చి 11 నుంచి మూడు రోజుల పాటు వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ నిర్వహించింది. ఈ ఉత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. -
నోబెల్ బహుమతి ఇస్తానంటే.. వద్దన్నాను!
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ఓ చిత్రమైన విషయం చెప్పారు. తనకు గతంలో నోబెల్ శాంతి బహుమతి ఇస్తామంటే.. వద్దని తిరస్కరించానన్నారు. ఇటీవల పాకిస్థానీ అమ్మాయి మలాలా యూసుఫ్జాయ్కి ఈ అవార్డు ఇవ్వడం కూడా సరికాదని, ఆమెకు ఆ అర్హత లేదని చెప్పారు. నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సినంతగా ఆమె ఏమీ చేయలేదని ఆయన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. తాను కేవలం పని చేయడాన్నే నమ్ముతాను తప్ప.. తనకు అవార్డులతో పనిలేదని చెప్పారు. అవార్డులు ఇచ్చేటప్పుడు దానికి తగిన అర్హత ఉందో లేదో చూసుకోవాలని, మలాలాకు ఆ అవార్డు ఇవ్వడం శుద్ధ దండగని అన్నారు. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవలే భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఆ అవార్డు స్వీకరించారు. -
దొంగలు తమ 'ఆర్ట్' చూపించారు!
యమునా నది ఒడ్డున మూడురోజులపాటు జరిగిన 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' భారీ సాంస్కృతిక వేడుకలో దొంగలు తమ చోరకళను ప్రదర్శించారు. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవానికి వచ్చిన విదేశీయులూ, స్వదేశీయుల వద్ద తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. 29 ఏళ్ల ఓ రష్యా మహిళతో సహ 112 మంది వద్ద తమ కళను చాటారు. మొబైల్ ఫోన్లు, పర్సులు, ల్యాప్‌టాప్‌లు.. ఇలా వస్తువులను గుట్టుచప్పుడు కాకుండా కొట్టేశారు. ఈ వేడుకకు సంబంధించి ఇప్పటివరకు 72 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో అత్యధికం దొంగతనాల గురించే ఉన్నాయని పోలీసులు తెలిపారు. పర్యావరణ వివాదాలు చుట్టుముట్టినా 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' స్థాపకుడు శ్రీశ్రీ రవింశకర్ ఆధ్వర్యంలో 'ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం' ఆదివారం ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. మూడురోజుల ఈ వేడుక సందర్భంగా వేదిక వద్ద 30 మందికిపైగా పిక్పాకెటర్లు, దొంగలను అరెస్టు చేశామని, ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెట్టి జైలుకు పంపించామని చెప్పారు. ఇక ఢిల్లీ సన్‌లైట్ కాలనీ పోలీసు స్టేషన్లో నమోదైన 72 ఎఫ్ఐఆర్లలో అత్యధికం దొంగతనానికి సంబంధించినవే. డబ్బు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పర్సులు, గుర్తింపు కార్డులు పోయాయంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీనికితోడు వేదిక వద్ద ఏర్పాటుచేసిన ఓ గణేష్ విగ్రహాన్నీ దొంగలు వదిలిపెట్టలేదు. ఢిల్లీ పోలీసుల 'లాస్ట్ అండ్ ఫౌండ్' యాప్‌కు ఏకంగా మొబైల్ ఫోన్లు పోయినట్టు 40 ఫిర్యాదులు అందాయి. సాంస్కృతిక వేడుకలో ప్రదర్శన ఇవ్వడానికి వచ్చిన రష్యా మహిళ బ్యాగును కూడా దొంగలు కొట్టేశారు. ఆమె ఇలా వేదిక వద్దకు వచ్చి.. తిరిగి గదికి రాగానే.. గ్రీన్ రూమ్‌లోని ఆమె బ్యాగు మాయమైంది. అందులో దుస్తులు, ఇతర వస్తువులు ఉన్నాయి. దీంతో సాంస్కృతిక ఉత్సవంలో ఆమె పాల్గొనలేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. యమునా నది ఒడ్డున నిర్వహించిన ఈ భారీ వేడుకతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ 'ఆర్ట్ ఆఫ్ లివింగ్'పై రూ. 5 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికిప్పుడు అంతమొత్తాన్ని చెల్లించలేమని ఆ సంస్థ కోరడంతో.. రూ. 25 లక్షలు ముందుగా చెల్లించి ఈ వేడుకను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. -
