Buying property
-
హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొంటున్నారా?
సాక్షి, సిటీబ్యూరో: రాజధాని చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) హద్దుగా జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) పేరు చెబితే ఇప్పుడు అందరూ ఉలిక్కిపడుతున్నారు. ఈ ప్రత్యేక విభాగం ఆపరేషన్స్ నేపథ్యంలో స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించి సామాన్యుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని విభాగాలతో పాటు కొందరు వ్యక్తులూ రెచ్చిపోతున్నారు. ఓ పక్క నోటీసులు, మరోపక్క బెదిరింపులతో తమ ‘పని’ పూర్తి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ అంశాలను ‘సాక్షి’.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లింది. వివరాలు ఆయన మాటల్లోనే.. అక్రమ నిర్మాణం అయినప్పటికీ ఇప్పటికే ప్రజలు నివసిస్తుంటే ఆ జనావాసాల జోలికి హైడ్రా వెళ్లదు. జలవనరుల పరిరక్షణలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న వాటిపైనే చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలవాలనే స్పష్టం చేస్తోంది. ఎవరైనా ప్లాట్, ఫ్లాట్ ఖరీదు చేసుకునే ముందు దానికి సంబంధించిన వివరాలు సరిచూసుకోండి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం కుంట, చెరువు కనిపించకపోయినప్పటికీ ఒకప్పుడు అక్కడ ఉండొచ్చు. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం అక్కడ జలవనరు ఉన్నట్లు రికార్డు ఉంటుంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న పట్టాభూములు సైతం కేవలం వ్యవసాయం చేసుకోవడానికి ఉద్దేశించినవి. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు, ఈ భూములు క్రయవిక్రయాలు చేయకూడదు.రాజధానిలోని భూములకు సంబంధించిన సమగ్ర వివరాలు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌కి (ఎన్ఆర్ఎస్సీ) ఆధీనంలోని భువన్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ధరణి వెబ్సైట్లలో, జలవనరులకు సంబంధించిన వివరాలు హెచ్ఎండీఏ లేక్స్ వెబ్‌సైట్స్‌లో ఉంటాయి. వీటితో పాటు రెవెన్యూ రికార్డులను సైతం సరిచూసుకున్న తర్వాతే క్రయవిక్రయాల విషయంలో ముందుకు వెళ్లాలి. రాజధానిలో ఎక్కడైనా స్థిరాస్తి కొనుగోలు చేసేప్పుడు మరికొన్ని అంశాలనూ సరిచూసుకోండి. ఆ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? అవి ఇవ్వాల్సిన విభాగాలే ఇచ్చినవి సక్రమ అనుమతులేనా? ఆ అనుమతుల్ని రద్దు చేయడం వంటివి జరిగాయా? కోర్టు వివాదాలు ఉన్నాయా? అనేవి చూసుకోండి. కొన్ని నిర్మాణాలకు హెచ్ఎండీఏకు బదులు పంచాయితీ సెక్రటరీ, ఆర్ఐలు అనుమతులు మంజూరు చేసిన ఉదంతాలు ఉన్నాయి. లేఅవుట్లలో ఉన్న కామన్ ఏరియాలు, పార్కులు, రహదారులు సైతం కాలక్రమంలో ఆక్రమణలకు గురవుతున్నాయి. కేవలం రికార్డుల్లో మాత్రమే ఇవి ఉంటూ.. వాస్తవంలో కనుమరుగు అవుతున్నాయి. ఈ విషయాన్ని హైడ్రా సీరియస్‌గా తీసుకుంటోంది. ఇలా ఆక్రమణలకు గురైన వాటినీ పునరుద్ధరిస్తుంది. వీటిని పరిరక్షించడం కోసం నిర్దిష్ట విధానాన్ని రూపొందించింది. -
స్థిరాస్తి కొంటున్నారా?
