Chi La Sow
-
‘మహానటి’.. కీర్తి సురేష్
66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం కేంద్రం ప్రకటించింది. తెలుగు సినిమాను భారీ పురస్కారాలు వరించాయి. సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో ప్రధానపాత్ర పోషించిన కీర్తి సురేష్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు సినిమాగా ‘మహానటి’ ఎంపికైంది. ఉత్తమ నటుడు అవార్డునుఆయుష్మాన్ ఖురానా(అంధాధూన్), విక్కీ కౌశల్(ఉడి)కు ప్రకటించారు. ఉత్తమ దర్శకుడిగా ఆధిర్ ధర్ (ఉడి) ఎంపికయ్యారు. ఇక బెస్ట్ మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే , ఉత్తమ ఆడియోగ్రఫీతో పాటు కాస్ట్యూమ్స్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో ‘తెలుగు వెలిగింది’. తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది. ఈ దారిలో మరింత విస్తృతంగా నడవడానికి కావాల్సింది అవార్డులు, రివార్డులు. తెలుగులో వస్తున్న కొత్తతరం సినిమాలకు ప్రేక్షకులు అభినందనలతో ప్రేమను అందిస్తుంటే, జాతీయ అవార్డులు ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ నటి, మేకప్, స్పెషల్ ఎఫెక్ట్, కాస్ట్యూమ్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఈసారి జాతీయ అవార్డుల్లో మన తెలుగు వెలిగింది. చిన్నూ.. అవార్డ్ వచ్చిందని అరిచాను – రాహుల్ రవీంద్రన్ (‘చిలసౌ’ దర్శకుడు) పదేళ్ల క్రితం మా ఫ్రెండ్స్ లైఫ్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ‘చిలసౌ’ కథ తయారు చేసుకున్నాను. కెరీర్లో ఇలాంటి అవార్డ్ వస్తుందని ఊహించలేదు. ఇవాళ చాలా స్పెషల్ రోజు. నా మొదటి సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం, రెండో సినిమా రిలీజ్ కావడం, డెబ్యూ డైరెక్టర్‌గా ‘సాక్షి’ నాకు అవార్డ్ ప్రకటించడం అన్నీ ఒకే రోజు జరిగాయి. తెలుగు ప్రేక్షకులు ఒక్కసారి మనల్ని మెచ్చుకున్నా, మన పని నచ్చినా సరే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ల ఆశీర్వాదం నాకు లభించడం చాలా ఆనందంగా ఉంది. ‘మీకు నేషనల్ అవార్డ్ వచ్చింది’ అని చాలా ఫోన్లు వచ్చాయి. నాకు అర్థం కాలేదు. వెంటనే చిన్ను (రాహుల్ భార్య చిన్మయి)కి ఫోన్ చేసి గట్టిగా ‘చిన్నూ...నాకు నేషనల్ అవార్డ్ వచ్చింది..’ అని అరిచాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అవార్డ్ కోసం ‘చిలసౌ’ ఎప్పుడో పంపించి మర్చిపోయాం. ప్రస్తుతం ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను. కథను నమ్మిన హీరో, నిర్మాతలకు, నాగార్జున సార్‌కి అందరికీ థ్యాంక్స్. క్రెడిట్ ముగ్గురికి దక్కుతుంది – ప్రశాంత్ వర్మ, (’అ!’ దర్శకుడు) చాéలా హ్యాపీగా ఉంది. మరీ ముఖ్యంగా మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ రెండు కేటగిరీల్లో అవార్డులు వస్తాయని అస్సలు ఊహించలేదు. దర్శకుడిగా ఫస్ట్ సినిమాకే అవార్డ్స్ రావడం ప్రోత్సాహంలా ఉంటుంది. విభిన్నమైన సినిమాలు తీయాలనే ఆసక్తి ఇంకా పెరుగుతుంది. కమర్షియల్ సినిమాలా? డిఫరెంట్ సినిమాలా? అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ అవార్డ్స్ ఇంట్రెస్ట్ పెంచుతాయి. నేషనల్ అవార్డ్స్‌కు స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. మరో విశేషం ఏంటంటే ‘అ!’ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఈరోజు ఎందుకో ఇంట్లో హోమ్ థియేటర్ సెట్ చేసుకొని చూస్తూ ఉన్నా. అర్ధగంట అవగానే నేషనల్ అవార్డ్ వచ్చిందంటూ కాల్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు సపోర్ట్‌గా నిలబడినందుకు నానీగారికి స్పెషల్ థ్యాంక్స్. మేకప్ చీఫ్ రంజిత్‌తో పాటు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ శాంతి, అదితీ కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ల ముగ్గురికీ ఈ క్రెడిట్ వెళ్లాలనుకుంటున్నాను. అస్సలు ఊహించలేదు – రాజాకృష్ణన్ (‘రంగస్థలం’ ఆడియోగ్రాఫర్) బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో తొలిసారి జాతీయ అవార్డు సాధించినందుకు సంతోషంగా ఉంది. అది కూడా నేను చేసిన తెలుగు సినిమాకు రావడం హ్యాపీ. జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు. ‘రంగస్థలం’ చిత్రంలో హీరో రామ్‌చరణ్ సగం చెవుడు ఉన్న చిట్టిబాబు పాత్రలో బాగా నటించారు. హీరోకు వినికిడి సమస్య ఉండటంతో సౌండింగ్ ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేయడానికి మంచి అవకాశం దొరికినట్లయింది. సౌండింగ్‌కు మంచి స్కోప్ దొరికింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఈ సినిమా చేశాను. సుకుమార్‌గారు బ్రిలియంట్ డైరెక్టర్. ఆయనకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. డైరెక్టర్, హీరో, నిర్మాతలకు థ్యాంక్స్. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన తెలుగు చలన చిత్రాల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అవార్డులకు ఎంపికైన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మా బాధ్యత పెరిగింది – నాని మేకప్, వీఎఫ్ఎక్స్ విభాగాల్లో ఉత్తమ చిత్రంగా ‘అ’ సినిమా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, అవసరాల శ్రీనివాస్, మురళీ శర్మ ప్రధాన తారాగణంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. నాని, ప్రశాంతి తిపిరనేని నిర్మించిన ఈ సినిమా గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. ఈ సినిమాకి రెండు జాతీయ అవార్డులు రావడం పట్ల హీరో, నిర్మాత నాని మాట్లాడుతూ– ‘‘మా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో నిర్మించిన తొలి చిత్రం ‘అ’ మంచి విజయాన్ని సాధించి, ప్రశంసలు అందుకుంది. జాతీయ అవార్డులు రావడం మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది.. నిర్మాతగా మా బాధ్యతను మరింత పెంచింది. మా యూనిట్ తరపున జ్యూరీకి థ్యాంక్స్’’ అన్నారు. