best gift
-
ప్రపంచంలోనే బెస్ట్ అమ్మ
1994లో ప్రపంచ సుందరిగా కిరీటం గెలుచుకున్నారు ఐశ్వర్యారాయ్. ఇప్పటికీ అంతే అందంగా ఉన్నారు ఐష్. మళ్లీ 24 సంవత్సరాల తర్వాత మరో కిరీటం ఆమె తలమీద వచ్చి వాలింది. మళ్లీ అందాల పోటీల్లో పాల్గొన్నారా? కాదు.. కాదు. ఈసారి అందిన కిరీటం ఐష్ అందానికి కాదు.. ఐష్లోని అమ్మకు. ప్రపంచంలోనే బెస్ట్ అమ్మ అంటూ ఐష్ కుమార్తె ఆరాధ్య ఆమె కోసం ప్రత్యేకంగా కిరీటం తయారు చేసి ఇచ్చారు. ఆరాధ్య గీసిన బొమ్మలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటుంటారు ఐష్. తాజాగా తన ముద్దుల కుమార్తె ఇచ్చిన కానుక గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మా అమ్మాయి నా ప్రపంచం. నా ప్రపంచం ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇది. ఇప్పటివరకూ నేనందుకున్న కిరీటాల్లో ఇది ఎంతో విలువైంది’’ అని ఐష్ పేర్కొన్నారు. తల్లి కోసం ఆరాధ్య చేసిన గిఫ్ట్ -
విలువైన బహుమతి ఇచ్చాడు!
‘‘ఈ పుట్టినరోజు నాకెంతో ప్రత్యేకం. విజయ్ నాకో విలువైన బహుమతి ఇచ్చాడు’’ అని అమలాపాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తన భర్త విజయ్‌తో కలిసి మకావ్‌లో ఉన్నారు. ఆదివారం తన పుట్టినరోజుని అక్కడే జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమలా పాల్ మాట్లాడుతూ -‘‘కాలం గడిచిపోతున్న విషయమే నాకు తెలియడంలేదు. అంత హాయిగా ఉంది. ఇప్పుడు నా వయసులో ఓ సంవత్సరం పెరిగింది. ఈ సందర్భంగా విజయ్ నాకో మంచి బహుమతి ఇచ్చాడు. ప్రతి స్త్ర్రీ దాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తుంది. ఈ ఆనందంలో నాకు నోట మాట రావడంలేదు. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఆ దేవుడి ఆశీర్వాదాలు నాకు పుష్కలంగా ఉన్నాయి’ అన్నారు. స్త్రీకి విలువైనది అంటే.. ‘మాతృత్వం’. అందుకని అమలాపాల్ దీన్ని ఉద్దేశించే అని ఉంటారని అందరూ ఊహిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆమె తమిళ దర్శకుడు విజయ్‌ని పెళ్లాడిన విషయం తెలిసిందే.