ఆయిల్ దుకాణం దగ్ధం
=బీటుబజార్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో ఘటన
=రూ.10 లక్షల విలువైన ఆయిల్ ప్యాకెట్లు బుగ్గిపాలు
=పక్కనే ఉన్న ఉల్లిగడ్డ దుకాణం కూడా దగ్ధం
మట్టెవాడ, న్యూస్‌లైన్ : నగరంలోని వరంగల్ బీట్‌బజార్‌లో ఆయిల్ దుకాణం దగ్ధమైన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మట్టెవాడ ఫైర్ ఆఫీసర్ రాజులు, ఆయిల్ దుకాణం యజమాని దోమల భవానీశంకర్ కథనం ప్రకారం.. వరంగల్ బీటుబజార్లోని శ్రీరాజేశ్వరీ ఆయిల్ మర్చంట్స్ దుకాణంలో నుంచి శుక్రవారం అర్ధరాత్రి దట్టమైన పొగలు, మంటలు వస్తుండడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు.
వారి సమాచారంతో మట్టెవాడ, హన్మకొండ ఫైర్ ఇంజన్లతో శనివారం తెల్లవారుజామున 5 గంటల వరకు మంటలు ఆర్పారు. ఈ ఘటన విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో జరిగినట్లు ఫైర్ ఆఫీసర్ రాజులు తెలి పారు. ఆయిల్ దుకాణంలో రూ.10 లక్షల విలువైన ఆయిల్ ప్యాకెట్లు, టిన్ లు ఉన్నాయని, అవన్నీ కాలిపోయినట్లు దుకాణం యజమాని భవానీ శంకర్ తెలిపారు. ఇదే దుకాణం పక్కనే ఉన్న ఉల్లిగడ్డ, ఎల్లిగ డ్డ దుకాణం కూడా మంటల్లో కాలిపోగా రూ.2 లక్షల నష్టం జరిగినట్లు దుకాణ యజమాని కోటేశ్వర్రావు తెలిపారు.