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన తెలుగు చలన చిత్రాల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అవార్డులకు ఎంపికైన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపికలో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. ‘మహానటి, రంగస్థలం, అ!, చిలసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. అవార్డులు గెలుచుకున్నవారికి నటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇతర భాషల్లో అవార్డులు గెలుచుకున్నవారికి కూడా ఆయన అభినందనలు తెలిపారు. ‘మహానటి’, ‘రంగస్థలం’ చిత్రాలకు జాతీయ అవార్డులు వస్తాయని ఈ సినిమాల రిలీజ్‌కు ముందే చిరంజీవి ఊహించి చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘మహానటి’ సినిమా విడుదల తరవాత కూడా ఓ సందర్భంలో యూనిట్ సభ్యులను చిరంజీవి అభినందించిన సంగతి విదితమే. మరాఠీలో మెరిసిన తెలుగు తేజం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరాఠీ చిత్రం ‘సైరాట్’కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సుధాకర్ రెడ్డి యక్కంటి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. మరాఠీ చిత్రం ‘నాల్’ (బొడ్డుతాడు) చిత్రానికి సుధాకర్ రెడ్డి ‘ఇందిరాగాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు అవార్డు’కు ఎంపికయ్యారు. గుంటూరుకు చెందిన సుధాకర్ రెడ్డి జేఎన్టీయూలో డిగ్రీ పూర్తి చేసి, పుణేలోని ప్రఖ్యాత ఎఫ్టీఐఐలో పీజీ పట్టా పుచ్చుకున్నారు. ‘మధుమాసం’, ‘పౌరుడు’, ‘దళం’ వంటి టాలీవుడ్ చిత్రాలకు పనిచేశాక ముంబైలో స్థిరపడ్డారు. హిందీ, మరాఠీ చిత్రాల్లో బిజీగా ఉంటూనే ‘నాల్’ చిత్రాన్ని తెరకెక్కించారు. బాల్యంతో పెనవేసుకున్న అనుభవాలను, తల్లితో కొడుకుకు ఉండే అనుబంధాన్ని ఈ చిత్రంలో సుధాకర్ ఉద్వేగభరితంగా చూపారు. అదే విధంగా ‘నాల్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన బాలనటుడు శ్రీనివాస్ పోకలేకు మరాఠీ విభాగంలో ఉత్తమ బాలనటుడు అవార్డును ప్రకటించడం విశేషం. కేజీఎఫ్‌కు డబుల్ ధమాకా యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. గత ఏడాది డిసెంబర్ 21న విడుదలై ఘన విజయం అందుకున్న ఈ సినిమా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫైట్స్ విభాగాల్లో అవార్డులు దక్కడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులకు యష్, ప్రశాంత్ నీల్, విజయ్ కిరంగదూర్ ధన్యవాదాలు తెలిపారు. ‘‘కేజీఎఫ్ చాప్టర్2’ను త్వరలోనే విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. పాటకు తొలి అవార్డు ‘పద్మావత్’ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ విభాగాల్లో మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఆయనే సంగీత దర్శకుడు కూడా. భన్సాలీ మాట్లాడుతూ– ‘‘క్రియేటివ్ ఫిల్డ్‌లో ఆర్టిస్టులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. కానీ ‘పద్మావత్’ సినిమా విషయంలో అవసరమైన దానికంటే ఎక్కువగానే సమస్యలను ఫేస్ చేశాను. నేను చేసిన సినిమాల్లో కల్లా ‘పద్మావత్’ చాలా కష్టతరమైనది. చిత్రీకరణ సమయంలో మాపై దాడులు జరిగాయి. ఈ సినిమాకు వ్యతిరేకంగా ధర్నాలు, మార్చ్‌లు చేశారు. బ్యాన్ చేయమన్నారు. ఇలా ఈ సినిమాకి ప్రతి విషయంలోనూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఈ కారణాల చేత నేను ఫీలైన ప్రతిసారీ ఓ పాట తీసేవాడిని. కొంచెం రిలీఫ్‌గా అనిపించేది. అన్ని సమస్యల మధ్య కూడా నేను ఈ సినిమా గురించి పాజిటివ్‌గానే ఆలోచించా. ఈ సినిమా విజయం సాధించడానికి అదొక కారణం అనిపించింది. ఇప్పుడు మా సినిమాకు అవార్డులు రావడం హ్యాపీగా ఉంది. ఇదొక ఎమోషనల్ మూమెంట్ మాకు. నా ప్రతి సినిమాలో సంగీతం చాలా కీలకంగా ఉంటుంది. సంగీతమే నా ప్రపంచం’’ అని అన్నారు. అయితే.. ఉత్తమ సంగీత దర్శకుడిగా సంజయ్‌కు అవార్డు రావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులు వచ్చాయి. బుల్బుల్ పాడగలదు! అస్సామీ సినిమాకు ‘జాతీయ ఉత్తమ చిత్రం’ అవార్డు అందని ద్రాక్ష. అది 2018 వరకే. రీమా దాస్ తన మొదటి సినిమా ‘విలేజ్ రాక్‌స్టార్స్’తో ఆ డ్రీమ్‌ను డెబ్యూ (తొలి) సినిమాతోనే తీర్చేశారు. అస్సామీ రాక్‌స్టార్‌గా నిలిచారు. తొలి సినిమాయే అవార్డు అందుకునే స్థాయిలో ఉన్నప్పుడు తదుపరి సినిమా మీద అంచనాలు మామూలే. ఆ అంచనాలను రెండో సినిమాతోనూ సునాయాసంగా అందుకొని అందర్నీ మరొక్కసారి రీమా దాస్ ఆశ్చర్యపరిచారు. రీమా రెండో చిత్రం ‘బుల్బుల్ కెన్ సింగ్’ ఉత్తమ అస్సామీ చిత్రం అవార్డు గెలుచుకుంది. బుల్బుల్, బోణీ, సుము అనే ముగ్గురు స్నేహితుల కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తమ సమాజం కోరుకున్నట్టు ఉండలేక, తాను అనుకున్నట్టు ఉండాలనే పోరాటం చేస్తూ తన గొంతుని వినిపించాలనుకుంటుంది బుల్బుల్. తన గొంతుని వినిపిస్తుంది. ఇది విన్న జ్యూరీ కూడా అవార్డు ఇవ్వకుండా ఉండగలదా? ‘బుల్ బుల్..’ లో ఓ దృశ్యం 66వ జాతీయఅవార్డుల ఎంపికలో ‘ఉరి: ది సర్జికల్‌స్ట్రైక్స్’ చిత్రానికి నాలుగు విభాగాల్లో (ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్) అవార్డులు వచ్చాయి. కానీ 2019, జనవరి 11న విడుదలైన ఈ చిత్రం 2018 జాతీయ అవార్డులకు ఎలా అర్హత సాధించిందనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఇక్కడే ఓ లాజిక్ ఉంది. ఒక ఏడాదిలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31వరకు సెంట్రల్‌బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబీఎఫ్సీ ) చేయించుకున్న సినిమాలను జాతీయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలా 31, 2018న ‘ఉరి’ సిబీఎఫ్సీ వద్ద సర్టిఫికేట్ పొందింది. ఆ విధంగా ‘ఉరి’ చిత్రం జాతీయ అవార్డుల రేస్‌లో నిలిచి అవార్డులను సొంతం చేసుకుంది. – ముసిమి శివాంజనేయులు, డేరంగుల జగన్ -
పే...ద్ద..చిన్న సినిమాలు