పరిహారంగా కాదు... పునర్నిర్మాణం కోసమే
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ న్యూఢిల్లీ: తాను ఎలాంటి అపరాధ రుసుమూ లేదా పరిహారం చెల్లించనని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ చెప్పారు. యమునా నది తీరంలో జరుగుతున్న ప్రపంచ సాంస్కృతిక సంగమం రెండో రోజు మాట్లాడుతూ.. సభా ప్రాంగణం పునర్నిర్మాణం కోసం రూ. 5 కోట్లు చెల్లించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కోరిందని... దానిని తప్పుగా ప్రచారం చేశారన్నారు. ‘నేను పవిత్రంగా జీవించాను. ఎప్పుడూ స్కూలుకు ఆలస్యంగా వెళ్లలేదు. ఎప్పుడూ ఫైన్ కట్టలేదు. అందుకే పరిహారం కట్టేది లేదని చెప్పాను’ అని చెప్పారు. ఈ ప్రాంతం అభివృద్ధి, పునర్నిర్మాణం కోసమేనని ఎన్జీటీ చెప్పిందని... అందుకు నిండు మనసుతో అవసరమైన సాయం చేస్తానని తెలిపారు. కాగా.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సదస్సు రెండో రోజు కూడా కన్నులపండువగా జరిగింది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో ప్రాంగణం కళకళలాడింది. అందరినీ ఆకట్టుకునేలా సాంస్కృతిక ప్రదర్శనలు సాగాయి. ఈ సాంస్కృతిక ఉత్సవంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. -
'మా సహనంతో ఆటలు ఆడకండి'
న్యూఢిల్లీ: యమునా నది తీరంలో 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' ఫౌండేషన్ నిర్వహించ తలపెట్టిన 'ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం' విషయంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తీరుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీవ్రంగా విరుచుకుపడింది. సమ్మేళనం కోసం నిర్మిస్తున్న నిర్మాణాలు తాత్కాలికమేనన్న పర్యావరణ శాఖ వ్యాఖ్యలపై మండిపడింది. 'ఇవి తాత్కాలిక నిర్మాణాలు అని మీరు ఎలా అనుకుంటారు? మా సహనాన్నీ పరీక్షించకండి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మేళనం నిర్వహణకు పర్యావరణ అనుమతులు తీసుకోవాలని మీరు ఎందుకు అడుగలేదని పర్యావరణ శాఖను ఎన్జీటీ నిలదీసింది. ఇంత భారీ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఇందుకు మీ అనుమతులు అవసరం లేదా? ఈ కార్యక్రమంపై ఎవరైనా సమీక్ష జరిపారా? అని మండిపడింది. అలాగే ఈ వ్యవహారంలో క్రియారహితంగా వ్యవహరిస్తున్న ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీని కూడా ఎన్జీటీ తీవ్రంగా దుయ్యబట్టింది. ఇంత భారీ నిర్మాణాలు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. మీరెందుకు జాతీయ ప్రాజెక్టులు చేపట్టరు? ఇక కేవలం రూ. 15.63 కోట్ల రూపాయల బడ్జెట్‌తోనే ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని 'ఆర్ ఆఫ్ లివింగ్' చేసిన వాదనను ఎన్జీటీ తోసిపుచ్చింది. కేవలం రూ. 15 కోట్లలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టయితే.. జాతీయ ప్రాజెక్టులను కూడా మీరే చేపట్టాలం'టూ పేర్కొంది. మరోవైపు ఈ సాంస్కృతిక సమ్మేళనం విషయంలో ఎవరూ రాజకీయాలు చేయరాదని, సంస్కృతి, మతాలు, భావజాలాల ఐక్యత కోసం కృషి చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని 'ఆర్ ఆఫ్ లివింగ్' స్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ కోరారు. -
‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ అంటే ఇదేనా?
