battle scene
-
కొట్లాటలో ముగ్గురికి గాయాలు
పార్వతీపురం టౌన్: కొట్లాటలో ముగ్గురికి గాయాలైన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పార్వతీపురం జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గరుగుబిల్లి మండల కేంద్రానికి చెందిన కర్రి అన్నపూర్ణమ్మ తన ఖాళీ స్థలంలో బోరు తీయడానికి ప్రయత్నించగా, ఆమె సోదరుడు ముదిలి కన్నంనాయుడు, అతని భార్య సంతోషి, కుమారుడు రామారావు అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని కొట్లాటకు దారి తీసింది. ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన అన్నపూర్ణమ్మ, కృష్ణమూర్తి, సంతోషి గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 వాహనం ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పార్వతీపురం జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా నారాయణపట్నం బ్లాక్ రాయివలస గ్రామానికి చెందిన తాడంగి లచ్చయ్య గేదెగొమ్మి గ్రామం నుంచి తన గ్రామానికి మోటార్ సైకిల్‌పై వస్తుండగా.. పార్వతీపురం మండలం అడారు గ్రామం దాటిన తర్వాత చెరువు మలుపు వద్ద అదుపుతప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనం ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. (చదవండి: వెయ్యి సారా ప్యాకెట్లు స్వాధీనం) -
వర్ణం: నడుస్తున్న అక్షరాలు
వీళ్లంతా ఒక భీకర పోరాటానికి వెళ్తున్నట్టుగా కనబడట్లేదూ! కొంతవరకూ నిజమే. జె.ఆర్.ఆర్.టోల్కీన్ రచన ‘ద హాబిట్’లోని ఒక యుద్ధ సన్నివేశాన్ని ప్రదర్శించడానికి ఇలా అడవిగుండా వెళ్తున్నారు. 1937లో వచ్చి, పాఠకాదరణ పొందిన ఈ నవలలో మాంత్రికులూ, మరుగుజ్జులతోడుగా మనుషుల్లాంటి జీవులు ఒకవైపూ, దయ్యాలూ, విచిత్ర తోడేళ్లూ మరోవైపూ ఉండి పోరాడుతాయి. అందుకే, ఈ చెక్ రిపబ్లికన్లు తమ పుస్తకాభిమానాన్ని ఇలా చాటుకుంటున్నారు. జున్ను పందెం వీళ్లంతా ఇలా ఎగబడి, దొర్లుకుంటూ మరీ పరుగెత్తుతోంది జున్ను దొరికించుకోవడం కోసం! కూపర్స్ కొండ దిగువన ఉంచిన జున్ను కోసం వీళ్లంతా ఈ సాహసం చేస్తున్నారు. దీన్ని ఎందుకు సాహసం అనాలంటే... ఆ కొండ ఎక్కడా కాలు నిలపలేనంత వాలుగా ఉంటుంది! ముందుగా వెళ్లినవాళ్లు సహజంగానే ఆ జున్నును బహుమానంగా పొందుతారు. స్థానిక గ్లౌసెస్టర్ ఆవుల పాలతో చేసే ఈ జున్నును అదే పేరుతో విక్రయిస్తారు. సుమారు రెండువందల ఏళ్లనుంచి ఇలాంటి పోటీ జరుగుతోంది. ‘మురికి’ మనుషులు వీళ్లంతా ఆనందంగా ఇలా బురదలో దొర్లడానికి ఉన్న ఒకే ఒక్క కారణం, చలికాలం ముగుస్తుండటం! ఒక మైదానంలో జరిగిన ఈ సంబరాల్లో జర్మనీయులు ఇలా మురికిమురికిగా ఆనందించారు. దీన్నే వాళ్లు ‘మురికి పంది’ ఉత్సవం అని కూడా పిలుచుకుంటారు. మనకు మనంగాఈ పోలిక తెస్తే అపరాధం అవుతుందిగానీ, వాళ్లే దీన్ని కోరుకుంటే మనం ఇక చేయగలిగేదేముంది!