సినిమాల్లో పెద్దా చిన్న ఉండదు. కానీ చిన్న సినిమా ఒక్కోసారి పెద్దగా కనబడుతుంది.కథా వస్తువు గొప్పదనమే అనలేం! ఇవ్వాళ చిన్న సినిమా పెద్దగా కనబడటానికి కారణం కథ కంటే పెద్ద కథనమే! నిజానికి చిన్న సినిమాలకు పెద్ద సినిమాల మధ్య వెంట్రుక వాసంత సందు కూడా దొరికేది కాదు.ఊపిరాడక డబ్బాల్లోనే చచ్చిపోయేవి. కానీ టైమ్ మారింది. కాదు.. కాదు.. సినిమా మారింది. కాదు.. కాదు.. కాదు.. ఆడియన్స్ మారారు. సినిమాను మారుస్తున్నారు. 2018లో వచ్చిన ఆరు పే...ద్ద.. చిన్న సినిమాల దర్శకులతో మీకోసం ‘సాక్షి ఫన్డే’ స్పెషల్..! ఛలో విడుదల తేదీ: ఫిబ్రవరి 2, 2018 దర్శకుడు: వెంకీ కుడుముల నటీనటులు: నాగశౌర్య, రష్మిక మందన్న నిర్మాత: ఉష ముల్పురి సంగీతం: మహతి స్వరసాగర్ ‘ఛలో’.. ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే వచ్చిన ఈ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద బ్లాక్‌బస్టర్. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు వెంకీ కుడుముల. ‘ఛలో’తో పాపులర్ అయిన ఈ దర్శకుడి ఫ్యూచర్ ప్లాన్ గురించి.. ఆయన మాటల్లోనే... ∙ ఇంట్లో వాళ్లను ముందే ప్రిపేర్ చేశా! మాది భద్రాద్రి జిల్లా. హైదరాబాద్‌లో అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చదివాను. చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి ఉంది. సినిమాల్లో కెరీర్‌ను బిల్డ్ చేసుకోబోతున్నట్లు ఇంట్లో నేరుగా చెప్పకుండా ముందు అమ్మానాన్నల్ను ప్రిపేర్ చేశా. చదువు కొనసాగిస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తానని చెప్పా. ఆ తర్వాత ‘పై చదువులు చదువుతావా?’ అని అడిగారు. లేదన్నాను. సినిమా ఫీల్డ్‌లోనే కెరీర్ అని నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవ్వడంతో వాళ్లూ నో చెప్పలేదు. ∙ సోషల్ మీడియా పరిచయాలతో ఇండస్ట్రీలోకి..! కాలేజీ డేస్‌లోనే సినిమా ఫీల్డ్‌లో ఉన్న వాళ్లకు సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టేవాడ్ని. డైలాగ్స్‌ను స్టేటస్‌లుగా పెడుతుండేవాడ్ని. హీరో శివబాలాజీ, కమెడియన్ శ్రీనివాసరెడ్డి, ‘అదుర్స్’ రవి వీరందరూ నాకు ఇలానే పరిచయం. అలా ‘ఇంకోసారి’ సినిమా దర్శకుడు సుమన్ పాతూరి పరిచయం అయ్యారు. ఆయన దగ్గర నాకు రైటర్ బలభద్రపాత్రుని రమణిగారు పరిచయం అయ్యారు. ఆవిడ నన్ను దర్శకుడు తేజగారికి పరిచయం చేశారు. నిజానికి నేను యాక్టర్ అవుదామని వెళ్లాను. కానీ తేజగారు నాలో డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి ఆ దిశగా ప్రోత్సహించారు. ఆ టైమ్‌లో డైరెక్షన్‌పై ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. ఆ తర్వాత డైరెక్టర్ యోగిగారి దగ్గర, నాగశౌర్య ‘జాదుగాడు’ సినిమాకు పనిచేశా. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారి దగ్గర కూడా వర్క్ చేశా. ∙ ‘ఛలో’ అలా మొదలైంది! ‘అజ్ఞాతవాసి’ సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నప్పుడు, ఈ సినిమా తర్వాత డైరెక్షన్ ప్రయత్నాలు స్టార్ట్ చేయమన్నారు త్రివిక్రమ్‌గారు. ‘జాదుగాడు’ సినిమా టైమ్‌లో హీరో నాగశౌర్య పరిచయం అయ్యారు. ‘మనం సినిమా చేద్దాం కథ రెడీ చేయ్!’ అన్నారు. నేను చెప్పిన కథ ఆయనకు నచ్చింది. ఓ నిర్మాతకు కథ చెప్పాం. ‘కథ కమర్షియల్‌గా ఉంది. వేరే హీరోకి వెళ్దామా?’ అన్నారు. శౌర్యతో ఇంకో లవ్‌స్టోరీ చేయవచ్చు కదా అని ఆయన అభిప్రాయం. ‘నేను శౌర్యతోనే చేస్తాను’ అని చెప్పా. ఆ సమయంలోనే శౌర్య తన పేరెంట్స్‌కు నేను చెప్పిన కథ చెప్పాడు. వాళ్లు ఎగై్జట్ అయ్యారు. అలా ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్లో నా తొలి సినిమా ‘ఛలో’ మొదలైంది. ∙ ‘ఛలో’ కథ అప్పుడే పుట్టింది! ఆంధ్రప్రదేశ్ విభజనలో భాగంగా మా ఊరు అశ్వరావుపేట తెలంగాణ బోర్డర్లోకి వచ్చింది. అంటే మా ఇంటి దగ్గర్నుంచి మూడు కిలోమీటర్లు వెళితే ఇప్పుడు ఆంధ్ర వస్తుంది. ఓకే.. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ కాకుండా.. ఆంధ్ర, తమిళనాడు బోర్డర్ అయితే ఎలా ఉంటుంది? హీరో తమిళనాడు అమ్మాయిని లవ్ చేస్తే? ఈ బ్యాక్‌డ్రాప్‌లో స్క్రీన్‌ప్లే వర్కౌట్ అవుతుంది కదా అనిపించింది. అలా ‘ఛలో’ సబ్జెక్ట్‌ను టేకప్ చేశాను. ∙ నితిన్‌తో చేస్తున్నా! నితిన్‌తో ఓ సినిమా చేయబోతున్నా. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. తొలిప్రేమ విడుదల తేదీ: ఫిబ్రవరి 10, 2018 దర్శకుడు: వెంకీ అట్లూరి నటీనటులు: వరుణ్‌తేజ్, రాశిఖన్నా నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్ సంగీతం: ఎస్. థమన్ వరుణ్‌తేజ్‌కు హీరోగా ఫస్ట్ మేజర్ బాక్సాఫీస్ హిట్ ‘ఫిదా’ తర్వాత వచ్చిన ‘తొలిప్రేమ’ కూడా అంతే పెద్ద హిట్. వెంకీ అట్లూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఒక సింపుల్ ప్రేమకథనే రిఫ్రెషింగ్ కథనంతో నడిపించి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారాయన. నటుడిగా కెరీర్ మొదలుపెట్టి దర్శకుడిగా మారిన వెంకీ అట్లూరి తన కెరీర్ గురించి చెప్పిన విశేషాలు... ∙ యాక్టింగ్ నుంచి డైరెక్షన్‌కి! నాది హైదరాబాద్. ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచే సినిమాల్లో కెరీర్‌ను బిల్డ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు రైటింగ్‌పై ఆసక్తి కలిగింది. ముందు ‘స్నేహగీతం’ సినిమాలో నటించాను. ఆ తర్వాత నాకు యాక్టింగ్ కన్నా, రైటింగ్ అండ్ డైరెక్షన్ అంటేనే మక్కువ ఏర్పడింది. అందుకే ‘స్నేహగీతం’ సినిమా చేసిన తర్వాత రైటింగ్ అండ్ డైరెక్షన్‌పై ఫోకస్ పెట్టాను. దాదాపు ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి. ఫైనల్లీ ‘తొలిప్రేమ’తో డైరెక్టర్ అయ్యాను. నిజానికి ‘తొలిప్రేమ’ సినిమా సక్సెస్.. టీమ్ వర్క్ అని చెబుతా. ∙ ‘తొలిప్రేమ’కు నో చెప్పారు! మొదట్లో ‘తొలిప్రేమ’ కథకు చాలా మంది ఓకే చెప్పలేదు. ఆ తర్వాతే అది దాని దారి వెతుక్కొని ఇలా వచ్చింది. మన పని మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఎవరి పని వాళ్లని చేయనిస్తే ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది 95 పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఒక ఫైవ్ ఫర్సెంట్ లక్ ఉండాలి. ‘తొలిప్రేమ’ సినిమాకు అన్నీ కలిసొచ్చాయి. ∙ పొలిటికల్ డ్రామా చేస్తా! లవ్‌స్టోరీస్‌తో పాటు నాకు ఫ్యామిలీ డ్రామాలంటే ఆసక్తి ఎక్కువ. పొలిటికల్ డ్రామాలన్నా ఇష్టమే. భవిష్యత్‌లో నానుంచి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమాను ఆశించవచ్చు. ∙ అఖిల్‌తో సినిమా చేస్తున్నా! ప్రస్తుతం అఖిల్‌తో సినిమా చేస్తున్నాను. ఇప్పుడు దృష్టంతా ఈ సినిమాపైనే. ఒక సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడు మరో సినిమా గురించి ఆలోచించను. ఎఫర్ట్ అంతా సినిమా మీదనే పెడతా. ప్యారలల్‌గా మరో సినిమా చేయడం నాకు కంఫర్ట్‌గా అనిపించదు. ఏకాగ్రత తగ్గుతుందేమోనని నా భయం. మణిరత్నం, త్రివిక్రమ్ నా ఫేవరైట్ డైరెక్టర్స్. వాళ్ల నుంచి ఎక్కువ ఇన్‌స్పయిర్ అయ్యాననే చెప్తా. అ! విడుదల తేదీ: ఫిబ్రవరి 16, 2018 దర్శకుడు: ప్రశాంత్ వర్మ నటీనటులు: కాజల్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, నిత్యామీనన్ నిర్మాతలు: నాని, ప్రశాంతి త్రిపురనేని సంగీతం: మార్క్ కె. రాబిన్ హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన సినిమా ‘అ!’తో దర్శకుడిగా పరిచయమయ్యారు ప్రశాంత్ వర్మ. ఒక మంచి ప్రయోగంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాకు అర్బన్ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్ కథల్ని తెరకెక్కించాలన్న డ్రీమ్‌తో ముందుకెళ్తానంటున్న ప్రశాంత్ వర్మ తన గురించి చెప్పిన కొన్ని విశేషాలు.... ∙ సినిమాలను పిచ్చిగా చూసేవాడ్ని! మాది భీమవరం దగ్గర పాలకొల్లు. సినిమాలంటే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ సినిమాల్లోకి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. స్కూల్లో మంచి స్టూడెంట్‌ని. చిన్నప్పుడు ప్రతి సినిమా చూసేవాణ్ని. అయితే డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అవి కూడా బాగా వైరల్ అయ్యాయి. తర్వాత ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సినిమా గురించి తెలుసుకోవడం, చదవడం మొదలెట్టాను. ఆ తర్వాత యాడ్స్ చేశాను. ∙ ‘అ!’ నా 33వ కథ... ‘అ!’.. ఫ్రస్ట్రేషన్‌తో రాసిన కథ. 2017 న్యూ ఇయర్‌కు నా కొత్త సినిమా స్టార్ట్ కావల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది. అప్పుడు ఈ కథ రాశాను. ఆడియన్స్ ఎప్పుడూ చూడని ఒక కొత్త కథ చెబుదాం అన్న ఉద్దేశంతోనే ఈ పాయింట్ పిక్ చేసుకున్నాను. ఇది నేను రాసిన 33వ కథ. అలా అని ముందు 32 కథలు రిజెక్ట్ అయ్యాయని అనను. ఏవేవో కారణాలతో సినిమా ఫైనలైజ్ కాలేదు. ‘అ!’ సినిమా నా సొంత ప్రొడక్షన్లోనే చిన్న సినిమాలా కొత్త వాళ్లతో చేద్దాం అనుకున్నాను. మెల్లిగా కాజల్, నాని వచ్చి పెద్ద ప్రాజెక్ట్ అయింది. ∙ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ లేవు! మన దగ్గర మాత్రమే ‘నా కథతో నేనే సినిమా తీస్తాను’ అనుకుంటాం. హాలీవుడ్లో ఒకరు కథ రాస్తారు. మరొకరు స్క్రీన్‌ప్లే. ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ కంపెనీ ఒక డైరెక్టర్ని నియమించుకుంటుంది. ఇలాగే బాలీవుడ్ ‘క్వీన్’ రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మి’ నా దగ్గరికొచ్చింది. ‘అ!’ పనుల్లో బిజీగా ఉండి చేయడం కుదర్లేదు. ఆ సినిమా మధ్యలో ఆగిపోతే, మిగతా భాగమంతా వెళ్లి పూర్తి చేసి వచ్చాను. డైరెక్షన్ అనేది ఒక జాబ్ అని అనుకుంటాను నేను. అలానే వెళ్లి ఆ సినిమా చేసి వచ్చాను. నా తర్వాతి సినిమా వేరే అతని కథతో చేస్తున్నాను. ‘కథ’ అని అతనికి టైటిల్ వేస్తాను. నాకెలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ లేవు. ∙ ఆ బ్రాండ్ నా డ్రీమ్! ‘స్క్రిప్ట్ విల్లా’ అనే కంపెనీ ద్వారా మంచి కథల కోసం వెతికే ప్రొడక్షన్ హౌస్‌లకు, యాక్టర్స్‌కు మా సంస్థ నుంచి కథలను అందించే ప్రయత్నం మొదలుపెడుతున్నా. వీలైనన్ని కొత్త కథలు ఆడియన్స్‌కు చెప్పడమే నా డ్రీమ్. ‘వీడు ఇప్పటివరకూ మనం అనుకున్నట్టుగా కాకుండా, కొత్తగా కథలు చెబుతాడ్రా!’ అనే బ్రాండ్‌ని క్రియేట్ చేసుకుంటే చాలు. ఆర్ఎక్స్ 100 విడుదల తేదీ: జూలై 12, 2018 దర్శకుడు: అజయ్ భూపతి నటీనటులు: కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ నిర్మాత: అశోక్‌రెడ్డి సంగీతం: చైతన్ భరద్వాజ్ 2018లో చిన్న సినిమాల్లో అతిపెద్ద సెన్సేషన్ ‘ఆర్ఎక్స్100’. కొత్త దర్శకుడు అజయ్ భూపతి కొత్త నటీనటులతో చేసిన ఈ సినిమా యూత్ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతి. ఫ్యూచర్లో ఎంత పెద్ద హీరోలతో సినిమా చేసే అవకాశం వచ్చినా వాళ్లను తన స్టైల్లోకి తీసుకొచ్చుకొని సినిమా చేస్తానంటున్న అజయ్ ఫ్యూచర్ ప్లాన్ గురించి.. ఆయన మాటల్లోనే.. ∙ సినిమాలో మా ఊరే! మాది ఆత్రేయపురం. సినిమాలో మీరు చూసిందే. నా ఆరో తరగతి నుంచి డిగ్రీ దాకా మా ఊర్లోనే చదువుకున్నాను. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సినిమాల్లోకి వెళ్తా అన్నప్పుడు మా నాన్న గారు ‘నీకు నేనేం ఆస్తులు ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే నువ్విలా ఉండు. అలా ఉండు అని చెప్పొచ్చు. నీకు నచ్చింది నువ్వు చెయ్’ అన్నారు. ∙ అప్పుడే ఫిక్స్ అయ్యా! నా పదో తరగతిలోనే ఫిక్స్ అయ్యా, సినిమా డైరెక్టర్ అవ్వాలని. ఆ తర్వాత చదువుకోవడం కూడా టైమ్ వేస్ట్‌లా ఫీల్ అయ్యాను. ఎవ్వరైనా సరే వాళ్లేమవ్వాలనుకుంటున్నారు అనే చిన్న క్లారిటీ ఉంటే చాలు.. అది ఎంత కష్టమైనా చేసేయొచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా నాని ‘రైడ్’, రవితేజ ‘వీర’ సినిమాలకు పని చేశాను. ఆ తర్వాత మా బాస్ రామ్‌గోపాల్ వర్మ ‘అటాక్’, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘వంగవీటి’ సినిమాలకు వర్క్ చేశాను. ∙ ఎన్నో అవమానాలు.. చీదరింపులు... సినిమాల్లోకి రావాలనుకున్నాక అవమానాలు, చీదరింపులు, పస్తులు ఉండటాలు... అన్నీ ఉన్నాయి. కానీ ‘ఆర్ఎక్స్ 