bv ramana
-
గుట్కా స్కాం కేసులో మాజీ మంత్రి పేరు?
సాక్షి, చెన్నై: గుట్కా స్కాం కేసులో ఈడీ తన చార్జ్‌షీట్‌ను చెన్నై సెషన్స్ కోర్టులో దాఖలు చేసింది. ఇందులో మాజీ మంత్రి బీవీ రమణతో పాటు పలువురి పేర్లు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. గుట్కా విక్రయాలకు లంచం వ్యవహారం గతంలో పోలీసు శాఖలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో లభించిన ఓ డైరీ గుట్కా గుట్టు ను వెలుగులోకి తెచ్చింది. సీబీసీఐడీ విచారించినా, కేసు అడుగైనా ముందుకు సాగని దృష్ట్యా, చివరకు సీబీఐ రంగంలోకి దిగింది. సీబీఐ రంగంలోకి దిగి దిగగానే, దాడులు హోరెత్తాయి. అప్పటి డీజీపీ, మాజీ కమిషనర్, మాజీ మంత్రి, ప్రస్తుత ఆరోగ్యమంత్రి అంటూ లిస్టు చాంతాడు అంతగా మారింది. మాజీ మంత్రి బీవీ రమణ, ప్రస్తుతం ఆరోగ్యమంత్రి విజయభాస్కర్‌ల వద్ద విచారణ సాగించిన సీబీఐ, పోలీసు బాసులపై ఆచితూచి స్పందించే రీతిలో అడుగులు వేసింది. తొలుత సీబీఐ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. ఈ సమయంలో విచారణకు కరోనా అడ్డుగా మారింది. ఓ వైపు సీబీఐ మళ్లీ ఫైల్ దుమ్ము దులిపిన నేపథ్యంలో ఈడీ తన చార్జ్ïÙట్ను మంగళవారం సాయంత్రం చెన్నై జిల్లా సెషన్స్ కోర్టులో దాఖలు చేసి ఉండడం గమనార్హం. ఎన్నికల వేళ చార్జ్‌షీట్ కలవరం... గుట్కా స్కాంలో ఈడీ విచారణ చార్జ్‌షీట్ అన్నాడీఎంకేను కలవరంలో పడేసింది. ఎన్నికల వేళ ఈ వ్యవహారాన్ని ప్రతి పక్షాలు అస్త్రంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ చార్జ్‌లో 2013 –2016 మధ్య రూ.639 కోట్ల మేరకు అక్రమ గుట్కా వ్యవహారాలు సాగినట్టు తేల్చారు. అలాగే, చార్జ్‌షీట్‌లో మాజీ మంత్రి రమణ పేరు చేర్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే ప్రస్తుత ఆరోగ్యశాఖ మంత్రి సహాయకుల పేర్లు సైతం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ కేసులో గుట్కా విక్రయదారులు మాధవరావు, శ్రీనివాసరావు, ఉమాశంకర్ గుప్తాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడుల్లోని ఆస్తుల వివరాలు, రూ. 246 కోట్ల మేరకు చేసిన ఆస్తుల అటాచ్ వివరాలను చార్జ్ షీట్లో పొందు పరిచారు. -
చంద్ర బాబు రాయలసీమ ద్రోహి
ఆదోని అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీమ ప్రజలకు అన్యాయం చేసి ద్రోహిగా నిలిచారని పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి బీవీ రమణ అన్నారు. గురువారం పట్టణంలోని జార్జిరెడ్డి భవన్లో రాయలసీమ సమస్యలపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు రాజధాని పేరుతో అమరావతి పిచ్చి పట్టిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడిచినా సీమ ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కోస్తా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ రాయలసీమను గాలికి వదిలేయడం సిగ్గుచేటన్నారు. రాజధానిని సీమకు రాకుండా చేసి, విభజన హామీల్లో ప్రకటించిన కడపలో ఉక్కు పరిశ్రమ, కర్నూలులో హై కోర్టు ఏర్పాటు అంశాలను ప్రభుత్వాలు గాలికి వదిలేశాయన్నారు. జీఓ 69ని రద్దు చేయకుండా రాయలసీమ రైతాంగాన్ని బలితీసుకుంటున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సీమలో విద్యాభిద్ధికి రూ.వంద కోట్లు, సీమ అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సదస్సులో నాయకులు నరేష్ ఆచారి, అంజి, రాము, మహేంద్ర, రాజు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అలా వస్తున్నారు..ఇలా వెళ్తున్నారు!
