Business management process
-
విధానాలను క్రమబద్ధీకరించాలి
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా విధానాలను క్రమబద్ధీకరించాలని, అట్టడుగున ఉండేవారికి కూడా సేవలు అందేలా చూడటంపై దృష్టి పెట్టాలని అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ’ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ జాబితాలో దేశ ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకోవడంతో పాటు చిన్న వ్యాపార సంస్థలు, సామాన్య ప్రజానీకం జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడేందుకు ఇవి ఉపయోగపడగలవని ఆయన చెప్పారు. సులభతరంగా వ్యాపారాల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై గురువారం జరిగిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో మోదీ ఈ విషయాలు పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. నిర్మాణాలకు అనుమతులు, కాంట్రాక్టుల అమలు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్, రుణ సదుపాయాలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు వివరించింది. వ్యాపార సంస్కరణల అమలు తీరుతెన్నులు, ఎదురవుతున్న అడ్డంకులు, వాటిని పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ప్రధానికి వివరించారు. ప్రపంచ బ్యాంకు ’డూయింగ్ బిజినెస్’ పేరిట రూపొందించే వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో గడిచిన నాలుగేళ్లలో భారత్ 142వ స్థానం నుంచి 77వ స్థానానికి ఎగబాకింది. -
భారత్‌లో ఇక వ్యాపారం సులభతరం
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ లండన్: భారత్‌లో వ్యాపార నిర్వహణ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. లండన్‌లో యూకే ఇండియన్ బిజినెస్ కౌన్సిల్- ఫిక్కీ సంయుక్త ఆధ్వర్యంలో ‘భారత్‌లో వ్యాపార అవకాశాలు’ అన్న అంశంపై ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జైట్లీ మాట్లాడుతూ, పెట్టుబడుల ఆకర్షణకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని అన్నారు. పన్నుల హేతుబద్దీకరణ, వీలైనంతమేర తగ్గింపు వంటి అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. జీపీ హిందూజాకు ఎన్ఆర్ఐ అవార్డు లండన్ పర్యటన సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త జేపీ హిందూజాకు ఆర్థికమంత్రి జైట్లీ ఎన్ఆర్ఐ అవార్డును ప్రదానం చేశారు. వాణిజ్య రంగంలో సాధించిన గణనీయ విజయాలకు గాను జేపీ హిందూజా ఈ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అవార్డు పొందారు. ‘గారవి గుజరాత్’ మ్యాగజైన్సహా లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ (బిజినెస్) కమల్ హోతీ, బ్రిటన్ ప్రభుత్వ డీల్‌మేకర్ (ఫర్ ఇండియా) అల్ఫేస్ పటేల్‌లకు ఎన్ఆర్ఐ అవార్డులు లభించాయి. యూబీఐ అనుబంధ బ్యాంక్ ప్రారంభం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) బ్రిటన్‌లో తన ప్రత్యేక అనుబంధ బ్యాంకు విభాగాన్ని ప్రారంభించింది. దీనిని ప్రారంభించిన జైట్లీ, ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతం వరకూ ఉంటుందని అన్నారు. ఇన్వెస్టర్లపై ‘కెయిర్న్’ పన్ను ప్రభావం లేదు భారత్‌లో పెట్టుబడులపై ఇన్వెస్టర్ల ఉత్సాహాన్ని ‘కెయిర్న్ పన్ను డిమాండ్’ నీరుగారుస్తోందన్న విమర్శలను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తోసిపుచ్చారు. ఈ సమస్య గత ఎంతో కాలంగా ఉన్నదేనని, న్యాయ ప్రక్రియద్వారా ఇది పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి పలు వర్గాల నుంచి ఆసక్తి వ్యక్తమవుతోందని జైట్లీ పేర్కొన్నారు.