100’ కథను చాలామందికి చెప్పా. ఎవ్వరూ రిజెక్ట్ చేయలేదు కానీ, వాళ్ల వాళ్ల కారణాల వల్ల సినిమా చేయడం కుదర్లేదు. కార్తికేయకి బాగా నచ్చేసింది. తర్వాత నిర్మాత అశోక్ వచ్చారు. నాకు రియలిస్టిక్ సినిమాలంటే చాలా ఇష్టం. ఈ పాయింట్ బావుంటుందని గట్టి నమ్మకం ఉండేది. నేను తప్ప ఎవ్వరూ పెద్దగా నమ్మలేదు ఈ సబ్జెక్ట్‌ని. ‘ఆర్ఎక్స్ 100’లో మీరు చూసిన హీరో క్యారెక్టర్ మన ఊర్లో కనబడే రెబల్ కుర్రాడిలానే ఉంటుంది, పంచాయతీ ప్రెసిడెంట్, రాంకీగారి పాత్ర.. ఇలా ప్రతీ పాత్రను ప్రేక్షకులు రిలేట్ చేసుకునేలా డిజైన్ చే శాను. ∙ నెక్ట్స్ మల్టీస్టారర్... ‘ఆర్ఎక్స్100’ సక్సెస్ తర్వాత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఇప్పటివరకైతే ఏదీ ఫైనల్ చేయలేదు. కానీ నెక్ట్స్ సినిమా మాత్రం మల్టీస్టారర్ ఉంటుంది. రెండు భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరి వ్యక్తుల కథ. స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాను. రెండు నెలల్లో ఫుల్ డీటైల్స్ అనౌన్స్ చేస్తాను. ఏ కథ చెప్పినా రియలిస్టిక్ అప్రోచ్‌తో చెప్పడమే నా లక్ష్యం. అలాగే ప్రభాస్, రామ్ చరణ్‌తో సినిమా చేయడం నా డ్రీమ్. ఒకవేళ మా స్టైల్లో సినిమా కావాలని వాళ్లు అడిగినా స్టోరీ సిట్టింగ్స్‌లో వాళ్లను నా దారిలోకి తెచ్చేసి నా స్టైల్లో సినిమా తీసేస్తా! చి.ల.సౌ విడుదల తేదీ: ఆగస్టు 3, 2018 దర్శకుడు: రాహుల్ రవీంద్రన్ నటీనటులు: సుశాంత్, రుహాని శర్మ నిర్మాతలు: నాగార్జున, జశ్వంత్ నడిపల్లి సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి ‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’. జనరల్‌గా చాలా మంది నటీనటులు చెప్పే మాట ఇది. అయితే రాహుల్ రవీంద్రన్ మాత్రం ‘డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’ అంటున్నారు. హీరోగా సినిమాలతో మెప్పిస్తూనే ఉన్న రాహుల్, దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘చి.ల.సౌ.’ సినిమా ఈ నెల్లోనే విడుదలై సూపర్ హిట్‌గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. డైరెక్టర్‌గా మారిన ఈ యాక్టర్ సినిమా గురించి, తన ఫ్యూచర్ ప్లాన్ గురించి చెప్పిన విశేషాలు... ∙ చిన్నప్పట్నుంచీ కథలంటే ఇష్టం! నేను పుట్టి, పెరిగిందంతా చెన్నైలోనే! నాన్న ఎన్.రవీంద్రన్, అమ్మ వసుమతి. నాన్న బిజినెస్‌మేన్. చిన్నప్పట్నుంచీ అమ్మ రామాయణం, మహాభారతం కథలు చెబుతూ, యాక్టింగ్ చేసి చూపించేది. అప్పుడే నాకు కథలంటే ఇష్టం పెరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మణిరత్నంగారి ‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) సినిమాను టీవీలో చూశా. చాలా కొత్తగా, ఫ్రెష్‌గా అనిపించింది. ఓ సినిమాని ఇలా కూడా తీయొచ్చా? అనిపించింది. అప్పట్నుంచి సినిమా, డైరెక్షన్ సైడ్ ఇష్టం పుట్టింది. ఇంటర్‌కి వచ్చాక ఫిల్మ్‌మేకర్ అవ్వాలనుకుని డిసైడ్ అయ్యా. నటుడవ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ∙ అసిస్టెంట్‌గా చాన్స్ దొరకలేదు.. హీరో అయ్యా! మా ఫ్యామిలీలో ఎవరూ సినిమా ఇండస్ట్రీలో లేరు. మాది ఆ నేపథ్యం కాదు. అందుకే ఫస్ట్ చదువు పూర్తి చేసి తర్వాత ప్రయత్నిద్దామనుకుని అహ్మదాబాద్‌లో ‘మైకా’ కళాశాలలో ఎంబీఏ మార్కెటింగ్ చేశా. తర్వాత బాంబేలో ఏడాదిన్నర పాటు రేడియో సిటీలో అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్‌గా చేశా. 2007లో చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అవ్వాలనుకున్నా. కానీ, ఎవరి వద్దా అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఓ రోజు ఆడిషన్స్‌కి రమ్మని కాల్ వచ్చింది. వెళ్లగానే యాక్టింగ్ రోల్ అన్నారు. ఏ పాత్ర అంటే.. హీరో అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చాన్స్ రాలేదు. హీరోగా వచ్చింది. చేస్తే ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవచ్చు. డబ్బులు కూడా వస్తాయని చేశా. రవివర్మన్ డైరెక్షన్లో ‘మాస్కోవిన్ కావేరి’ చిత్రం చేశా. ∙ ‘అందాల రాక్షసి’ మొత్తం మార్చేసింది! ‘అందాల రాక్షసి’ చిత్రా నికి ఇద్దరు హీరోలు కావాలి. నవీన్ చంద్ర ఓ హీరోగా ఓకే. రెండో హీరో సెట్ అవడం లేదు. మీకు తెలిసినవారు ఎవరైనా ఉన్నారా? అని పాటల రచయిత లక్ష్మీ భూపాల్‌గారు అహ్మదాబాద్‌లో నాతోపాటు చదువుకున్న ఫ్రెండ్ దీప్తిని అడిగారు. తను నా గురించి చెప్పింది. తెలుగు రాదు అంది. పర్లేదు ఫొటోలు పంపమన్నారు. దీప్తికి పంపా. హను రాఘవపూడిగారు ఆడిషన్స్ చేసి ఓకే చేశారు. ఆ సినిమా నాకు టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి హైదరాబాద్‌లో సెటిల్ అయ్యా. సాయి కొర్రపాటిగారు బాగా ప్రమోషన్ చేశారు. నాకు, నవీన్ చంద్ర, లావణ్యా త్రిపాఠికి మంచి లైఫ్ వచ్చింది. ఆ సినిమా విడుదలై ఆరేళ్లయింది. ∙ డైరెక్షన్ ట్రయల్స్.. హీరో అయినా, ఆ వెంటనే దర్శకుడిగానూ ప్రయత్నాలు మొదలుపెట్టా. నాలుగున్నరేళ్ల క్రితం ఓ హీరోకి ‘చిలసౌ’ కథ చెప్పా. అప్పుడది వర్కవుట్ అవ్వలేదు. ఈలోగా మళ్లీ హీరోగా బిజీ. తర్వాత సుశాంత్‌కి చెప్పా. ఓకే. నచ్చింది అన్నాడు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరీష్‌కి చెప్పాడు. ఆయన నిర్మాతలు భరత్, జశ్వంత్‌లకు చెప్పారు. వారు కథ విని ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. ఇప్పుడు సినిమా విడుదలై ఇంత పెద్ద హిట్ అయిందంటే చాలా హ్యాపీగా ఉంది. ∙ చిన్మయి హ్యాపీ! ‘అందాల రాక్షసి’ టైమ్‌లో పరిచయమైన సింగర్ చిన్మయి కొద్దిరోజుల్లోనే మంచి ఫ్రెండయింది. తను నా లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుందని నేనే ప్రపోజ్ చేశా. తను కొద్దికాలం ఆలోచించి ఓకే చెప్పింది. తను నాకు, నేను తనకు బలం. ‘చి.ల.సౌ.’ రిలీజయ్యాక, నేను నా కలను సాధించినందుకు తను ఎంతో హ్యాపీ! ∙ యాక్టింగ్, డైరెక్షన్ రెండూ చేస్తా! తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టాలెంట్‌ను నిర్మాతలు బాగా ఎంకరేజ్ చేస్తారు. ‘చిలసౌ’ రిలీజ్‌కి ముందే చాలామంది కలిసి సినిమాలు చేయమన్నారు. అయితే రెండో సినిమా అన్నపూర్ణ బ్యానర్లో చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నా. ఇకపై డైరెక్షన్‌కే నా మొదటి ప్రాధాన్యత. మంచి సినిమాలు తీస్తా. అయితే యాక్టింగ్ వదులుకోను. ప్రస్తుతం ‘యూ టర్న్’, ‘దృష్టి’ సినిమాలు చేశా. త్వరలో రిలీజ్ కానున్నాయి. గూఢచారి విడుదల తేదీ: ఆగస్టు 3, 2018 దర్శకుడు: శశికిరణ్ తిక్క నటీనటులు: అడివిశేష్, శోభిత దూళిపాల, మధుశాలిని నిర్మాతలు: అభిషేక్ నామ, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంగీతం: శ్రీచరణ్ పాకాల హీరో అడివి శేష్ ‘క్షణం’ సినిమాతో రెండేళ్ల క్రితం న్యూ వేవ్ సినిమా అంటూ రవికాంత్ పేరు అనే ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేశారు. మళ్లీ రెండేళ్లకు అదే న్యూ వేవ్ అంటూ ‘గూఢచారి’తో మరో కొత్త దర్శకుడు శశికిరణ్ తిక్కను పరిచయం చేశారు. ఆగస్టు 3న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే సూపర్‌హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. రిఫ్రెషింగ్ స్పై థ్రిల్లర్‌గా, లో బడ్జెట్లో తెరకెక్కిన బెస్ట్ విజువల్స్‌తో మెప్పిస్తోన్న ఈ సినిమా గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి శశికిరణ్ మాటల్లో.... ∙ కేరాఫ్ అమలాపురం నేను పుట్టింది అమలాపురంలో. అమ్మానాన్న రాజమండ్రిలో సెటిల్ అయ్యారు. నాన్న గతంలో కొబ్బరి, కన్స్ట్రక్షన్ బిజినెస్‌లు చేసేవారు. ఇప్పుడు రిటైర్ అయ్యారు. అన్నయ్య రాజమండ్రిలో బిజినెస్ చూసుకుంటున్నారు. ∙ 15 మంది నిర్మాతలకు కథ చెప్పా! నాకు మొదట్నుంచీ డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. డైరెక్టర్ కావాలనే అమెరికాలో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్, రైటింగ్‌లో రెండేళ్లపాటు శిక్షణ తీసుకున్నా. ఇండియాకొచ్చి శేఖర్ కమ్ములగారి దగ్గర ‘లీడర్’ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశా. ‘లీడర్’కు పనిచేసిన తర్వాత కొన్ని కథలు రాసుకొని దాదాపు 15మంది నిర్మాతలకి చెప్పా. కొందరు చేద్దామన్నా రకరకాల కారణాల వల్ల కుదర్లేదు. ఓ సినిమా అయితే రేపు లాంచ్ అనగా ఆగిపోయింది. ఈ గ్యాప్‌లో ఫ్రెండ్స్‌కి రైటింగ్ సైడ్ హెల్ప్ చేశా. అడివి శేష్ ‘కర్మ’ సినిమాకి ప్రమోషన్స్ విషయంలో హెల్ప్ చేశా. ∙ ‘గూఢచారి’ అలా పుట్టిందే! ‘కర్మ’ సినిమా అప్పుడే అడివి శేష్‌తో మంచి స్నేహం కుదిరింది. శేష్ రాసిన స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ కథను ఆయనతో కలిసి నేను, రాహుల్ పాకాల (రైటర్) ఎనిమిది నెలలు కష్టపడి పూర్తి స్క్రిప్ట్‌గా రెడీ చేశాం. కథని అబ్బూరి రవిగారికి వినిపించాం. ఆయన సలహాలు మాకు బాగా ఉపయోగపడ్డాయి. ∙ ఇంత పెద్ద సక్సెస్ ఊహించలేదు! ‘గూఢచారి’ హిట్ అవుతుందనుకున్నా. కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందనుకోలేదు. ఈ సినిమా సక్సెస్ కాగానే చాలా మంది నిర్మాతలు అడిగారు. ఇంకా ఎవరి వద్దా అడ్వాన్సులు తీసుకోలేదు. ఎవరితో చేయాలన్నది నిర్ణయించుకోలేదు. నాకు డబ్బు ముఖ్యం కాదు, పని సంతృప్తినివ్వడమే ముఖ్యం. నావల్ల నిర్మాతలు హ్యాపీగా ఉండాలి. అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. ∙ అన్ని జానర్స్ చెయ్యాలి! స్పై థ్రిల్లర్‌తో డెబ్యూట్ ఇచ్చినా నాకు కామెడీ అంటే ఇష్టం. ఫ్యూచర్లో అన్ని జానర్స్‌లో సినిమాలు చేయాలనుంది. నాకిష్టమైన దర్శకుల నుంచి ఇన్స్పైరై ఇంకా బాగా పని చేయాలనుకుంటా. – సాక్షి సినిమా డెస్క్ -
అంజలి మరో యాంగిల్
క్లాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘చి ల సౌ’ మంచి టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ సినిమాతో రుహాని శర్మ హీరోయిన్గా పరిచయం అయ్యారు. అంజలి పాత్రలో తొలి సినిమాతోనే నటిగా ఫుల్ మార్క్స్ సాధించిన ఈ బ్యూటీ ఆడియన్స్‌ను హోమ్లీ లుక్‌లో ఫిదా చేశారు. సినిమా అంతా ఒకే రోజులో జరిగే కథ కావటంతో లుక్ పరంగా రుహానికి వేరియేషన్స్ చూపించే అవకాశం దక్కలేదు. క్యారెక్టర్ పరంగా మిడిల్ క్లాస్ అమ్మాయిగా చుడిదార్‌లో పద్దతిగా కనిపించి ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాతో వచ్చిన ఇమేజ్ నుంచి బయటపడేందుకు రుహాని శర్మ ఓ హాట్ ఫొటో షూట్ చేశారు. తనలో గ్లామర్ యాంగిల్ కూడా ఉందని హింట్ ఇచ్చారు. మరీ ఈ ఫొటోషూట్‌తో రుహాని ఇమేజ్ మారుతుందేమో చూడాలి. -
ఆ పేరు పెట్టినప్పుడే నమ్మకం వచ్చేసింది
‘‘ప్రేక్షకులకు దగ్గర కావడానికి కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బావుంటుందని అనుకున్నా. ‘చి..ల..సౌ’ కథ వినగానే నాకు మరో కొత్త మెట్టు అవుతుందనిపించింది. నా నమ్మకం నిజమైంది. కరెక్ట్ సినిమా చేశావని చాలామంది అభినందిస్తుంటే సంతోషంగా ఉంది’’ అని హీరో సుశాంత్ అన్నారు. సుశాంత్, రుహానీ శర్మ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చి..ల..సౌ’. అక్కినేని నాగార్జున, భరత్ కుమార్, జస్వంత్ నడిపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో సుశాంత్ మాట్లాడుతూ– ‘‘చి..ల..సౌ’ చిత్రానికి నాకు అభినందనలు వచ్చాయంటే ఆ క్రెడిట్ రాహుల్‌కే దక్కుతుంది. బయటి బ్యానర్లో సినిమా చేద్దామని అనుకున్నప్పుడు నాతో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన సిరుని సినీ క్రియేషన్స్ వారికి థ్యాంక్స్. సమంత, చైతన్యకు సినిమా నచ్చడం, సినిమాలో భాగమవుతానని చైతన్య చెప్పడం హ్యాపీగా అనిపించింది. నిర్మాతగా నాగార్జునగారి పేరు కూడా పెట్టినప్పుడే సినిమాపై నమ్మకం వచ్చేసింది’’ అన్నారు. ‘‘ప్రీమియర్ షో నుంచి సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. టాక్ వచ్చినంతగా ప్రేక్షకులు థియేటర్‌కి రావడం లేదేమో అనిపించేది. ఈ సినిమా స్లోగా ఎక్కుతుందని నాగార్జునగారు అన్నారు. ఆయన అన్నట్లుగానే ఫస్ట్ డేతో పోల్చితే తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువయ్యాయి’’ అన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘సినిమా చేసేటప్పుడు రిస్క్ చేస్తున్నానని చాలామంది అన్నారు. కానీ ‘చి..ల..సౌ’ రిలీజ్ తర్వాత ఫోన్ చేసి అభినందిస్తున్నారు. సుశాంత్‌కు ఒక వే క్రియేట్ అయింది’’ అన్నారు నిర్మాత జస్వంత్. -
