Budget team
-
టీమ్ సీతారామన్... బడ్జెట్ మే ‘సవాల్’!
దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది... ఒకపక్క ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయి అయిన 6.4 శాతానికి తగ్గుతుందని స్వయంగా ప్రభుత్వ అంచనాలే చెబుతున్నాయి. ప్రజల వినిమయం తగ్గిపోవడం, ప్రైవేటు పెట్టుబడుల్లో స్తబ్దత, భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు మోదీ సర్కారుకు కత్తిమీద సాముగా మారాయి. రూపాయి పాతాళానికి నిచ్చెనేసినట్లు జారిపోతోంది. తాజాగా డాలర్‌తో దేశీ కరెన్సీ మారకం విలువ 86.7 జీవిత కాల కనిష్టానికి క్రాష్ అయ్యింది. మరోపక్క, అమెరికా ఆధ్యక్ష పీఠమెక్కిన ట్రంప్... చాలా దేశాలతో పాటు మన మెడపైనా సుంకాల కత్తి పెట్టడంతో టారిఫ్ వార్ 2.0కు తెరలేచింది. దీంతో మన ఎగుమతులకు గడ్డుకాలం తప్పేలా లేదు. ఇంటాబయటా ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా ఎనిమిదోసారి దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.50 లక్షల కోట్లకు మించిన బడ్జెట్‌ను రెడీ చేశారు. ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పకుండానే ప్రగతిని పట్టాలెక్కించడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. ఈ నేపథ్యంలో 140 కోట్లకు పైగా దేశ ప్రజల కోసం సీతారామన్ అండ్ టీమ్ తయారు చేసిన ఈ బడ్జెట్ నలభీమ పాకాన్ని అలుపెరగకుండా వండివార్చిన ఉద్ధండ అధికారుల సంగతేంటో చూద్దాం...ఎం. నాగరాజుఆర్థిక సేవల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1993 బ్యాచ్ త్రిపుర కేడర్ ఐఏఎస్ అధికారి ఆయన. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితుల పెంపు వంటి సంస్కరణలకు రోడ్‌మ్యాప్ రూపొందించడం, అంతకంతకూ పెరుగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడం, బ్యాంకింగ్ రంగానికి మరింత ఆర్థిక జవసత్వాలను అందించడంపై బడ్జెట్లో ఫోకస్ చేశారు.తుహిన్ కాంత పాండే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో అత్యంత సీనియర్ అధికారి. ఆర్థిక, రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2019లో దీపమ్ (పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం) కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి దేశ బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. 1987 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి అయిన పాండే గతేడాది సెప్టెంబర్‌లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. దీపమ్ సెక్రటరీగా ఎయిరిండియా ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల డివిడెండ్ పాలసీ వంటి కీలక చర్యలు చేపట్టి దమ్మున్న అధికారిగా పేరు దక్కించుకున్నారు. దీపమ్ సెక్రటరీగా రాకముందు ఆయన ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో పని చేయడంతో పాటు ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యూఎన్ఐడీఓ) ప్రాంతీయ కార్యాలయంలో కూడా సేవలందించారు. వి. అనంత నాగేశ్వరన్2022లో ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ)గా నియమితులయ్యారు. మోదీ 3.0లోనూ కొనసాగుతుండటం ఆయన దీక్షాదక్షతలకు నిదర్శనం. 2025–26 కేంద్ర బడ్జెట్‌కు ముందు వరుసగా మూడోసారి ఆర్థిక సర్వేను రూపొందించారు. ఆర్థికాంశాల బోధనతో పాటు క్రెడిట్ సూసే గ్రూప్ ఏజీ, జూలియస్ బేయర్ గ్రూప్ వంటి దిగ్గజ సంస్థల్లో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా గతంలో పనిచేశారు. నేడు పార్లమెంట్‌కు సమరి్పంచనున్న ఆర్థిక సర్వేలో నాగేశ్వరన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులను కళ్లకు కట్టడంతో పాటు 2047 నాటికి వికశిత భారత్ (అభివృద్ధి చెందిన దేశం)గా నిలిపేందుకు అవసరమైన కీలక సూచనలను కూడా పొందుపరిచడానికి తీవ్రంగా శ్రమించారు. అజయ్ సేథ్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. 