వామ్మో..క్యాష్లాస్ !
- నగదు రహిత లావాదేవీలపై సర్వీస్ చార్జీల భారం
- 4 నుంచి 11శాతం వరకు వసూలు
- ఆందోళనలో వినియోగదారులు
ధర్మవరం : lధర్మవరం పట్టణంలోని మీ సేవ కేంద్రం నిర్వహకుడు శ్రీధర్.. నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు స్వైపింగ్ మిషన్ ఏర్పాటు చేసుకున్నా డు. అయితే ప్రతి నెలా రూ. 750 నెల సరి చార్జ్ (రెంటు) వసూలు చేస్తున్నా రు. అలాగే ప్రతి బిల్లుపైనా 12 నుంచి 14 శాతం వరకు సర్వీస్ ట్యాక్స్ కట్ అవుతోంది. దీంతో బిల్లులు చెల్లించేందుక వచ్చే వినియోగదారుడికి సమాధా నం చెప్పలేక నగదుతోనే లావాదేవీలు నిర్వహిస్తున్నాడు.
∙ధర్మవరం పట్టణానికి చెందిన రాజశేఖర్ పెట్రోల్ బంకుకు వెళ్లి రూ. 200 పెట్రోల్ వేయించుకుని స్వైపింగ్ చేస్తే రూ.210 డెబిట్ అయినట్లు సెల్‌కు మెసేజ్ వచ్చింది. అదే సినిమా టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రూ.వంద టికెట్‌కు సర్వీస్ చార్జ్ కింద రూ.12 అకౌంట్లో కట్ అయ్యింది.. దీంతో సదరు వ్యక్తి నగదు రహిత లావాదేవీలు కాకుండా నగదు ఇచ్చే లావాదేవీలు నిర్వహించుకుంటున్నాడు. ఇ వి కేవలం శ్రీధర్, రాజశేఖర్ మాత్రమే కాదు.. జిల్లా వ్యాప్తంగా వినియోగదారులు.. వర్తకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు. పెద్ద నోట్ల రద్దు తర్వాత క్యాష్‌లెస్ లావాదేవీలు నిర్వహించా లని చెబుతున్నా ప్రభుత్వాలు ఆవిధం గా తగు ఏర్పాట్లు చేయకపోవడం, బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయకపో వడంతో సర్వీస్ ట్యాక్స్‌ల పేరిట వినియోగదారుల నడ్డి విరుగుతోంది. ఏ చిన్న లావాదేవీ నిర్వహించినా రెండు నుంచి నాలుగు శాతం వరకు సర్వీస్ చార్జ్ రూపంలో కట్ అవుతోంది. జిల్లాలో కిరాణా దుకాణాలు, వస్త్ర దుకా ణాలు, గ్యాస్ ఏజెన్సీలు, హాస్పిటళ్లు, రెస్టారెంట్లు తదితర ప్రాంతాల్లో ప్రతి రోజూ రూ. కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. సగటున రోజూ జిల్లాలో రూ.50 కోట్ల లావాదేవీలు జరిగాయనుకుంటే అందులో 30శాతం లావాదేవీలు నగదు రహితంగా జరిగితే కేవలం 4శాతం చొప్పున సర్వీస్ ట్యాక్స్ కింద రూ.12 కోట్లు పోతోంది. అలాగే çజిల్లాలో 300 దాకా పెట్రోల్ బంకులు ఉన్నాయి. రోజుకు సగటున 1.5 లక్షల లీటర్ల పెట్రోల్ విక్రయాలు, 3 లక్ష లీటర్ల మేర డీజిల్ విక్రయాలు జరుగుతాయి. ఇవి మొత్తం క్యాష్‌లెస్ లావాదేవీలు నిర్వహిస్తే ఎంత మొత్తంలో సర్వీస్ ట్యాక్స్ కింద థర్డ్‌పార్టీకి (నిర్వహణ సంస్థలు) జమవుతుందో మీరే ఊహించండి.
నోస్వైపింగ్ : ప్రస్తుత పరిస్థితుల్లో జేబు లో కార్డు ఉన్నప్పటికీ ఏ బ్యాంకు ఖాతాదారుడు స్వైపింగ్ చేయడానికి ఇష్టపడ టం లేదు. నగదు రహిత లావాదేవీల్లో రూ.100తో కొనుగోలు చేసే వస్తువుకు రూ.104 చెల్లించాల్సి వస్తోందని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నాయే గానీ..సర్వీస్ చార్జీల భారం లేకుండా చేయలేకపోతున్నాయి.
నిర్వహణ సంస్థలకు భారీ ఆదాయం : నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తే బ్యాంకుల కంటే నిర్వహణ సంస్థలే అధికంగా లాభపడుతున్నాయి. నగదు రహిత లావాదేవీల్లో సర్వీస్ చార్జీలు మొత్తం బ్యాంకులకు జమ కాదు. ఆ మొత్తం మాస్ట్రో, వీసా లాంటి నిర్వహణ సంస్థలకు పూర్తిగా వెళ్లిపోతాయి. రోజూ రూ.కోట్ల మేర సర్వీస్ చార్జీల కింద వారికి జమవుతోంది. ఇప్పటిౖకెనా ప్రభుత్వ పెద్దలు నగదు రహిత లావాదేవీల్లో సర్వీస్ ట్యాక్స్‌లు పూర్తిగా ఎత్తివేయాలని ప్రజలు కోరుతున్నారు.