రూ. 50 లక్షలు దాటితే టీడీఎస్ తప్పనిసరి గడిచిన పదేళ్లుగా భారత్‌లో రియల్టీ వ్యాపారం ఊపందుకోవడంతో... భూముల ధరలూ భారీగా పెరిగాయి. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఈ దామాషా ప్రకారం భూముల విలువలు పెరగలేదు. ఇది రియల్టీలో నల్లధనం సమస్యను తీవ్రం చేసింది. ఇలాంటి పరిస్థితిని కొంతమేరకు నివారించడానికి కేంద్రం 1961 ఆదాయపు పన్ను (ఐటీ) చట్టంలో 194 ఐఏ సెక్షన్‌ను తీసుకొచ్చింది. ఇది 2013 జూన్ నుంచీ అమల్లోకి వచ్చింది. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి లావాదేవీ విలువ రూ.50 లక్షలు, ఆపై ఉంటే ఒకశాతం టీడీఎస్‌ను (మూలం వద్ద పన్ను మినహాయింపు) ఈ సెక్షన్ నిర్దేశిస్తోంది. తేలిగ్గా టీడీఎస్... ఈ సెక్షన్ ప్రకారం, రూ.50 లక్షలకు పైబడి స్థిరాస్తిని కొనుగోలు చేసేవారు ట్యాన్‌కు (ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నంబర్) దరఖాస్తు చేసి, రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఉన్న కొన్ని ఇబ్బందుల దృష్ట్యా పన్ను చెల్లింపుదార్లకు ఒక వెసులుబాటు ఇచ్చారు. దీని ప్రకారం పన్నును డిపాజిట్ చేసి, ‘పాన్’ ద్వారా రిటర్న్స్ దాఖలు చేసే సౌలభ్యాన్ని కల్పించారు. అమ్మకందారుకు పాన్ అవసరం.. ఇక్కడ టీడీఎస్ చెల్లింపులకు సంబంధించి బాధ్యత ఎవరిదన్న సందేహం తలెత్తవచ్చు. స్థిరాస్తి కొనుగోలు చేసిన వ్యక్తిదే ఈ బాధ్యత. లావాదేవీ విలువలో ఒక శాతం టీడీఎస్‌గా చెల్లించాల్సి ఉన్నప్పటికీ... అమ్మకందారుకు పాన్ లేకపోతే మాత్రం ‘డిడక్షన్ రేటు’ 20 శాతంగా ఉంటుంది. అమ్మకందారు-కొనుగోలు దారు పరస్పరం నిర్ణయించుకున్న, లేదా ప్రభుత్వం నిర్ణయించిన విలువను ‘లావాదేవీ విలువ’గా పరిగణిస్తారు. రుణం పొందిన లేదా లావాదేవీ సొమ్ము చెల్లించిన తేదీ (ఏది మంచిదైతే అది) నుంచీ టీడీఎస్ అమలవుతుంది. ఆలస్యం అయితే... నెలకు ఒకశాతం వడ్డీ పడుతుంది. అలాగే నెలకు ఒకశాతం లేట్ పేమెంట్ పన్ను భారమూ పడుతుంది. చెల్లింపులు ఇలా... టీడీఎస్ జరిగిన 7 రోజుల నుంచి నెలరోజుల లోపు ప్రభుత్వానికి దీన్ని జమ చేయాల్సి ఉంటుంది. 26 క్యూబీ ఫారమ్ (రిటర్న్కమ్ చలాన్) ద్వారా ఆన్లైన్ ట్యాక్స్ పేమెంట్ జరపవచ్చు. ఠీఠీఠీ.్టజీటఛీ.ఛిౌఝ వెబ్సైట్లో (టీడీఎస్ ఆన్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ) ఈ ఫామ్ దొరుకుతుంది. పన్ను చెల్లింపులకు అలాగే ట్యాక్స్ డిడక్ట్, చెల్లింపులకు సంబంధించి రిటర్న్ ఫైలింగ్‌కు... రెండు విధాలా ఈ ఫామ్ ఉపయోగపడుతుంది. డిడక్టయిన పన్ను డిపాజిట్, 26క్యూబీ ద్వారా రిటర్న్ ఫైలింగ్ పూర్తయిన తరువాత 15 రోజులలోపు ఆస్తి కొనుగోలుదారు ఫారమ్ 16బీలో టీడీఎస్ సర్టిఫికెట్‌ను జారీచేయాలి. 16బీ ఫామ్ ఠీఠీఠీ.్టఛీటఛిఞఛి.జౌఠి.జీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 26క్యూబీ అకనాలెడ్జ్మెంట్ ఫామ్‌ను ఆస్తి రిజిస్ట్రేషన్, బదిలీ సమయంలో సమర్పించాలి. ఈ ఆన్లైన్ ప్రక్రియను సొం తంగా చేసుకోలేకపోతే, వృత్తి నిపుణుల సహాయాన్ని స్వీకరిస్తే బాగుంటుంది. 194 ఐఏ సెక్షన్‌పై ఇంకేమైనా సందేహాలు ఉంటే... మైఐటీరిటర్న్ మొబైల్ యాప్ ద్వారా ‘ఆస్క్ ఏ క్వశ్చన్’ సేవలను ఉచితంగా పొందవచ్చు. - అమూల్ మిశ్రా, మై ఐటీ రిటర్న్ డాట్‌కామ్ -
ఒప్పంద పత్రంలో ఏముంది!