న్యూఢిల్లీ: దారిద్య్ర నిర్మూలన, మహిళలకు సాధికారిత, విద్యాదానం, మానవ విలువలను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల ప్రాతిపదికన ఏర్పడిన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ దేశ రాజధాని ఢిల్లీలో రైతుల పొట్టలు గొట్టింది. పర్యావరణ పరిరక్షిణను తుంగలో తొక్కింది. మొన్నటి వరకు పచ్చని పంటలతో ఏపుగా కాసిన కూరగాయలతో కళకళలాడిన పొలాలను జీసీబీలతో దున్నేసి రైతులకు దు:ఖాన్ని మిగిల్చింది. ఇప్పుడు ఎటూ పాలుపోని రైతులు తమకు ఇక ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. వారంత పనిచేస్తే ఆ పాపం ఎవరిది? కేవలం గిన్నీస్ రికార్డు కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఇదంతా చేసింది. ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అంతర్జాతీయ సమ్మేళనం నిర్వహించేందుకు సన్నాహక ఏర్పాట్లు చేస్తోంది. దానికోసం ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకుంది. వారు యమునా నది పక్కన ఖాళీగా ఉన్న 80 ఎకరాల మైదాన ప్రాంతాన్ని సాంస్కృతిక సమ్మేళనం కోసం వాడుకోవాల్సిందిగా సూచించారు. అందుకు సరేనన్న ఫౌండేషన్ వర్గాలు ఇప్పుడు 150-175 ఎకరాల వరకు సమ్మేళనం కోసం ఉపయోగిస్తున్నారు. దాదాపు వంద ఎకరాలు మినహా మిగతా భూమంతా పంట పొలాలు, కూరగాయల తోటలే. వాటిన్నింటిని జేసీబీలు పెట్టి దున్నించి మైదాన ప్రాంతంగా మార్చేసింది. రైతులు అడ్డం పడితే నష్ట పరిహారం చెల్లిస్తాం, పోపొమ్మంటూ తరమేసింది. అప్పటికి వినని రైతులను పోలీసుల చేత బెదిరించింది. తనది మూడున్నర ఎకరాల పొలమని, మొత్తం చదును చేశారని, కేవలం 26 వేల రూపాయలను నష్ట పరిహారంగా తన జేబులో పెట్టారని పాన్ సింగ్ అనే రైతు సోమవారం నాడు మీడియా ముందు వాపోయారు. వాస్తవానికి తాను ఈసారి పంట వేయడానికి 2.25 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని, అందులో ఎక్కువ భాగం బ్యాంకు నుంచి తీసుకున్న రుణమేనని ఆయన చెప్పారు. నాలుగు భీగాల భూమిలో తాను కాకరకాయ, కీర, బెండకాయ, గోబీలు పండిస్తున్నానని, తనకు 14వేల రూపాయల నష్టపరిహారం ఇచ్చి చదును చేశారని ధరమ్ సింగ్ ఆరోపించారు. వాస్తవానికి తాను గోబీ విత్తనాల కోసం 26 వేల రూపాయలను ఖర్చు చేశానని వాపోయారు. పంటలను కోల్పోయిన 200 రైతు కుటుంబాల్లో వీరిద్దరు. ఈ విసయమై ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వారిని వివరణ కోరగా రైతులంతా భూములను అక్రమంగా ఆక్రమించిన వారేనని, తామె ఇంకా దయతలచి మానవతా హృదయంతో ఆర్థిక సహాయం చేశామని చెబుతున్నారు. ‘గ్రో మోర్ ఫుడ్’ పథకం కింద 1950లో అప్పటి ప్రభుత్వం యమున ఒడ్డునున్న ఈ పొలాలను రైతులకు ఇచ్చిందని ‘ఢిల్లీ పీజంట్ కోపరేటివ్ మల్టీ పర్పస్ సోసైటీ ప్రధాన కార్యదర్శి బల్జీత్ సింగ్ తెలిపారు. పైగా యమునా నది ఒడ్డున ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని చట్ట నిబంధనలు ఉన్నాయి. పర్యావరణాన్ని పరిరక్షిస్తామంటూ చెప్పుకునే ఫౌండేషన్ చ ట్టాన్ని ఉల్లంఘించి 35 వేల మంది కూర్చుని కచేరీలు, మంత్రోచ్ఛారణలు చేసేందుకు వీలుగా