రాజాం సిటీ: రాజాం నగర పంచాయతీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న బి.వి.రమణపై బదిలీ వేటు పడింది. ఈయన గత నెల 2న ఇక్కడ విధుల్లో చేరగా.. 56 రోజులకే బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. అది కూడా గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో ఎగ్జిస్టింగ్ పోస్టుకు బదిలీచేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈయన 2008 లోనూ ఇక్కడ నగర పంచాయతీ కమిషనర్‌గా రెండేళ్ల పాటు విధులు నిర్వర్తించారు. నగర పంచాయతీ ఆవిర్భావ సమయం కావడంతో తనదైన శైలిలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ రాజాం పట్టణానికి వన్నెతెచ్చారు. అటువంటి కమిషనర్‌పై ఇప్పుడు రెండు నెలలు గడవకముందే బదిలీవేటు పడటం చర్చనీయాంశమైంది. టీడీపీ నేతల కనుసన్నల్లోనే.. రాజాం నగర పంచాయతీ పాలన మొత్తం గతంలో టీడీపీ సీనియర్ నేత కావలి ప్రతిభాభారతి కనుసన్నల్లోనే జరిగేది. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో నగర పంచాయతీ కమిషనర్ ఏర్పాటు నుంచి కాంట్రాక్టర్ పనులు దక్కించుకునే వరకు అన్నీ ఈమె ఆధ్వర్యంలోనే జరిగేవి. ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తయిన తర్వాత పరిస్థితి కాస్త భిన్నంగా మారుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే బీవీ రమణ కంటే ముందు ఎస్.వెంకటరమణ కమిషనర్‌గా నియమితులై వారం రోజులు కూడా పనిచేయకుండా సెలవు పెట్టడం, అనంతరం బదిలీకావడం జరిగిపోయాయి. అప్పట్లో ఇది చర్చనీయాంశం కాగా అనంతరం నగర పంచాయతీ ఏఈ జి.సురేష్ ఇన్చార్జి కమిషనర్‌గా విధులు కొనసాగించారు. ఫిబ్రవరి 2న బీవీ రమణ నగరపంచాయతీ కమిషనర్‌గా విధుల్లో చేరగా రెండు నెలలు గడవకముందే బదిలీ కావాల్సి వచ్చింది. స్థానికంగా జరుగుతున్న పనుల విషయంలో నియమ నిబంధనలు పాటించడం, పలు అంశాల్లో పట్టణవాసుల తరఫున వ్యవహరించడం కారణంగా ఈయనకు అధికార పార్టీతో విభేదాలు ఏర్పడినట్లు తెలిసింది. పనుల విషయంలో గతంలో పనిచేసిన కమిషనర్లకు భిన్నంగా వ్యవహరించడంతో టీడీపీ నాయకుల అండ కనుమరుగైంది. ఫలితంగా బదిలీ వేటు తప్పలేదనే ప్రచారం జరుగుతోంది. రెండేళ్లుగా ఇదే తీరు.. రాజాం నగర పంచాయతీకి సంబంధించి రెండేళ్లుగా పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండేళ్ల క్రితం నగర పంచాయతీ కమిషనర్‌గా పి.సింహాచలం విధులు నిర్వహించగా 2016లో ఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతో ఆయన్ను బదిలీ చేయించారు. అనంతరం ఆమదాలవలసలో విధులు నిర్వహిస్తున్న కమిషనర్ బి.రామును ఇక్కడకు బదిలీపై తీసుకువచ్చి ఎఫ్ఏసీ బాద్యతలు అప్పగించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బదిలీల్లో ఎస్.వెంకటరమణ ఇక్కడ కమిషనర్‌గా రాగా బి.రాము రాజాం ఎఫ్ఏసీ విధులు నుంచి వైదొలగాల్సి వచ్చింది. వెంకటరమణ కూడా ఇక్కడ ఎక్కువ కాలం పనిచేయలేకపోయారు. ప్రస్తుతం బీవీ రమణ పరిస్థితి కూడా ఇదే స్థితికి వచ్చింది. అసలే పాలకమండలి లేక విలవిలలాడుతున్న నగర పంచాయతీలో అధికారపార్టీ పెత్తనం నగరపంచాయతీ కమిషనర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కేబినెట్లో మళ్లీ మార్పు