2021 నుంచి నాలుగు దఫాలుగా బడ్జెట్ రూపకల్పన జట్టులో కీలకంగా వ్యవహరించారు. ఆర్థిక శాఖలో రెండో సీనియర్ అధికారిగా ఆయన నేతృత్వంలోనే వివిధ విభాగాలను సమన్వయం చేసుకుంటూ మొత్తం బడ్జెట్ ప్రక్రియకు చుక్కానిగా నిలుస్తున్నారు. ఆయన సారథ్యంలో బడ్జెట్ విభాగం ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, రుణ సమీకరణ మధ్య సమతూకంతో బ్యాలెన్స్ షీట్‌కు తుదిమెరుగులు దిద్దింది. భారతదేశంలో తొలి సార్వ¿ౌమ గ్రీన్ బాండ్స్ జారీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సెక్రటేరియట్ ఏర్పాటు వంటి సాహసోపేతమైన చర్యల అమలు ఘనత సేథ్ సొంతం. ద్రవ్యలోటును ప్రభుత్వ లక్ష్యమైన 4.5 శాతం దిగువన కట్టడి చేస్తూ ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేయడంతో పాటు జీడీపీతో పోలిస్తే ప్రభుత్వ రుణ నిష్పత్తి విషయంలో సరికొత్త వ్యూహాన్ని అమలు చేయడం రానున్న బడ్జెట్లో ఆయన ప్రధాన అజెండాగా మారింది.మనోజ్ గోవిల్1991 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన గోవిల్... మోదీ 3.0లో 2024 ఆగస్టులో కేంద్ర వ్యయ విభాగం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో మొదటిసారి భాగస్వామ్యం వహిస్తున్నారు. రూపాయి ఘోరంగా పడిపోతున్న తరుణంలో బడ్జెట్లో సబ్సిడీలకు సంబంధించి అంచనాలు, కేటాయింపుల వంటి కఠిన వ్యవహరాలపై కఠోరంగా శ్రమించారు.అరుణీశ్ చావ్లా దీపమ్, ప్రభత్వ రంగ సంస్థల విభాగం (డీపీఈ) కార్యదర్శిగా 2024 డిసెంబర్లో చార్జ్ తీసుకున్నారు. 1992 బ్యాచ్ బిహార్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన చావ్లా ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ పొందిన చావ్లాకు 2014 నుంచి వ్యయాల విభాగం జాయింట్ సెక్రటరీగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ, పీఎస్‌యూలకు చెందిన నిరుపయోగ ఆస్తుల విక్రయం, పీఎస్‌యూల కార్యకపాలాలను గాడిలో పెట్టి, మరింత బలోపేతం చేయడం వంటి వాటిపై బడ్జెట్లో ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. -
బడ్జెట్ 2018 : ఆ ఆరుగురే కీలకం
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి పూర్తిస్ధాయి బడ్జెట్‌కు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సిద్ధమవుతున్న క్రమంలో అందరి అంచనాలూ మిన్నంటాయి. వివిధ వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూనే ద్రవ్య లోటుపోట్లు మితిమీరకుండా వ్యవహరించడం జైట్లీకి కత్తిమీద సామే. అందరినీ సంతృప్తి పరుస్తూ.. పరిమితులకు కట్టుబడుతూ బడ్జెట్ కసరత్తును విజయవంతంగా చేపట్టేందుకు ఆరుగురు అధికారులు ఆర్థిక మంత్రికి అండగా నిలచి అన్నీ తామై నడిపించారు. రెవెన్యూ కార్యదర్శి హస్ముక్ అథియా, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, ప్రభుత్వ వ్యయ శాఖ కార్యదర్శి అజయ్ నారాయణ్ ఝా, పెట్టుబడులు, ప్రభుత్వ అసెట్ మేనేజ్మెంట్ కార్యదర్శి నీరజ్ కుమార్ గుప్తా, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ బడ్జెట్ కసరత్తులో కీలకంగా వ్యవహరించారు. ఈ ఆరుగురు అధికారుల బృందంలో కొందరు అధికారులు ఎన్నో బడ్జెట్లను చూడగా, ఆయా రంగాల్లో అపార అనుభవం ఉన్నా ప్రత్యక్షంగా బడ్జెట్ కసరత్తులో తొలిసారి పాలుపుంచుకున్న వారూ ఉన్నారు.కాగా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. -
బడ్జెట్ నలభీములు వీరే..