సాక్షి, హైదరాబాద్ : మనకు నచ్చే ఫ్లాట్ దొరికేంత వరకూ నగరం నలుమూలలా తిరుగుతాం. రుణమెంత వస్తుందో ముందే బ్యాంకర్లతో చర్చించి, ఆర్థిక పరిమితులు దాటకుండా జాగ్రత్తపడతాం. కోరుకున్న ఫ్లాట్ దొరికితే చాలు.. అడ్వాన్సు అందజేసి బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటాం. మరి ఈ పత్రంలో ఏముందో.. ఏయే అంశాల్ని పేర్కొన్నారో తెలుసుకోవాలి. లేదంటే సొంతింటి ఆనందానికి దూరమైనట్లే. ► స్థిరాస్తుల కొనుగోలులో అతి కీలకమైన విషయం అమ్మకందారునితో కుదుర్చుకునే ఒప్పందమే. జీవిత కాలపు కష్టార్జితానికి తోడు, బ్యాంకు నుంచి అప్పు తీసుకుని మరీ సొమ్ము చెల్లిస్తాం. తీరా కొనుగోలు చేశాక, న్యాయపరమైన చిక్కులున్నాయనో, ఇంటిపై అప్పు ఉందనో తేలితే.. ఎంత నష్టం? ఇలాంటి లొసుగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అన్ని రకాలుగా పక్కాగా ఉందని తేలాకే కొనుగోలుపై ముందడుగు వేయాలి. ► ఇంటి విలువ ఎంతన్నది కేవలం భవనానికే పరిమితమైన అంశం కాదు. ఇందులో అనేక ఇతర ఖర్చులు కలుస్తాయి. విద్యుత్, మంచినీరు, పార్కింగ్, వివిధ రకాల పన్నులతో పాటు రిజిస్ట్రేషన్ వంటి ఖర్చులుంటాయి. ఇవన్నీ మొత్తం విలువలో ఉండేలా చూసుకోండి. ► ఇతర రుసుములు ఏమైనా ఉన్నాయేమో అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒప్పంద పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ విషయంలో రియల్టీ లావాదేవీల్లో అనుభవం ఉన్న న్యాయవాదిని సంప్రదించాలి. అభ్యంతరాలుంటే.. బిల్డర్‌ను సంప్రదించడం ద్వారా ఆ విషయాల్ని సరిదిద్దుకోవచ్చు. వాస్తవ ప్లాన్‌కు భిన్నంగా మార్పులు చేయాల్సి వస్తే.. అదనపు రుసుములు చెల్లించారా? సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతి అవసరమా.. వంటి విషయాల్ని బిల్డర్‌తో చర్చించి ఒక నిర్ణయానికి రావాలి. ► నిర్మాణం పూర్తయ్యేదెప్పుడు, ఇంటిని అప్పగించేదెప్పుడు అనే విషయాలు ముందే స్పష్టంగా తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో చాలా ప్రాజెక్టుల్లో నిర్మాణాలు ఆలస్యమయ్యాయి. ఇలా జరగడం వల్ల ఓవైపు ఈఎంఐలు కట్టలేక, మరోవైపు ఇంటి అద్దె చెల్లించలేక ఇబ్బందులపాలవుతాం. ► పనులు మొదలయ్యాక నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఆలస్యమవుతుంటే బిల్డర్‌ను కలిసి మాట్లాడండి. పనుల పురోగతికిది దోహదం చేయొచ్చు. అదే ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనుగోలు చేసినవారితో ఓ సొసైటీని ఏర్పాటు చేయండి. ఫలితంగా బిల్డర్ వైపు నుంచి ఆలస్యం జరిగితే, గట్టిగా అడగడానికి వీలవుతుంది.