Bhavana kidnap
-
చిన్మయి ఆసక్తికర ట్వీట్.. సమాజం రేపిస్టులను ప్రేమిస్తుందని
Singer Chinmayi Society Loves Only Rapist Tweet Viral: ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తుంటుంది కూడా. కొన్నిసార్లు పలు అంశాల్లో తనదైనా శైలిలో స్పందించి వివాదాలు కూడా ఎదుర్కొంది. సోషల్ మీడియా ద్వారా తమ బాధలను చెప్పుకునే అమ్మాయిలకు సలహాలు, సూచనలు ఇస్తూ ధైర్యం చెప్తుంటుంది. ఆమెకు పలువురు అబ్బాయిలు కూడా మద్దతు పలుకుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. 2017లో జరిగిన ఈ ఘటనపై అనేక మంది హీరోయిన్లు, ప్రముఖలు తమ గొంతు ఎత్తి బాధిత హీరోయిన్‌కు మద్దతుగా నిలిచారు. వారిలో మలయాళ ప్రముఖ నటి పార్వతి తిరువోత్ ఒకరు. ఘటన తర్వాత మహిళా సంఘాలతో కలిసి పార్వతి ఒక పోరాటం చేశారు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆ పోరాటం వల్ల తాను ఏం కోల్పోవాల్సి వచ్చిందో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది పార్వతి. తాను ఇదివరకు నటించిన సినిమాలు హిట్ అయినా తనకు సినిమా అవకాశాలు తగ్గాయని పేర్కొంది. నిజాన్ని మాట్లాడినందుకు తనను, పోరాటంలో ఉన్నవారిని ఎలా బెదిరించారో కూడా తెలిపింది. ప్రస్తుతం రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తున్నట్లు ఆమె వెల్లడించింది. ఈ వార్త చూసిన చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. 'నిజం మాట్లాడినందుకు పార్వతి వంటి ఒక మంచి నటి పని కోల్పోయింది. అలాంటి నటి, లైంగిక వేధింపుల నుంచి తప్పించుకున్న వారి తరఫున మాట్లాడటం వల్ల మాత్రమే తన పని కోల్పోయిందని చెప్పడం నిజం. చాలా మంది మహిళలు మౌనంగా ఉన్నారు. రేపిస్టులను మాత్రమే సమాజం ప్రేమిస్తుంది.' అని చిన్మయి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2017 ఫిబ్రవరిలో 17న జరిగిన నటి కిడ్నాప్, అత్యాచార వేధింపుల కేసులో నటుడు దిలీప్ కుమార్ జైలుకు వెళ్లి బెయిల్‌పై తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అతనికి జనవరి 18 వరకు అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించింది కేరళ హైకోర్టు. Actor Parvathy Thiruvoth on paying a price for speaking up. The fact that hyper talented actors such as she lost work JUST because they stood for a survivor of sexual assault in Kerala says a LOT! So many women silenced. Rapist loving society only. 🤮https://t.co/YINgJRux0L pic.twitter.com/OZFNV4ohg1 — Chinmayi Sripaada (@Chinmayi) January 15, 2022 ఇదీ చదవండి: చిన్మయికి ఆ ఇద్దరి మద్దతు.. స్క్రీన్ షాట్స్ వైరల్ -
కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు : 5ఏళ్ల తర్వాత స్పందించిన హీరోయిన్
Actress Bhavana Menon Opens Up On Assalut Case After 5 Years: ప్రముఖ హీరోయిన్ భావనపై లైంగిక వేధింపుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నమలయాళ సూపర్‌స్టార్ దిలీప్ కుమార్‌పై కేరళ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. 2017 ఫిబ్రవరి 17న షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో హీరోయిన్ భావనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలల జైలు శిక్ష తర్వాత దిలీప్ కుమార్ బెయిల్‌పై విడుదలయ్యాడు. తాజాగా దిలీప్, అతని సోదరుడు అనూప్, బంధువు సూరజ్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు కేరళ పోలీసులు. తాజాగా ఈ ఘటనపై హీరోయిన్ భావన స్పందించింది. తనకు జరిగిన చేదు సంఘటనను గుర్తు చేసుకొని సోషల్ మీడియాలో సుధీర్ఘ పోస్టును షేర్ చేసింది. 'బాధితురాలి నుంచి ప్రాణాలతో బయటపడే వరకు ఈ ప్రయాణం అంత సులువైనది కాదు. గత ఐదేళ్లుగా నాపై జరిగిన దాడి, నా పేరు, నా గుర్తింపు అణచివేయబడ్డాయి. నేరం చేసింది నేను కానప్పటికీ, నన్ను అవమానించడానికి, మౌనంగా ఉంచడానికి, ఒంటరిగా ఉంచడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానా అలాంటి సమయంలో కూడా నా గొంతును సజీవంగా ఉంచడానికి ముందుకొచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు నేను చాలా మంది గొంతులు వింటున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ ప్రయత్నంలో నేను ఒంటరిని కాదని నాకు తెలుసు. న్యాయం గెలవాలని, తప్పు చేసిన వారికి శిక్షపడేలా చూడాలని, మరెవరికీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు నేను నా ప్రయాణం కొనసాగిస్తాను. నాకు మద్ధతుగా నిలిబడిన వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చింది. కాగా హీరోయిన్ భావన తెలుగులో ఒంటరి, మహాత్మ, నిప్పు వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Bhavana Menon 🧚🏻♀️ (@bhavzmenon) -
మేలుకో మహిళా.. లేదంటే భద్రత కలే!