► బడ్జెట్ వంటకం సిద్ధం ఆర్థికమంత్రి... బడ్జెట్‌కు కర్త, కర్మ, క్రియ ఆయనే! బడ్జెట్‌పై విమర్శలైనా, మెచ్చుకోలు అయినా అన్నీ ఆయనకే చెందుతాయి. అయితే బడ్జెట్ రూపకల్పన ఈయన ఒక్కరే చేయరు. అనేక శాఖలు, అనేక మంది అధికారుల సుదీర్ఘ మథనం తర్వాత బడ్జెట్ వంటకం తయారవుతుంది. ఈసారి బడ్జెట్ వెనుక ఏయే శాఖలు, ఎవరెవరు అధికారులు ఉన్నారు? వారు ఎలాంటి పాత్ర పోషిస్తారు? 1.రెవెన్యూ కార్యదర్శి: డాక్టర్ హస్ముఖ్ అదియా. వివిధ శాఖల నుంచి ప్రభుత్వానికి ఆదాయం అందించడమే లక్ష్యంగా ఈయన పనిచేస్తారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ), ఎక్సైజ్, కస్టమ్స్ విభాగం(సీబీఈసీ) కూడా ఈయన అధీనంలోనే ఉంటాయి. బడ్జెట్లో చాలామంది ఆసక్తిగా ఎదురుచూసే పన్ను (ట్యాక్స్) వ్యవహారాలన్నీ ఈయనే చూస్తారు. పన్నుల్లో ఎలాంటి మార్పుచేర్పులు చేయాలన్నా ఈయన నిర్ణయమే అత్యంత కీలకం. 2.ఆర్థిక శాఖ కార్యదర్శి: రతన్ పి వటల్. ఆర్థికశాఖలో వ్యయ విభాగానికి కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. బడ్జెట్ తయారీలో మంత్రి, సహాయమంత్రి తర్వాత కీలకమైన వ్యక్తి. వాస్తవానికి బడ్జెట్ తయారీ ప్రక్రియ మొత్తం ఈయన కనుసన్నల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఆదాయ, వ్యయాలు, శాఖలకు నిధుల కేటాయింపులు తదితర అంశాలను పర్యవేక్షిస్తారు. 3.ఆర్థిక సేవల కార్యదర్శి: అంజులి చిబ్ దుగ్గల్. బ్యాంకింగ్, బీమా రంగాల్లో విధానాలు, సంస్కరణల రూపకల్పన, వాటి అమలు బాధ్యతలను ఈమె చూస్తారు. బడ్జెట్లో ఈ రెండు రంగాలకు సంబంధించి వెలువడే విధానపర నిర్ణయాల వెనుక ఈమెదే ముఖ్య పాత్ర. వ్యవసాయ రుణాలు, బకాయిల వసూలు వంటి అంశాలను పర్యవేక్షిస్తారు. 4.ఆర్థిక శాఖ సహాయమంత్రి: జయంత్ సిన్హా. ఈయన ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి సాయంగా ఉంటూ ఆర్థికశాఖలోని వివిధ విభాగాల మధ్య సమన్వయ బాధ్యతలు చూస్తారు. బడ్జెట్ ప్రసంగం తయారీలో ఆర్థిక మంత్రికి తోడ్పడతారు. 5.ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి: శక్తికాంతదాస్. ఈయన వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమైన వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ఆర్బీఐతో సమన్వయం చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు పటిష్ట చర్యలు చేపడతారు. 6.పెట్టుబడుల ఉపసంహరణ కార్యదర్శి: నీరజ్ కుమార్ గు ప్తా. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితులను దృష్టి లో ఉంచుకొని రా నున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యాలను నిర్దేశిస్తారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థల్లో(సీపీఎస్ఈ) ప్రభుత్వ వాటాల ఉపసంహరణలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తారు. 7.ముఖ్య ఆర్థిక సలహాదారు: డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శితో కలిసి పనిచేస్తారు. దేశ ఆర్థిక పరిస్థితితోపాటు వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగం వరకు వివిధ రంగాల అభివృద్ధిపై ప్రభుత్వానికి కీలక నివేదిక ఇస్తారు. ప్రభుత్వ విధానాల అమలుకు పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. 8.బడ్జెట్ సంయుక్త కార్యదర్శి: ప్రవీణ్ గోయల్. ఆర్థిక వ్యవహారాల విభాగం పరిధిలో పనిచేస్తారు. బడ్జెట్ తయారీ ప్రక్రియలో నోడల్ పాయింట్‌గా ఉంటారు. అన్ని విభాగాల కేటాయింపులు ఒక కొలిక్కి వచ్చాక కీలకమైన బడ్జెట్ పత్రాల ముద్రణ ఈయన పర్యవేక్షణలోనే జరుగుతుంది. అప్పుడప్పుడు ఆర్థికమంత్రి ప్రసంగం రూపకల్పనలో కూడా పాలుపంచుకుంటారు. 9.ముఖ్య సలహాదారు (కాస్ట్): అరుణా సేథి. దేశంలో ఇండియన్ కాస్ట్ అకౌంట్ సర్వీస్ విభాగానికి తొలి మహిళా అధినేత ఈమె. బడ్జెట్ తయారీలో తలెత్తే అనేక క్లిష్టమైన ఆర్థిక చిక్కుముడులకు ఈ విభాగమే పరి ష్కారం చూపుతుంది. 10.ఆర్థిక సలహాదారులు: వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించిన ప్రతినిధులుగా ఆర్థిక శాఖలో 34 మంది సలహాదారులుంటారు. ఆయా శాఖల బడ్జెట్ నిర్వహణపై సమీక్ష నిర్వహించి, మరింత మెరుగ్గా నిధులు వినియోగమయ్యేలా చూడటం వీరి బాధ్యత.