కందకంలోకి బోల్తా కొట్టిన కారు
కంచికచర్ల :
కారు కందకంలో బోల్తా పడి చిన్నారికి గాయాలు కాగా భార్యాభర్తలు ప్రమాదం నుంచి బయట పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. జాతీయ రహదారిపై విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు మండలంలోని కీసర సమీపంలోకి రాగానే అదుపు తప్పి కందకంలోకి దూసుకెళ్లింది. కారులో హైదరాబాద్‌కు చెందిన ఓబుల్‌రెడ్డి అతని భార్య కనకలక్ష్మి, ఐదునెలల కూతురు ఉన్నారు. ప్రమాద సమాయంలో కారులో ఉన్న ఎయిర్బెలూన్లు తెరుచుకోవటం వలన పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో కారులో ఉన్న చిన్నారి హార్ధియా కారు నుంచి కందకంలో పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను విజయవాడ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ కె.ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.