Bombay court
-
సల్మాన్ కేసు అప్పీలుపై 14న నిర్ణయం
ముంబై: 13 ఏళ్లనాటి హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్‌ను నిర్దోషిగా బాంబే కోర్టు ప్రకటించటాన్ని సుప్రీంలో సవాల్ చేయాలా వద్దా అనే విషయాన్ని ఈ నెల 14 సోమవారం నిర్ణయిస్తామని మహా సర్కారు ప్రకటించింది. కాగా, గురువారం కోర్టు ఇచ్చిన తీర్పుతో.. ఈ కేసులో సాక్షిగా తన మిత్రుడు కమాల్ ఖాన్ వాంగ్మూలం తీసుకోవాలంటూ.. సుప్రీంలో వేసిన పిటిషన్‌ను సల్మాన్ వెనక్కు తీసుకున్నారు. మరోవైపు, సల్మాన్‌కు అనుకూలంగా తీర్పు రావటాన్ని స్వాగతిస్తున్నట్లు షారుక్ ఖాన్ తెలిపారు. త్వరలోనే సల్మాన్‌ను కలుస్తానన్నారు. -
‘26/11’లో హెడ్లీ నిందితుడే
ముంబై/రావల్పిండి: పాకిస్తానీ-అమెరికన్ లష్కరే ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ 26/11 ముంబై దాడులకు అబూ జుందాల్‌తో కలసి కుట్ర చేశాడని బాంబే కోర్టు తెలిపింది. ఈ కేసులో.. డిసెంబర్ 10లోగా హెడ్లీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ముంబై దాడుల విచారణను పాక్ ఉగ్రవాద నిరోధక కోర్టు.. సాక్షుల గైర్హాజరుతో మళ్లీ వాయిదా వేసింది. ఉగ్రవాదంపై సదస్సును నిర్వహించండి పారిస్, బీరుట్లలో ఉగ్రదాడుల నేపథ్యంలో ఉగ్రవాదంపై సదస్సును అత్యవసరంగా నిర్వహించి తదుపరి చర్యలపై చర్చించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని భారత్ కోరింది.