నేటి సమాజంలో మహిళలకు భద్రత ఏది? అనే అంశంపై మూడు రోజులుగా చిత్రపరిశ్రమలో చర్చ జరుగుతోంది. హీరోయిన్ భావన కిడ్నాప్ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. నటీమణుల పట్ల అనుచితంగా ప్రవర్తించే వ్యక్తులను శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమిళ హీరోయిన్ వరలక్ష్మీ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. ఇంతకీ వరలక్ష్మీ ఏం చెప్పారంటే.. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో నిజాయితీగా మాట్లాడిన ప్రతి మాటను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే, నా అనుభవాన్ని బయటపెట్టాలా? వద్దా అని రెండు రోజులు తర్జనభర్జన పడ్డాను. చివరికి నా మానసిక సంఘర్షణను పంచుకోవాలనుకున్నాను. ఓ టీవీ ఛానల్ ప్రోగ్రామింగ్ హెడ్‌తో ఓసారి సమావేశమయ్యాను. సమావేశం ముగుస్తుందనగా ‘‘ఇంకేంటి! మనం బయట ఎప్పుడు కలుస్తున్నాం?’’ అనడిగాడు. నేను ‘‘మరో పని ఏమైనా ఉందా?’’ అనడిగా. కొంటెగా చూస్తూ.. ‘‘నో.. నో.. పనేం లేదు. ఫర్ అదర్ థింగ్స్’’ అన్నాడు. నా కోపాన్ని అణుచుకుని ‘‘సారీ! మీరు దయ చేయవచ్చు. ప్లీజ్’’ అన్నాను. ‘‘అంతేనా’’ అని నవ్వుతూ బయటకు నడిచాడు.ఇటువంటి ఘటనల గురించి చెప్పినప్పుడు చిత్రసీమలోని వ్యక్తులతో పాటు బయట వ్యక్తుల నుంచి వచ్చే కామన్ రియాక్షన్... ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంతే. ఇందులోకి ప్రవేశించేటప్పుడు నీకు ఇవన్నీ తెలుసు. ఇప్పుడెందుకు కంప్లైంట్ చేస్తున్నావ్?’’ అంటుంటారు. అలాంటి వాళ్లకు చెప్పేది ఒక్కటే... ‘‘ఎలాంటి భావోద్వేగాలు లేని ఓ మాంసపు ముక్కలా నన్ను ట్రీట్ చేస్తారనో లేదా ఇక్కడి మహిళలకు ఇలాంటివి కామన్.. అనుసరించిపోవాలనో నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రాలేదు. ఐ లవ్ యాక్టింగ్. ‘వీలైతే ఎదుర్కొందాం.. లేదా వదిలేద్దాం’ అనుకోవడంలేదు. ( హీరో కూతురికీ తప్పని లైంగిక వేధింపులు ) నా ప్రొఫెషన్ని ఎప్పటికీ వదలను.ఓ మహిళగా మగాళ్లకు ఓ సూచన చేస్తున్నా. ‘‘మహిళలను అగౌరవపరచడం మానుకోండి లేదా బయటకు వెళ్లండి’’. నేనో హీరోయిన్. స్క్రీన్‌పై గ్లామరస్‌గా కనిపిస్తా. అంతమాత్రాన నన్ను అగౌరవపరిచే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇది నా లైఫ్, నా బాడీ, నా ఇష్టం. ఏ మగాడికీ నన్ను తక్కువగా చూసే హక్కు లేదు. ‘‘నీ లైఫ్‌లో జరిగింది చిన్న ఘటనే కదా. ఎందుకింత రాద్దాంతం చేస్తున్నావ్?’’ అని అడగొచ్చు. నిజమే, ఘటన చిన్నదే. లక్కీగా, నేను సేఫ్‌గానే బయటపడ్డా. మహిళలు ఎలా మాట్లాడాలో.. ఏ బట్టలు వేసుకోవాలో.. ఎలా ప్రవర్తించాలో చెప్పడం బదులు ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలో నేర్పాలి.మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, అగౌరవంగా చూడడం వంటివి నానాటికీ పెరుగుతున్నాయి. మన విద్యావ్యవస్థ మనల్ని ఫెయిల్ చేస్తోంది. భయంతో ఎవరైతే అమ్మాయిలు మాట్లాడలేకపోతున్నారో వాళ్ల తరఫున మాట్లాడుతున్నా. మగవాళ్లకు భయపడడం కాదు.. ధైర్యంగా బయటకొచ్చి మహిళలు మాట్లాడితేనే వాళ్లకు శిక్ష పడుతుంది.ఇప్పుడు మేలుకోకపోతే.. మహిళలకు భద్రత అనేది కలగానే మిగులుతుంది. ‘రేప్’ అనే పదాన్ని ఈ సమాజం నుంచి ఎప్పటికీ తొలగించలేం.