ఎల్బీనగర్లో 12 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
హైదరాబాద్: నగరంలో ఎక్కడో ఒకచోట పేకాట శిబిరాలు వెలుస్తూనే ఉన్నాయి. పోలీసుల కంటపడకుండా ఇలాంటి శిబిరాలను యదేచ్ఛగా నడుపుతున్నారు. తాజాగా ఎల్బీనగర్లో ఓ హెటల్పై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 12మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 3.75లక్షల రూపాయల విలువ చేసే కారు, ఐదు బైక్లు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.