భారీ వేదికను నిర్మించింది. అక్కడక్కడా భారీ అంబారీల విగ్రహాలను ఏర్పాటు చేసింది. ఈ సమ్మేళనానికి ప్రపంచ దేశాల నుంచి 35 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కరణ్ సింగ్, ఢిల్లీ సాంస్కృతిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా తదితరులు హాజరుకానున్నారు. ఎప్పుడూ మానవతా విలువల గురించి మాట్లాడే శ్రీశ్రీ రవిశంకర్ రైతులకు జరిగిన అన్యాయం పట్ల పెదవి విప్పడం లేదు. ఇక చేసేదేమీ లేక రైతులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తికి పిటీషన్ పెట్టుకున్నారు. కొన్ని ఎన్జీవో సంస్థలు ఇప్పటికే రైతుల తరఫున కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమ్మేళనం ఏర్పాట్లు దాదాపు 80 శాతం పూర్తయ్యాయని, ఈ దశలో కోర్టు కూడా ఏంచేయలేదని ఫౌండేషన్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
నోబెల్ నామినీల్లో శ్రీశ్రీ రవిశంకర్?
బెంగుళూరు: ప్రపంచ నోబెల్ శాంతి బహుమతి ఈసారి భారతీయులకు వరించనుందా అంటే అవునని ఊహాగానాలు వస్తున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ఈ అవార్డుకు భారత్ నుంచి అర్హుడని, ఈ ఏడాది నామినీల్లో ఆయన పేరు ఉండనుందని థామ్సన్ రాయిటర్స్ సంస్థ పేర్కొంది. కొలంబియాలో శాంతి స్థాపనకు ఆయన ఎంతగానో కృషి చేశారని కొనియాడింది. అయితే, దీనిపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి తెలిపారు. కొలంబియాలో శాంతిని నెలకొల్పేందుకు 2012 నుంచి ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. రవిశంకర్ శాంతి సేవలకుగాను దేశ అత్యున్నత పౌరపురస్కారంతో ఆ ప్రభుత్వం సత్కరించింది. 2015లో క్యూబాలో పర్యటించినపుడు చర్చల ద్వారా కొలంబియా తిరుగుబాటు దళాల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ఆయన కృషి చేశారు. మొత్తం 150 దేశాల్లో ఆయన సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆయన సేవలను గుర్తించి జనవరిలో భారతప్రభుత్వం ఇప్పటికే దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ను కూడా అందించిన విషయం తెలిసిందే. -
మృత్యు ముఖంలో జీవకళ
-
మృత్యు ముఖంలో జీవకళ
* నిమ్స్‌లో బాధితుడి చిరకాల కోరిక తీర్చిన కేటీఆర్ * చెదిరిన ‘సంతోష’ం కథనానికి స్పందన సాక్షి, హైదరాబాద్: ‘ఏం సంతోష్.. ఆరోగ్యం ఎలా ఉంది? విషయం తెలిసిన వెంటనే నిన్ను కలిసేందుకు సత్తుపల్లి వద్దామనుకున్నా. తీరిక లేక రాలేకపోయా. ఆరోగ్యం గురించి ఆందోళన చెందకు. నీ కోసం వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కూడా వెంట తీసుకొచ్చా. నీకు మేమంతా అండగా ఉంటాం. త్వరగా కోలుకోవాలి. వీలైతే డిశ్చార్జ్‌కు ముందే మరోసారి వచ్చి కలుస్తా’... అంటూ నిమ్స్‌లో కొంత కాలంగా మృత్యువుతో పోరాడుతున్న ఖమ్మంజిల్లా బాలుడు సంతోష్ (14)కు మనోధైర్యాన్నిచ్చారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్. పేగులకు ఇన్ఫెక్షన్ సోకి మృత్యువుతో పోరాడుతున్న సంతోష్ ఆరోగ్య పరిస్థితిపై గత నెల 18న ‘సాక్షి’ ఖమ్మం ఎడిషన్‌లో చెదిరిన ‘సంతోష’ం శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ చిన్నారికి కేటీఆర్‌ను చూడాలన్నది చిరకాల కోరిక. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్వయంగా వచ్చి సంతోష్‌ను పలుకరించారు. బాధితునికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా నిమ్స్ డెరైక్టర్ మనోహర్‌ను ఆదేశించారు. కేటీఆర్ వెంట వైద్యఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. పేగులకు ఇన్ఫెక్షన్... ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ నల్లంటి కృష్ణార్జునరావు, జ్యోతి దంపతుల రెండో కుమారుడు సంతోష్ సదాశివునిపేట జిల్లాపరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆటపాటల్లోనే కాదు చదువులోనూ ఎంతో చురుకు. బాసర త్రిబుల్‌ఐటీలో చదవాలనేది అతని ఆశయం. అయితే ఇటీవల ఉన్నట్టుండి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో స్థానిక ఆసుపత్రిలో సంప్రదించారు. పేగులకు ఇన్ఫెక్షన్ సోకిందని గుర్తించారు. ఖమ్మంలోని ఆషా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసి ఇన్ఫెక్షన్ సోకిన పేగులను తొలగించారు. ఇందుకు రూ.3 లక్షల వరకు ఖర్చు చేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోగా వైద్య ఖర్చులు భారంగా మారాయి. అంత స్తోమత లేక డిసెంబర్ 24న డిశ్చార్జ్ అయ్యి నిమ్స్‌లో చేరారు. కాగా, కేటీఆర్‌ను చూడగానే సంతోష్ ముఖం వెలిగిపోయింది. తనలో ఆత్మస్థైరం పెరిగిందని, త్వరలోనే కోలుకొంటానని సంతోష్ చెప్పాడు. సంపూర్ణ ఆరోగ్యంతో బాసర త్రిపుల్ ఐటీలో సీటు సంపాదిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. -
'ఆర్ట్ ఆఫ్ లివింగ్'కు ఐఎస్ బెదిరింపు
పైశాచిక చర్యలతో ప్రజల్ని భయకంపితుల్ని చేస్తోన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ దృష్టి ఇప్పుడు ధ్యాన కేంద్రాలపై పడింది. ప్రముఖ గురువు పండిట్ రవిశంకర్ సారధ్యంలోని 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' సంస్థ మలేషియా చాప్టర్‌కు ఐఎస్ ఉగ్రవాదులు శనివారం బెదిరింపు లేఖఖలు రాశారు. కార్యకలాపాలు నిలిపివేయని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరింస్తూ మూడు లేఖలు రాశారు. దీంతో రవిశంకర్ శిశ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉగ్రవాదులు బెదిరింపు లేఖలు పంపిన మలేషియా శాఖలో ప్రతిరోజు ఉదయం 10 వేల మందికి పైగా యోగా తరగతులకు హాజరవుతారు. త్వరలోనే సుమారు 70 వేల మంది ప్రజలు పాల్గొనే సభలో పండిట్ రవిశంకర్ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ భద్రత తమకు ప్రధానాంశమని, లేఖలు ఎవరు పంపారు, ఎలా పంపారనే విషయాల్ని త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. భారత్‌తోపాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో వందలకొద్దీ శాఖలున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ.. శాంతియుత జీవన సాధనా ప్రక్రియతోపాటు యోగాలోనూ శిక్షణనిస్తోంది. సంస్థ వ్యవస్థాపకుడు పండిట్ రవిశంకర్.. రెండు రోజుల కిందటే కాంబోడియాలో మరో శాఖను ప్రారంభించారు.