స్థిరాస్తి కొంటున్నారా?
రూ. 50 లక్షలు దాటితే టీడీఎస్ తప్పనిసరి
గడిచిన పదేళ్లుగా భారత్‌లో రియల్టీ వ్యాపారం ఊపందుకోవడంతో... భూముల ధరలూ భారీగా పెరిగాయి. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఈ దామాషా ప్రకారం భూముల విలువలు పెరగలేదు. ఇది రియల్టీలో నల్లధనం సమస్యను తీవ్రం చేసింది. ఇలాంటి పరిస్థితిని కొంతమేరకు నివారించడానికి కేంద్రం 1961 ఆదాయపు పన్ను (ఐటీ) చట్టంలో 194 ఐఏ సెక్షన్‌ను తీసుకొచ్చింది. ఇది 2013 జూన్ నుంచీ అమల్లోకి వచ్చింది. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి లావాదేవీ విలువ రూ.50 లక్షలు, ఆపై ఉంటే ఒకశాతం టీడీఎస్‌ను (మూలం వద్ద పన్ను మినహాయింపు) ఈ సెక్షన్ నిర్దేశిస్తోంది.
తేలిగ్గా టీడీఎస్...
ఈ సెక్షన్ ప్రకారం, రూ.50 లక్షలకు పైబడి స్థిరాస్తిని కొనుగోలు చేసేవారు ట్యాన్‌కు (ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నంబర్) దరఖాస్తు చేసి, రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఉన్న కొన్ని ఇబ్బందుల దృష్ట్యా పన్ను చెల్లింపుదార్లకు ఒక వెసులుబాటు ఇచ్చారు. దీని ప్రకారం పన్నును డిపాజిట్ చేసి, ‘పాన్’ ద్వారా రిటర్న్స్ దాఖలు చేసే సౌలభ్యాన్ని కల్పించారు.
అమ్మకందారుకు పాన్ అవసరం..
ఇక్కడ టీడీఎస్ చెల్లింపులకు సంబంధించి బాధ్యత ఎవరిదన్న సందేహం తలెత్తవచ్చు. స్థిరాస్తి కొనుగోలు చేసిన వ్యక్తిదే ఈ బాధ్యత. లావాదేవీ విలువలో ఒక శాతం టీడీఎస్‌గా చెల్లించాల్సి ఉన్నప్పటికీ... అమ్మకందారుకు పాన్ లేకపోతే మాత్రం ‘డిడక్షన్ రేటు’ 20 శాతంగా ఉంటుంది. అమ్మకందారు-కొనుగోలు దారు పరస్పరం నిర్ణయించుకున్న, లేదా ప్రభుత్వం నిర్ణయించిన విలువను ‘లావాదేవీ విలువ’గా పరిగణిస్తారు. రుణం పొందిన లేదా లావాదేవీ సొమ్ము చెల్లించిన తేదీ (ఏది మంచిదైతే అది) నుంచీ టీడీఎస్ అమలవుతుంది. ఆలస్యం అయితే... నెలకు ఒకశాతం వడ్డీ పడుతుంది. అలాగే నెలకు ఒకశాతం లేట్ పేమెంట్ పన్ను భారమూ పడుతుంది.
చెల్లింపులు ఇలా...
టీడీఎస్ జరిగిన 7 రోజుల నుంచి నెలరోజుల లోపు ప్రభుత్వానికి దీన్ని జమ చేయాల్సి ఉంటుంది. 26 క్యూబీ ఫారమ్ (రిటర్న్‌కమ్ చలాన్) ద్వారా ఆన్‌లైన్ ట్యాక్స్ పేమెంట్ జరపవచ్చు. ఠీఠీఠీ.్టజీటఛీ.ఛిౌఝ వెబ్‌సైట్‌లో (టీడీఎస్ ఆన్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ) ఈ ఫామ్ దొరుకుతుంది. పన్ను చెల్లింపులకు అలాగే ట్యాక్స్ డిడక్ట్, చెల్లింపులకు సంబంధించి రిటర్న్ ఫైలింగ్‌కు... రెండు విధాలా ఈ ఫామ్ ఉపయోగపడుతుంది.
డిడక్టయిన పన్ను డిపాజిట్, 26క్యూబీ ద్వారా రిటర్న్ ఫైలింగ్ పూర్తయిన తరువాత 15 రోజులలోపు ఆస్తి కొనుగోలుదారు ఫారమ్ 16బీలో టీడీఎస్ సర్టిఫికెట్‌ను జారీచేయాలి. 16బీ ఫామ్ ఠీఠీఠీ.్టఛీటఛిఞఛి.జౌఠి.జీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 26క్యూబీ అకనాలెడ్జ్‌మెంట్ ఫామ్‌ను ఆస్తి రిజిస్ట్రేషన్, బదిలీ సమయంలో సమర్పించాలి. ఈ ఆన్‌లైన్ ప్రక్రియను సొం తంగా చేసుకోలేకపోతే, వృత్తి నిపుణుల సహాయాన్ని స్వీకరిస్తే బాగుంటుంది. 194 ఐఏ సెక్షన్‌పై ఇంకేమైనా సందేహాలు ఉంటే... మైఐటీరిటర్న్ మొబైల్ యాప్ ద్వారా ‘ఆస్క్ ఏ క్వశ్చన్’ సేవలను ఉచితంగా పొందవచ్చు.
- అమూల్ మిశ్రా, మై ఐటీ రిటర్న్ డాట్‌కామ్