ఇక తెరుసుడే..
వేగంగా బిల్ట్ పునరుద్ధరణ
{పోత్సాహకాలపై స్పష్టత
ఐఐడీఎఫ్ ద్వారా రూ.30 కోట్లు
ఉత్తర్వులు జారీచేసిన సర్కార్
సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాలోని ఏకైక భారీ పరిశ్రమ బల్లార్పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(బిల్ట్) పునరుద్ధరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇందుకు అవసరమైన ప్రోత్సాహకాలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించిన ఒక్కరోజులోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సబ్సిడీపై ముడి కలప, కరెంటు సరఫరా... నిరంతరంగా బొగ్గు సరఫరా అంశాలపై స్పష్టత ఇస్తూ పరిశ్రమల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్), బిల్ట్‌కు ప్రస్తుతం ఒక మెగావాట్ విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం 25 శాతం టారిఫ్‌కే మూడు మెగావాట్ల కరెంటును సరఫరా చేయనుంది.
సాధారణ ధర కంటే తక్కువకు విద్యుత్ సరఫరా చేయడం వల్ల సబ్సిడీ గరిష్టంగా రూ.9 కోట్లు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. బిల్ట్‌లో ఉత్పత్తి చేసే కాగితపు గుజ్జుకు ముడి సరుకుగా వినియోగించే జామాయిల్, వెదురు కలపను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా సబ్సిడీపై సరఫరా చేయనున్నారు. ముడి సరుకు సబ్సిడీ కోసం ఏటా రూ.30 కోట్లు ఇవ్వనున్నారు. కరెంటు, ముడి సరుకులకు సంబంధించి గరిష్ట సబ్సిడీ రూ.30 కోట్లు మించకుండా ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. బిల్ట్‌కు కేటాయించే సబ్సిడీ మొత్తాన్ని పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి నిధులు(ఐఐడీఎఫ్) నుంచి ఇవ్వనున్నారు. పరిశ్రమల శాఖ కమిషనర్ ద్వారా రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థకు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థలకు ఈ నిధులు చెల్లిస్తారు. పరిశ్రమకు ఇతర ఆర్థిక సమస్యలు ఉండకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బిల్ట్‌కు రూ.30 కోట్ల చొప్పున ఏడేళ్లు సబ్సిడీ ఇవ్వనుంది.
నిర్దేశించిన నియమాలను, ఒప్పం దంలో పేర్కొన్న అంశాలను ఉల్లంఘిస్తే.. సబ్సిడీల కొనసాగింపుపై పునరాలోచిస్తామ ని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బిల్ట్ పునరుద్ధరణపై వేగంగా నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్‌కు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. ఉప ము ఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లు హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాల యానికి వెళ్లారు. బిల్ట్ విషయంలో ప్రభు త్వ నిర్ణయూన్ని జిల్లా ప్రజలు హర్షిస్తున్నారని సీఎంకు తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని డిప్యూటీ సీఎం అన్నారు. బిల్ట్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం తనకు ఎంతో సంతోషం కలి గిస్తోంద ని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. బిల్ట్‌కు ప్రోత్సాహకాలు ఇస్తూ విడుదల చేసిన ఉత్తర్వుల కాపీని చూసి తనకు ఎంతో సంతృప్తిగా ఉందని చెప్పారు.