పోనీ రోజెస్ ఫ్లవర్‌పాట్
ఇంటిప్స్
సిట్టింగ్ రూమ్‌లోకి పూలతోట నడిచి వచ్చినట్లుంది కదూ! నిండుగానూ సింపుల్‌గానూ కంటికి ఆహ్లాదకరంగానూ కనిపిస్తున్న ఈ ఫ్లవర్ అరేంజ్మెంట్ కోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. మందపాటి గాజు బాటిల్ కాని పింగాణి జాడీ కాని తీసుకుని అందుబాటులో ఉన్న పూలు, ఆకులన్నింటినీ ఒక క్రమపద్ధతిలో క్రియేటివ్‌గా అమర్చడమే. గులాబీ, జినియా పూలతోపాటు రకరకాల ఆకులను వాడారు. అవి, ఇవి అన్న తేడా లేకుండా అన్ని రకాల పూలను వాడవచ్చు.
ఈ సీజన్ చేమంతులు బాగా పూస్తాయి కాబట్టి తెల్ల చేమంతులను వాడి చూడండి. గదికి అందాన్ని తీసుకురావడంతోపాటు చేమంతుల నుంచి వచ్చే పరిమళం ఊపిరితిత్తుల సమస్యలను నివారిస్తుంది కూడా. తెలుపు, పచ్చ రంగుల కాంబినేషన్ ఎక్కడయినా అమరుతుంది. గది గోడల రంగు, ఫర్నిచర్ గురించి పట్టించుకోవాల్సిన పనే ఉండదు.