9 జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు
మార్క్‌ఫెడ్ ఎండీ, సివిల్ సప్లయీస్ ఎండీ వెల్లడి
సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర పరిధిలోని కొనుగోళ్ల ప్రక్రియపై ఇకనుంచి ప్రతి శని వారం సమీక్ష నిర్వహించాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఎండీ దినకర్‌బాబు, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ఎండీ అనిల్‌కుమార్ స్పష్టం చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డును సోమవారం ఆకస్మిక తనిఖీ చేసిన వారు అనంతరం విలేకరులతో మాట్లాడారు. స్థానికంగా మౌలిక వసతులు, రైతు మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల పనితీరుపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ ఏడు రాష్ట్రంలో 2 వేల వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, 15 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలన్న లక్ష్యా న్ని పౌరసరఫరాల శాఖ నిర్దేశించిందన్నారు. అదేవిధంగా మక్కల కొనుగోలు కోసం 166 కేంద్రాలను ఏర్పాటు చేసి 3 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించనున్నామన్నారు.