buffalo killed
-
పగబట్టి మరీ దున్నపోతే చంపేసింది!
ఆదిలాబాద్: పశువుల కాపరి పైనే దున్నపోతు దాడి చేసి చంపిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజూ రాలో ఆదివారం సాయంత్రం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పశువుల కాపరి చామన్‌పల్లి గంగన్న (60) రోజువారీలాగానే గేదెలను ఉదయం మేతకు తీసుకెళ్లాడు. వారివెంట గ్రామానికి చెందిన విత్తనపు దున్నపోతు కూడా వెళ్లింది. సాయంత్రం గేదెలను ఇంటికి తోలుకొస్తుండగా దున్నపోతు ఒక్కసారిగా కాపరిపై తిరగబడింది. విచక్షణ రహితంగా కుమ్మడంతో గంగన్న తీవ్రంగా గాయపడ్డాడు. పక్కనే ఉన్న మరో కాపరి గమనించి వెంటనే గ్రామస్తులకు ఫోన్‌చేసి చెప్పాడు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకుని దున్నపోతును తరిమారు. గాయపడిన గంగన్నను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. గంగన్నకు భార్య ఆశవ్వ, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పగబట్టిందంటున్న గ్రామస్తులు! ఇదిలా ఉండగా.. గ్రామానికి చెందిన విత్తనపు దున్న పగపట్టి దాడిచేసిందని గ్రామస్తులు ప్రచారం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన ముత్యంపై దాడికి యత్నించడంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శుక్రవారం చనిపోగా అతని అంత్యక్రియల్లో ముత్యం పాల్గొన్నాడు. ఈ క్రమంలో అక్కడే మేతకు వెళ్లిన దున్న పరిగెత్తుకుంటూ వచ్చి దాడికి యత్నించింది. దీంతో అతను చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ దృశ్యాన్ని స్థానికులు వీడియో తీశారు. దున్నపోతును గ్రామం నుంచి తరలించాలని సర్పంచ్‌ను కోరారు. ఇంతలోనే ఆదివారం అదే దున్న పశువుల కాపరిని పొడిచి చంపడంతో రాజూరాలో విషాదం నెలకొంది. దున్నపోతు మనుషులను పగబట్టిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇవి చదవండి: చిన్నారి పాలిట శాపంగా మారిన రాగిజావ! -
అమ్మో చిరుత!
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో చిరుత ఉందని మళ్లీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి క్యాంపస్‌లోని గోప్స్ ప్రాంతంలో గేదె మృతి చెంది ఉండడంతో, దాన్ని చిరుతే చంపిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మంగళవారం ఉదయం వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది, వైల్డ్‌లెన్స్ బృందం గమనించి, కుక్కలే దాడి చేసి ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. అయితే గేదె ముఖం భాగంలో గాయాలుండడం, భారీ రక్తస్రావం కావడంతో పలువురు చిరుతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గేదె మరణించిన ప్రదేశానికి సమీపంలోని బురదలో కాలి గుర్తులు పడ్డాయి. అవి చిరుతవని పలువురు అనుమానిస్తుండగా, కాదని అధికారులు కొట్టిపారేస్తున్నారు. నమ్మొద్దు... క్యాంపస్‌లోకి చిరుత ప్రవేశించిందని గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, వైల్డ్‌లైన్ బృందం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి గమనించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలో చిరుత క్యాంపస్‌లో లేదని అధికారులు పేర్కొంటున్నారు. వదంతులను నమ్మొద్దని స్పష్టం చేస్తున్నారు. వేటగాళ్ల బెడద... హెచ్‌సీయూ క్యాంపస్‌లో కుక్కల బెడదను తీర్చేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. అన్యాయంగా మూగజీవాలు బలవుతున్నా పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేటగాళ్లు తరచూ క్యాంపస్ పరిధిలోని అటవీ ప్రాంతంలోకి చొరబడి జంతువులను వేటాడుతున్నారని పేర్కొంటున్నారు. ఎవరూ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
విద్యుత్ తీగ తెగిపడి గేదెలు మృతి
వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో ఓ పొలం మడిలో11 కేవీ విద్యుత్ తీగ తెగిపడింది. అదే సమయంలో ఆ మడిలోకి నీరు తాగడానికి వెళ్లిన తొమ్మిది గేదెలు విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందంటూ గేదెల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.