‘చి.ల.సౌ.’ మూవీ రివ్యూ
టైటిల్ : చి.ల.సౌ. జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిశోర్, రోహిణి, అను హసన్, సంజయ్ స్వరూప్ సంగీతం : ప్రశాంత్ విహారి దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్ నిర్మాత : అక్కినేని నాగార్జున, జస్వంత్ నాడిపల్లి, భరత్ కుమార్ అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్ తరువాత నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని వారసుడు సుశాంత్ హీరోగా ‘చి.ల.సౌ.’ సినిమాను తెరకెక్కించాడు రాహుల్. సెన్సిబుల్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా నచ్చటంతో అన్నపూర్ణ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున ఈ సినిమాను రిలీజ్ చేశారు. నాగ్‌ను అంతగా మెప్పించిన అంశాలు చి.ల.సౌ.లో ఏమున్నాయి..? ఈ సినిమాతో సుశాంత్ హిట్ ట్రాక్‌లోకి వచ్చాడా..? దర్శకుడిగా తొలి ప్రయత్నంలో రాహుల్ రవీంద్రన్ సక్సెస్ అయ్యాడా..? కథ ; ఐదేళ్ల వరకు పెళ్లే వద్దని పట్టుపట్టి కూర్చున్న అర్జున్ (సుశాంత్)ని ఎలాగైన పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నిస్తుంటారు అమ్మానాన్నలు (అను హసన్, సంజయ్ స్వరూప్). ఇంట్లో పోరు సరిపోలేదన్నట్టుగా తన బెస్ట్ ఫ్రెండ్ సుజిత్ (వెన్నెల కిశోర్) కూడా అర్జున్ను పెళ్లి చేసుకోమని బలవంతపెడుతుంటాడు. వీళ్ల పోరు పడలేక ఓ అమ్మాయితో పెళ్లిచూపులుకు ఒప్పుకుంటాడు అర్జున్. రొటీన్ పెళ్లి చూపులు లా కాకుండా కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసిన పేరెంట్స్.. (సాక్షి రివ్యూస్) అర్జున్ను ఒక్కడినే ఇంట్లో ఉంచి అమ్మాయి వస్తుంది మాట్లాడమని చెప్తారు. అంజలి (రుహాని శర్మ) ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి. చిన్నతనంలోనే తండ్రి చనిపోవటంతో కుటుంబానికి తానే పెద్ద దిక్కు అవుతుంది. అంజలిని చూసిన అర్జున్ పెళ్లికి ఒప్పుకున్నాడా..? లేక తన మాట ప్రకారం ఐదేళ్ల వరకు పెళ్లి వాయిదా వేశాడా..? అసలు వాళ్ల పెళ్లి చూపులు ఎలా జరిగింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; చెప్పుకోవటానికి చాలా మంది నటులు ఉన్న హీరో హీరోయిన్లు తప్ప మిగత అన్ని పాత్రలు దాదాపు అతిథి పాత్రలే. సినిమా అంతా అర్జున్, అంజలిల చుట్టూనే తిరుగుతుంది. అర్జున్ పాత్రలో సుశాంత్ సహజంగా నటించాడు. గత చిత్రాలతో పోలిస్తే మంచి పరిణతి కనబరిచాడు. కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ప్రేమకథ కావటంతో డ్యాన్స్‌లు, ఫైట్లు చేసే ఛాన్స్ రాలేదు. నటన పరంగా మాత్రం ఫుల్ మార్క్ సాధించాడు సుశాంత్. హీరోయిన్ గా పరిచయం అయిన రుహాని శర్మ తొలి సినిమాతోనే సూపర్బ్ అనిపించింది. (సాక్షి రివ్యూస్) అర్జున్ మీద ఇష్టమున్నా కుటుంబ బాధ్యతల కారణంగా అవుననలేక, కాదనలేక మదన పడే పాత్రలో మంచి నటన కనబరిచింది. అందం, అభినయం రెండింటితోనూ మెప్పించింది. వెన్నెల కిశోర్ తన మార్క్ కామెడీ డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్‌తో నవ్వించాడు. హీరోయిన్ తల్లిగా రోహిణి, హీరో తల్లి దండ్రులుగా అను హసన్, సంజయ్ స్వరూప్, ఇతర పాత్రల్లో విద్యుల్లేఖ రామన్, జయప్రకాష్ తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ఓ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాహుల్ రవీంద్రన్. రొటీన్ ప్రేమకథలకు భిన్నంగా పెళ్లిచూపులతో మొదలయ్యే ప్రేమకథతో ఆకట్టుకున్నాడు. దర్శకుడిగానే కాదు రచయితగానూ మంచి మార్కులు సాధించాడు. టేకింగ్‌లోనూ కొత్త దనం చూపించాడు. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక్క పూటలో జరిగే సంఘటనలు నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు, కథనాన్ని కాస్త నెమ్మదిగా నడిపించాడు. (సాక్షి రివ్యూస్)ఫస్ట్ హాఫ్‌లో వెన్నెల కిశోర్, సుశాంత్‌ల కాంబినేషన్లో వచ్చే కొన్ని సీన్స్ బోరింగ్‌గా అనిపిస్తాయి. పెళ్లిచూపులు సీన్ మొదలైన తరువాత కథనం ఇంట్రస్టింగ్ మారుతుంది. సినిమాకు సినిమాటోగ్రఫి మరో ప్రధాన బలం. షూటింగ్ పెద్దగా లోకేషన్లు లేకపోయినా ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం కొత్త అనుభూతి కలిగిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథా కథనం లీడ్ యాక్టర్స్ నటన కామెడీ మైనస్ పాయింట్స్ : ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్‌లో కొన్ని బోరింగ్ సీన్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
వాళ్లకు మళ్లీ టైమ్ వచ్చింది
‘‘సుశాంత్ హీరో అని ‘చి..ల..సౌ’ చిత్రంలో నేను భాగస్వామ్యం కాలేదు. సినిమా చూశా. నచ్చింది. సింపుల్ పాయింటే అయినా కట్టిపడేసేలా తెరకెక్కించారు. ఆర్టిస్ట్‌ల నటన, స్క్రీన్‌ప్లే, రైటింగ్ అన్నీ పక్కాగా కుదిరాయి’’ అని నాగార్జున అన్నారు. సుశాంత్, రుహానీ శర్మ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్, సిరుని సినీ కార్పొరేషన్ బ్యానర్స్‌పై రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చి..ల..సౌ’. నాగార్జున, జస్వంత్ నడిపల్లి, భరత్‌కుమార్ మలశాల, హరి పులిజ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. ► నాగచైతన్య ‘చి..ల..సౌ’ చూసి, బాగుందని నన్నూ చూడమంటే ఇంట్రెస్ట్ లేదు అన్నా. ఎందుకంటే.. డైరెక్టర్ రాహుల్, నిర్మాతలు, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్.. అంతా కొత్తవారే. పైగా కథ తెలీదు. అందుకే నెగటివ్ మైండ్‌తో వెళ్లా. సినిమా స్టార్ట్ అయిన ఐదు నిమిషాలకే నెగటివ్ మైండ్ పోయింది. సినిమా చూశాక నాకు నేనే ఫ్రెష్‌గా అనిపించా. ► సినిమా చూశాక రాహుల్‌తో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం అన్నాను. తను హ్యాపీగా ఫీలయ్యాడు. మా బ్యానర్లో ‘చి..