Assistant police commissioner
-
ఏసీపీ నరసింహారెడ్డి రెండో లాకర్ ఖాళీ
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మల్కాజిగిరి ఏసీపీ వై.నరసింహారెడ్డి రెండో లాకర్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం తెరిచారు. భారీగా నగదు, కీలక ఆధారాలు ఈ ఎస్బీఐ లాకర్లో లభిస్తాయని అధికారులు భావించారు. అయితే అది ఖాళీగా ఉండటంతో అవాక్కయ్యారు. రెండుమూడేళ్లుగా ఈ లాకర్ వినియోగంలోనే లేదని తెలుసుకుని వెనుదిరిగారు. మరోవైపు ఏసీపీకి బినామీలుగా వ్యవహరించిన వారి కోసం ఏసీబీ గాలింపు ముమ్మరం చేసింది. అందులో కొందరు నగరంలో లేరని, వారు ఫోన్లు కూడా అందుబాటులో లేవని సమాచారం. ఓ డీఐజీ ర్యాంకు అధికారికి బంగ్లా కొనివ్వ డంలో కీలకంగా వ్యవహరించాడన్న ఆరోపణలపైనా ఏసీబీ దృష్టి సారించింది. రూ.4 కోట్ల విలువైన ఆ బంగ్లాను సదరు డీఐజీ ఇప్పటికే అమ్మేసుకున్నాడని తెలిసింది. (మేరే పీచే బాస్ హై!) నెల ముందే తెలిసిందా...? తాను చేసే పనులకు డీజీపీ పేరును వాడుకున్న నరసింహారెడ్డికి డిపార్ట్మెంట్లో మంచి నెట్వర్క్ ఉంది. ఇటీవల ఏసీపీ జయరాంను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన వెంటనే.. తరువాత టార్గెట్ తానేనని గుర్తించి ఉంటాడని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. సెప్టెంబర్ ప్రారంభం నుంచి ఆయన ఎవరితోనూ ఫోన్లో వాయిస్ కాల్ చేయలేదని.. వాట్సాప్, ఇతర యాప్‌ల ద్వారా బినామీలను సంప్రదించినట్లు సమాచారం. లాకర్లలో తక్కువ స్థాయిలో బంగారం లభించడం, కీలక బినామీలు నగరంలో లేకపోవడం ఏసీబీ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అలాగే పలువురు రాజకీయ నాయకులతో కలసి చేసిన వ్యాపారాలు, నగరంలో పలు రియల్ ఎస్టేట్లలో నరసింహారెడ్డి పెట్టిన పెట్టుబడులపైనా ఏసీబీ ఆరా తీస్తోంది. -
నగరవ్యాప్తంగా పటిష్ట భద్రత
సాక్షి, ముంబై: నగరవాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకొనే గణేశ్ చతుర్థికి పటిష్ట భద్రత కల్పించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని పోలీసుశాఖ ప్రకటించింది. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా చూసేందుకు తగిన న్ని పోలీసు బలగాలను హోంశాఖ రంగంలోకి దిం పింది. ముంబైవ్యాప్తంగా దాదాపు ఆరువేల సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు ఉన్నాయని అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) సదానంద్ దాతే పేర్కొన్నారు. లక్ష మందికిపైగా ప్రజలు ఇళ్లలోనే విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నట్టు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. వీటన్నింటికోసం 114 చోట్ల నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసినట్లు దాతే చెప్పారు. ప్రజలు వదంతులను నమ్మకూడదని, అత్యవసరమైతే 22633333 నంబరును సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. నిమజ్జనం సమయంలో ఇబ్బందులు తలెత్తగల 200 సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. భద్రత కోసం 25 వేల మంది పోలీసులతోపాటు, బీఎస్ఎఫ్, ఎస్ ఆర్పీఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్‌ఏఎఫ్‌కు చెందిన 18 బెటాలియన్లు, 450 బీట్ మార్షల్స్‌ను మోహరించా రు. వీరితోపాటు నగరం బయట నుంచి వచ్చిన 100 మంది పోలీసు అధికారులు, 2,800 మంది సిబ్బంది, 2,500 మంది హోంగార్డులు, సివిల్ డిఫెన్స్‌కు చెందిన 500 మంది కార్యకర్తలు అందుబాటు లో ఉంటారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు 3,344 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తారు. ఫోర్స్ వన్, ఏటీఎస్ అధికారులు కూడా భద్రతపై దృష్టిసారిస్తారు. అత్యవసర సమయంలో కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌చేస్తే 5-7 నిమిషాల్లోనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుంటారన్నారు.