సాక్షి, చెన్నై : సీఎం జయలలిత కేబినెట్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. పాడి, డె యిరీ అభివృద్ధి శాఖ మంత్రి మాధవరం మూర్తికి ఉద్వాసన పలికారు. మాజీ మంత్రి బీవీ రమణకు మళ్లీ కేబినెట్లో చోటు కల్పించారు. శనివారం సాయంత్రం రాజ్ భవన్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో బీవీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. మూడోసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన జయలలిత సుపరిపాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రజాహితాన్ని కాంక్షిస్తూ పథకాల్ని ప్రవేశ పెడుతున్నారు. అదే సమయంలో తన మంత్రి వర్గంలో ఎవరు చిన్న తప్పు చేసినా, ప్రజా సంక్షేమాన్ని విస్మరించినా పదవుల నుంచి సాగనంపుతున్నారు. ఆ దిశగా ఇప్పటి వరకు మూడేళ్లలో 16 సార్లు కేబినెట్లో మార్పులు చేర్పులు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజే కేబినెట్లో ఆమె మార్పు చేశారు. సీనియర్ మంత్రి మునుస్వామి, తిరువళ్లూరు జిల్లాకు చెందిన మంత్రి బీవీ రమణను సాగనంపారు. మునుస్వామి తొలగింపునకు ధర్మపురిలో పార్టీ అభ్యర్థి పరాజయం పాలు కావడమే కారణం. అయితే, తిరువళ్లూరు లోక్‌సభలో పార్టీ అభ్యర్థి గెలిచినా, రమణ పదవి ఊడటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఉద్వాసన వెనుక ఆ ఎన్నికల రాజకీయ సంబంధిత కారణాలు ఉన్నట్టు ప్రచారం సాగింది. మూడు నెలల పాటుగా ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా, ఎలాంటి వివాద చర్చలు, ఆరోపణలు, ఫిర్యాదులు లేకుండా సాగుతూ వచ్చిన రాష్ట్ర కేబినెట్లో శనివారం హఠాత్తుగా మార్పు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మూర్తి అవుట్ : మంత్రి వర్గంలో స్వల్ప మార్పు చేస్తూ సీఎం జయలలిత చేసిన సిఫారసుకు రాష్ట్ర గవర్నర్ రోశయ్య శ నివారం ఆమోద ముద్ర వేశారు. ఇందులో పాడి, డెయిరీల అభివృద్ధి శాఖ మంత్రి మాధవరం మూర్తికి ఉద్వాసన పలికారు. మాజీ మంత్రి బీవీ రమణకు మళ్లీ చోటు కల్పించారు. మాధవరం మూర్తి చేతిలో ఉన్న పాడి, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రి పదవి బీవీ రమణకు అప్పగించారు. సాయంత్రం రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీవీ రమణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ రోశయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో సీఎం జయలలితతో పాటుగా సహచర మంత్రులు పాల్గొన్నారు. ఫిర్యాదులతోనే...: మాధవరం మూర్తిపై సీఎం జయలలితకు ఫిర్యాదులు పెరగడంతో విచారణానంతరం ఉద్వాసన పలికినట్టుగా అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. తన శాఖ పరిధిలోని ఆవిన్ సంస్థ, పాల ఉత్పత్తి దారుల్ని ఇరకాటంలో పడేసే రీతిలో మూర్తి వ్యవహరించినట్టు సమాచారం. తనకు కావాల్సిన వాళ్లకు ఆవిన్‌లో కేటాయింపులు జరిపినట్టుగా ఫిర్యాదులు వచ్చారుు. అలాగే, పార్టీ పరంగా కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండడంతో విచారణానంతరం చివరకు ఈ నిర్ణయాన్ని జయలలిత తీసుకున్నట్టు చెబుతున్నారు. అందుకే పార్టీ పరంగా తిరువళ్లూరు జిల్లాలో విభజన కార్యక్రమం జరిగినట్టు పేర్కొంటున్నారు. 30 ఏళ్లుగా అన్నాడీఎంకేలో ఉన్న మూర్తికి అటు పార్టీ పదవి, ఇటు మంత్రి పదవి ఊడటం వెనుక మరేదేని బలమైన కారణాలు సైతం ఉండొచ్చని మరి కొందరు నేతలు పేర్కొంటుండటం గమనార్హం. -
విధుల బహిష్కరణ!
