'ఎర్ర' దొంగల ముఠా అరెస్ట్
బద్వేల్ అర్బన్ (వైఎస్సార్ జిల్లా): వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు కారులో ఎర్రచందనం తరలిస్తున్న నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారి నుంచి ఒక కారు, 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా బద్వేల్ మండలం బ్రాహ్మణపల్లె నుంచి పీపీ కుంట వెళ్లే రహదారిలోని బెడుసుపల్లె క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం జరిగింది. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి కారును వదిలేసి పరారయ్యేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.