రోడ్డు ప్రమాదంలో ఎన్ఆర్ఐ దంపతుల మృతి
మదనపల్లెక్రైం: వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చి న ఎన్ఆర్ఐ దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మర ణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డా రు. ఓ యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు, కారు, ద్విచక్ర వాహనం నుజ్జయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం మదనపల్లెకు మూడు కిలోమీట ర్ల దూరంలోచెన్నై-ముంబయి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
స్థానికులు, మృతుల కుటుంబసభ్యుల కథనం మేరకు..
నిమ్మనపల్లె మండలం గంగాపురంపల్లెకు చెందిన ఓబుల్‌రెడ్డి కుమారుడు కేశవరెడ్డి (58) రైల్వే స్టేషన్మాస్టారుగా పనిచేస్తూ పీలేరులో స్థిరపడ్డారు. వీరి అన్న వెంకట్రమణారెడ్డి మదనపల్లెలో సోషియల్ వెల్ఫేర్ అధికారిగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. వీరి చివరి తమ్ముడు చక్రపాణిరెడ్డి (40) ఆర్మీలో పనిచేసి ఏడాదిన్నర కాలంగా భార్య ఉషా(35), కుమార్తె తాని యా(17)తో సింగపూర్‌లో ఉంటున్నారు. అన్న వెంకట్రమణారెడ్డి కుమార్తె వివాహం కోసం చక్రపాణిరెడ్డి, ఉషా, తానియాలు రెండురోజుల క్రితం మదనపల్లెకు వచ్చారు.
గురువారం రాత్రి నుంచి పెళ్లి వేడుకల్లో పా ల్గొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ముహూర్తం అనంతరం పుంగనూరులోని పెళ్లికుమారుడి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత చక్రపాణిరెడ్డి, ఉషా, తానియాతో పాటు, అన్న వదినలు కేశవరెడ్డి, భూషణమ్మ కారులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలోని నవోదయ పాఠశాల సమీపంలోకి రాగానే మదనపల్లె నుంచి చిత్తూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు వేగంగా కారును ఢీకొని రోడ్డుపక్కన కాలువలోకి దూసుకెళ్లింది.
ఇదే సమయంలో కారు వెనుక వస్తున్న పుంగనూరు మం డలం కొత్తార్లపల్లెకు చెందిన చెంగప్ప కుమారుడు శంకర్(24) కారును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న భార్యాభర్తలు చక్రపాణిరెడ్డి, ఉషా అక్కడికక్కడే మృతి చెందారు. కేశవరెడ్డి, భూషణమ్మ, తానియా తీవ్రంగా గాయపడ్డారు.
బస్సులో ఉన్న పలమనేరు మం డలం ముసలమర్రికి చెందిన నాగమ్మ(55) కాలు విరి గిపోగా పలమనేరుకు చెందిన రత్నమ్మ(56), రాంబాబు(60) గాయపడ్డారు. వీరిని 108లో మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డి, భూషణమ్మ, తానియాను బెంగళూరుకు తరలించారు. నాగమ్మను తిరుపతికి రెఫర్ చేశారు. ద్విచక్ర వాహనదారుడు శంకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తానియా, కేశవరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కాపాడడంలో రూరల్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు రవిప్రకాష్‌రెడ్డి, శ్రీనివాసరావు సహకారం అందించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.