సాక్షి, చెన్నై: వాణిజ్య పన్నుల శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని, తమ శాఖ పరిధిలోని రిజిస్ట్రేషన్ విభాగంతో సమానంగా వసతులు కల్పించాలని, పదోన్నతుల్లో, ఇతర వ్యవహారాల్లో నెలకొన్న గందరగోళాన్ని చక్కదిద్దాలని, తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్న 25 రకాల డిమాండ్లను వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఇటీవల తెరపైకి తెచ్చారు. ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ వేదికగా తమ సంక్షేమాన్ని కాంక్షిస్తూ చేసిన ప్రకటనల్ని అమలు చేయాలన్న డిమాండ్‌తో ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఈ ఆందోళనలు ఆ శాఖ మంత్రి బివి రమణకు శిరోభారంగా మారాయి. ఉద్యోగుల్ని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా ఆందోళనలు మాత్రం ఆగలేదు. చివరకు బివి రమణ పదవిలో మార్పు చోటుచేసుకుంది. వాణిజ్య శాఖలో నెలకొన్న పరిస్థితులు చక్కదిద్దడం కొత్త మంత్రి ఎంసి సంపత్‌కు సవాల్‌గా మారింది. అయితే, తాము మాత్రం మెట్టు దిగే ప్రసక్తే లేదన్నట్టుగా ఉద్యోగులు ముందుకెళ్లున్నారు. విధుల బహిష్కరణ: తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా మంగళవారం నుంచి ఆందోళన ఉధృతం చేశారు. రాష్ట్రంలో 500 వరకు ఉన్న వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల్లోని ఏడు వేల మంది సిబ్బంది విధుల్ని బహిష్కరించారు. బుధ, గురు వారాల్లో సైతం ఈ సమ్మె కొనసాగనుంది. ఉద్యోగులందరూ విధుల్ని బహిష్కరించడంతో ఉన్నతాధికారులు మొక్కుబడిగా తమ సీట్లలో వచ్చి కూర్చుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని కార్యాలయాలు బోసిపోయాయి. వ్యవహారాలు పూర్తిగా స్తంభించాయి. వాణిజ్య పన్నుల వసూళ్లు ఆగడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ఈ విషయమై ఆ ఉద్యోగుల సంఘం నాయకుడు జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమల్లో 25 శాతం నిధులు వాణిజ్య పన్నుల సిబ్బంది శ్రమ ఫలితంగా వచ్చినవేనని చెప్పారు. ఆదాయన్ని సమకూర్చే తమకు ఎలాంటి వసతుల్ని కల్పించక పోవడం విచారకరమన్నారు. అసెంబ్లీ వేదికగా తాత్కాలిక ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయనున్నట్టు ఇది వరకు మంత్రిగా ఉన్న బివి రమణ ప్రకటించారని గుర్తు చేశారు. ఈ ప్రకటన వెలువడి ఏడు నెలలు అవుతున్నా, ఆచరణకు మాత్రం నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే విధంగా కొత్త మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం దిగి రావాలన్న కాంక్షతో మూడు రోజుల పాటుగా విధుల్ని బహిష్కరిస్తున్నామని, రాని పక్షంలో ఆందోళన ఉధృతం అవుతుందని హెచ్చరించారు.