Candidates Competition
-
ప్రచారాల ‘పోరు’గల్లు
రాజకీయ పార్టీల అభ్యర్థులను ఎన్నికల సెగ రాజుకుంటోంది. క్షణ క్షణం ఒక యుగంలా గడుపుతున్నారు. ఓ పక్క పార్టీ కార్యక్తలను కాపాడుకుంటూ మరో పక్క ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలకు గాలం వేస్తూనే ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి మనిషిని, గడపను తడుతున్నారు. భారీ సభలకు అగ్రనాయకులను రప్పించి జన బలాన్ని తమ గెలుపు బలంగా లెక్కలేసుకుంటున్నారు. సాక్షి, జనగామ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. దీంతో ఓరుగల్లు ప్రస్తుతం ప్రచారాల ‘పోరు’గల్లుఉదయం అల్పహారం తీసుకోవడమే ఆలస్యం. ప్రచారం రథంలో ఆశీనులై ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. రాత్రి వరకు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఏమాత్రం సమయం దొరికినా తమ వాహనంలోనే భోజనం చేస్తున్నారు. ప్రతి గడప తలుపు తట్టుతున్నారు. ఓటర్లను కలిసి చేసిన అభివృద్ధి పనులు, చేపట్టబోయే పనుల గురించి వివరిస్తూ తమన ఆశీర్వదించాలని కోరుతున్నారు. గ్రామాలతోపాటు మండల కేంద్రాలు, జనగామ మునిసిపాలిటీ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను కలవడానికి అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారానికి పదును పెడుతుండడంతో పోరుగడ్డ హోరెత్తుతోంది. జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో ప్రచార హోరు ఊపందుకుంది. ప్రణాళిక ప్రకారం.. డిసెండర్ 7న జరుగనున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని గ్రామాలు తిరగాలి, ఎక్కడ ఎంత స మయం కేటాయించాలి, ఏ గ్రామంలో ముఖ్య నా యకులు ఉన్నారు అని ఒక ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ ప్రచా రంలో భాగంగా ఓటర్లలో అమ్మ ప్రేమను, నాన్న ఆప్యాయతను, తమ్ముడి చిలిపి చేష్టలను గుర్తు చేసుకుంటున్నామని తెలుపుతూ వారిని ఆకట్టుకుంటున్నారు. సరదాగా.. ప్రచారంలో భాగంగా సరదా సరదా పనులు చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. పూల కొట్టు వద్ద పూలమ్మడం, తాటి వనంలో గౌడన్నల వద్దకు వెళ్లి కల్లు రుచి చూడడం, బజ్జీలు వేయడం, టీ కాచడం వంటివి చేస్తూ ఇటు ఓటర్లను అటు గ్రామస్తుల మనస్సులు దోచుకుంటున్నారు. ఓటర్ల వద్దకు.. టీఆర్ఎస్, కూటమి, బీజేపీ అభ్యర్థులు పోటీపోటీగా గ్రామాల్లో ప్రచారం చేపడుతున్నారు. నేరుగా ఓటర్ల వద్దకు వెళ్లి తమకు మద్దతు పలకాలని కోరుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. పాలకుర్తి నుంచి బరిలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ నుంచి పోటీలో ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘన్పూర్ నుంచి రంగంలో ఉన్న తాటికొండ రాజయ్య ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. కూటమి, బీజేపీకి చెందిన అభ్యర్థులు ఓటర్లను కలిసి ఓట్లు అడుగుతున్నారు. భర్తలకు తోడుగా.. బరిలో నిలిచిన అభ్యర్థులకు తోడుగా వారి సతీమణులు, కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొంటున్నారు. తమ భర్తల తరఫున ఓటర్లను కలుస్తున్నారు. టీఆర్ఎస్ జనగామఅభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సతీమణి పద్మలతారెడ్డి ఆయన గెలుపు కోసం విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. జనగామ మునిసిపాలిటీతో పాటు బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, మద్దూర్, చేర్యాల మండలాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ముత్తిరెడ్డి తనయుడు పృథ్వీరెడ్డి ఎన్నికల్లో నాన్నకు తోడుగా ప్రచార పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తోడుగా ఆయన సతీమణి ఎర్రబెల్లి ఉషాదేవి నియోకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. భర్త దయాకర్‌రావు గెలుపు కోసం పల్లెల్లో పర్యటిస్తూ ఓట్లు అడుగుతున్నారు. టీఆర్ఎస్ స్టేషన్ ఘన్‌పూర్‌లో అభ్యర్థి తాడికొండ రాజయ్య సతీమణి మేరీసైతం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. దగ్గర పడుతున్న సమయం.. ఎన్నికల ప్రచారానికి ఇక వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 7వ తేదీన జరుగనున్న ఓటింగ్‌కు వారంరోజులు మాత్రమే సమయం ఉంది. ఓటింగ్‌కు 48గంటల ముందే ప్రచారాన్ని నిలిపేయాల్సి ఉంటుంది. దీంతో ప్రచార వేడిని మరింతగా పెంచనున్నారు. ఇప్పటికే అపద్ధర్మ సీఎం కేసీఆర్ మూడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మిగితా పార్టీల నుంచి అగ్రనాయకులు రావాల్సి ఉంది. అధినేతల ప్రచారంతో పోరుగడ్డ మరింతగా హీటెక్కనుంది. -
కాంగి ‘రేసు’ లొల్లి
సాక్షి, వరంగల్: కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి ముదురుతోంది. మహాకూటమి పొత్తుల్లో భాగంగా ‘హస్తం’ నేతలు ఆశిస్తున్న స్థానాలను భాగస్వామ్య పార్టీలకు కేటాయిస్తున్నట్లు సంకేతాలు రావడంతో అసంతృప్తి జ్వాల ఎగిసిపడుతోంది. అసంతృప్త నేతలు, వారి అనుచరులు ఆందోళన బాట పడుతున్నారు. వరంగల్ పశ్చిమ టికెట్‌ను కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీకి చెందిన రేవూరి ప్రకాష్‌రెడ్డికి కేటాయిస్తున్నట్లు లీకులు వచ్చాయి. దీంతో నాయిని అనుచరులు ఇప్పటికే నిరసన బాట పట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పశ్చిమ టికెట్‌ను నాయిని రాజేందర్‌రెడ్డికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ నేతృత్వంలో పలువురు డీసీసీ భవన్లో స్వీయ నిర్బంధం విధించుకోవడంతోపాటు నిరాహారదీక్షకు దిగారు.రాజేందర్‌రెడ్డికి టికెట్ ప్రకటించి బీ ఫాం అందజేసే వరకూ ఆమరణ నిరహార దీక్ష చేపడుతున్నట్లు కట్ల శ్రీనివాస్ ప్రకటించారు. ఆయనకు సంఘీభావంగా నియోజకవర్గంలోని 24 మంది డివిజన్ అధ్యక్షులు, నాయకులు దీక్షల్లో పాల్గొంటున్నారు. సోమవారం నాటికి రెండో రోజుకు చేరుకోవడంతో పీసీసీ ప్రతినిధిగా సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు డీసీసీ భవన్‌కు చేరుకుని దీక్షల్లో ఉన్న నేతలతో చర్చలు జరిపారు. లోపలకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ మహిళా నేతలు అడ్డుకుని రాజేందర్‌రెడ్డికి టికెట్ ఇచ్చే వరకూ దీక్షలు విరమించేదిలేదని స్పష్టం చేశారు. దీంతో వీహెచ్ ఇక్కడి విషయాలను మహాకూటమి నేతలకు వివరించి.. రాజేందర్‌రెడ్డికి టికెట్టు వచ్చే విధంగా తన వంతు ప్రయత్నాలు చేస్తానని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. అదేవిధంగా.. మహాకూటమి పొత్తుల్లో భాగంగా తూర్పు, వర్ధన్నపేట టికెట్లు టీజీఎస్ పార్టీకి కేటాయిస్తున్నారనే లీకులు రావడంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కొండేటికే ఇవ్వాలంటూ ధర్నా. కూటమి పొత్తుల్లో భాగంగా వర్ధన్నపేటను తెలంగాణ జనసమితి (టీజేఎస్)కు కేటాయిస్తున్నారన్న సంకేతాలతో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ అనుచరులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. గాంధీభవన్ ఎదుట అందోళనకు దిగారు. నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటున్న కొండేటి శ్రీధర్‌కు కాకుండా పొత్తుల్లో టీజేఎస్‌కు ఎలా కేటాయిస్తారంటూ ధర్నా చేపట్టారు. పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకు శ్రీధర్ అహర్నిశలు కష్టపడ్డారని.. ఆర్థికంగా నష్టపోయాడని.. వర్ధన్నపేట టికెట్‌ను ఆనకే కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించిక తప్పదని పీసీసీ నేతలను హెచ్చరించారు. తూర్పులో స్వతంత్ర అభ్యర్థిగా ‘రాజనాల’ వరంగల్ తూర్పు టికెట్టును పొత్తుల్లో భాగంగా టీజేఎస్‌కు కేటాయిస్తున్నట్లు పీసీసీ లీకులు ఇవ్వడంతో కాంగ్రెస్ గ్రేటర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి సోమవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీలో ఉన్నత స్థాయి పదవులు అనుభవించిన నాయకులు పార్టీని వదిలివెళితే కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు టికెట్ ఇచ్చేది లేదని పీసీసీ నేతలు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన నామినేషన్ అనంతరం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అంతే కాకుండా పార్టీలో టికెట్ రాని అసంతృప్తులు అన్ని నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసేలా.. వారిని సంసిద్ధులను చేస్తానని హెచ్చరించారు. డబ్బులున్న రియల్టర్లు, వ్యాపారవేత్తలకు టికెట్లు ఇస్తామంటే ఎట్లా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని 25ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్న వారిని విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు వెనుకాడేది లేదన్నారు. -
‘నవీముంబై’ రేసులో ఐదుగురు
- రేసులో ముందున్న సుధాకర్ సోనవణే - ఎస్సీకి రిజర్వు అయినమేయర్ పీఠం సాక్షి, ముంబై: నవీముంబై కార్పొరేషన్ మేయర్ పదవికి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మేయర్ పదవికి ఎన్సీపీ నేత గణేశ్ నాయక్ అననూయుడు సుధాకర్ సోనవణే, రంజనా సోనవణే డిప్యూటీ పదవికి కాంగ్రెస్ నేత అవినాశ్ లాడ్ పేర్లు వినిపిస్తున్నాయి. మేయర్ పదవి ఎస్సీకి రిజర్వు చేశారు. సోమవారం జరిగిన ఇరుపార్టీల సమావేశంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎన్సీపీ అభ్యర్థి ఐదేళ్లు మేయర్‌గా కొనసాగుతారు. కాంగ్రెస్ కార్పొరేటర్లలో ఇద్దరు రెండున్నర ఏళ్ల చొప్పున డిప్యూటీ మేయర్ పద విలో ఉంటారని తీర్మానించారు. సుధాకర్ సోనవణే, రంజనా సోనవణే, రమేశ్ డోలే, సరేఖా నర్బాగే, ముద్రికా గావ్లీ, తనూజా మడ్వీ, నివృత్తి జగ్తాప్ మేయర్ పదవి రేసులో ఉన్నారు. వీరిలో సుధాకర్ సోనవణేకు గణేశ్ మద్దతుతో పాటు కార్పొరేషన్ పరిధిలో అన్ని వర్గాలతో మంచి సంబంధాలున్నాయి. సభాగృహం నడిపించే సత్తా ఉండటంతో ఆయన పేరు అగ్రస్థానంలో ఉన్న ట్లు తెలిసింది. ఇక డిప్యూటీ కోసం కాంగ్రెస్ తరఫున రమాకాంత్ మాత్రే భార్య మందాకిని మాత్రే, అవినాశ్ లాడ్ రేసులో ఉన్నారు. సీని యార్టీ ప్రకారం లాడ్‌కు ప్రధాన్యం లభించనుంది. మే 5 లేదా 6న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత స్పీ కర్ అనంత్ ఓడటంతో జయవంత్ సుతార్‌ను నియమించే సూచనలు ఉన్నాయి. 291 మంది డిపాజిట్లు గల్లంతు నవీముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 568 మంది అభ్యర్థులు బరిలో దిగారు. అందులో 291 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. కాంగ్రెస్ 66 మంది అభ్యర్థులు ఉండగా ఎన్సీపీ-4, బీజేపీ-7, శివసేన-2 ఇతరులు, ఇండిపెండెంట్లు 212 మంది ఉన్నారు.