ల..సౌ’ విడుదల చేయడం గర్వంగా ఉంది. ► అందరూ కొత్తవాళ్లతో సినిమా చేయడం రిస్కే. నిర్మాతలు మంచి ఆకలితో ఈ సినిమా చేశారు. ఈ మధ్య ఫ్రెష్ సబ్జెక్ట్స్ బాగా ఆడుతున్నాయి. స్టోరీ రైటర్స్, డైలాగ్ రైటర్స్‌కి మళ్లీ టైమ్ వచ్చింది. ‘మహానటి, రంగస్థలం’ సినిమాల్లో నటన పక్కన పెడితే మంచి రైటింగ్ కనపడింది. ఈ మధ్య హిందీలో ‘రాజీ’ చూశాను. చాలా బాగుంది. ► సుశాంత్, రుహాని నటన సూపర్బ్. నా కోసం ఓ కథ రెడీ చేయమని రాహుల్‌కి చెప్పా. ‘చి..ల..సౌ’ రిజల్ట్ ఎలా ఉన్నా తన తర్వాతి సినిమా మా బ్యానర్లోనే ఉంటుంది. బ్యాకింగ్ లేక మంచి సినిమాలు చాలా వరకూ ఆగిపోతున్నాయి. అలాంటి సినిమాలకు అన్నపూర్ణలో బ్యాకింగ్ ఇవ్వనున్నాం. ► నేను బాలీవుడ్‌కి వెళ్లలేదు. వాళ్లే నా దగ్గరకు వచ్చారు (నవ్వుతూ). అయాన్ ముఖర్జీ, కరణ్ జోహార్ వచ్చి అడిగితే ‘బ్రహ్మాస్త్ర’ చేశా. తమిళంలో మంచి అవకాశం వచ్చిందని ‘ఊపిరి’ చేశా. మరో సినిమా చేయబోతున్నా. మంచి అవకాశాలొచ్చినప్పుడు ఇతర భాషల్లో నటిస్తాను. తెలుగు ప్రేక్షకులను వదిలి వెళ్లను. ఇటీవల ‘ఆర్ఎక్స్ 100’ సినిమా క్లైమాక్స్ రెండు రీల్స్ చూశా. బాగుంది. పూర్తిగా చూడాలనుకుంటున్నా. ► ‘దేవదాస్’ పది రోజులు మినహా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా హిట్ అయితే సీక్వెల్ చేస్తాం. ‘బంగార్రాజు’ కథ రెడీ అవుతోంది. -
ఆ మాట విని సర్ప్రైజ్ అయ్యా
‘‘నిన్ను, నన్ను కలిసి రాహుల్ ఓ కథ చెబుతాడట అని సమంత నాతో చెప్పగానే.. రాహుల్ నటించబోయే సినిమా అనుకున్నా. కానీ, తను దర్శకత్వం చేస్తున్నాడని తెలిసి సర్ప్రైజ్ అయ్యా. కథ చాలా ఫ్రెష్‌గా అనిపించింది’’ అని నాగచైతన్య అన్నారు. సుశాంత్, రుహానీ శర్మ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చి..ల.. సౌ’. నాగార్జున, జస్వంత్ నడిపల్లి, భరత్‌కుమార్ మలశాల, హరి పులిజ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రెస్మీట్లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఓ రాత్రిలో జరిగే కథ ఇది. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా? అనే సందేహం ఉండేది. నీవి, రాహుల్ సెన్సిబిలిటీస్ ఒకేలా ఉంటాయి. నువ్వు తనతో ఓ సినిమా చేయాలని సమంత అంది. ఎలాగైనా ‘చి..ల..సౌ’ లో భాగం అయితే బావుండు అనిపించి నాన్నగారితో (నాగార్జున) చెప్పా. ఆయనకూ సినిమా నచ్చి, భాగస్వామ్యం అయ్యారు. ఇక వ్యక్తిగత విషయానికొస్తే... సమంత కోసం ఏడేళ్లు ట్రై చేశా. నా సిన్సియారిటీ, నా కష్టం చూసి తను ఆ తర్వాత ఓకే చెప్పారు (నవ్వుతూ). నాకు పెళ్లి కావడంతో రానా, సుశాంత్ హ్యాపీగా ఉన్నారు.. ఎందుకంటే పెళ్లి చేసుకోమని కొద్దిరోజులైనా వాళ్లని నేను వేధించకుండా ఉంటానని (నవ్వుతూ)’’ అన్నారు. ‘‘నేను, రాహుల్ కలసి చేసిన సినిమా సరిగ్గా ఆడలేదు కానీ, 11ఏళ్లుగా మేం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. రాహుల్ హార్డ్‌వర్కర్. ‘చి..ల.. సౌ’ సినిమా చూస్తున్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. రాహుల్ యాక్టర్‌గా నాకు కనెక్ట్ కాలేదు కానీ.. డైరెక్టర్‌గా కనెక్ట్ అయ్యాడు. రుహానీ శర్మ ఫైర్ క్రాకర్‌గా పేరు తెచ్చుకుంటుంది’’ అన్నారు సమంత. ‘‘పెళ్లిచూపులప్పుడు అమ్మాయి, అబ్బాయి.. ఒకరికొకరు కరెక్టా? కాదా? అని అరగంటలో ఎలా నిర్ణయించుకుంటారు. దానికి ఎంత సమయం పడుతుంది? అనే కాన్సెప్ట్‌తో సాగే చిత్రమిది’’ అన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘చి..ల..సౌ’ లాంటి కథతో సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు సుశాంత్. ‘‘డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకొచ్చి, నిర్మాతనయ్యా. మంచి సినిమా చేశాం’’ అన్నారు నిర్మాత జస్వంత్ కుమార్. కథానాయిక రుహానీ శర్మ, గాయని, రాహుల్ రవీంద్రన్ సతీమణి చిన్మయి పాల్గొన్నారు. -
‘చి ల సౌ’ ప్రెస్‌మీట్
-
అందుకే హోమ్ బ్యానర్లో చేయలేదు
‘‘వరుసగా ఫార్ములా సినిమాలు చేయడం విసుగు తెప్పించింది. నాకు సరిపోయే క్యూట్ లవ్‌స్టోరీ చేయాలని ఫిక్స్ అయిన టైమ్‌లో రాహుల్ ఈ కథతో నా దగ్గరకు వచ్చారు. స్టోరీ బాగా నచ్చడంతో వెంటనే అంగీకరించాను’’ అన్నారు సుశాంత్. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్, రుహానీ శర్మ జంటగా రూపొందిన చిత్రం ‘చి ల సౌ’. సిరుని సినీ కార్పొరేషన్ బ్యానర్‌పై జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాలి, హరి పులిజల నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుశాంత్ పంచుకున్న విశేషాలు. ► రిస్క్ తీసుకోవాలనే ఆలోచనతో హోమ్ బ్యానర్లో వర్క్ చేయకూడదు అనుకున్నాను. రాహుల్ కూడా నేను ప్రొడ్యూస్ చేస్తానని నాతో ఈ సినిమా చేయలేదు. సినిమా మొత్తం అయిపోయాక చూసిన నాగచైతన్య, సమంత అన్నపూర్ణ బ్యానర్ నుంచి రిలీజ్ చేయడానికి రెడీ అయి, మా ప్రొడ్యూసర్స్‌ని అడిగారు. వాళ్లు వెంటనే ఒప్పుకున్నారు. ► సినిమా చూశాక నాగ్ (నాగార్జున) మామ మా అమ్మగారితో చాలాసేపు మాట్లాడారు. ‘మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాడు, ఇలానే చేసుకుంటూ వెళ్తే కెరీర్ బావుంటుంది’ అన్నారట. ఆయన అలా అనడం పెద్ద సర్టిఫికెట్లా భావిస్తాను. మామ నుంచి అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అదే అని ఫీల్ అవుతాను. ► నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. బయట ఎలా ఉంటానో సినిమాలో కూడా అలానే కనిపిస్తాను. దాని కోసం వర్క్ షాప్ కూడా చేశాం. సహజంగా ఉండటం కోసం మేకప్ కూడా వాడలేదు. ► రాహుల్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయకపోయినా హీరోగా చాలా గమనించే ఉంటారు. స్టోరీ కూడా చాలా బాగా నరేట్ చేశారు. ముందుగా ఈ సినిమాకు ‘చిరంజీవి అర్జున్’ అనుకున్నాం కానీ ‘అర్జున్ రెడ్డి’ సూపర్ హిట్ అయింది. దాంతో ‘చి ల సౌ’ అని మార్చాం. ► ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. నెక్ట్స్ ఓ ఫన్ థ్రిల్లర్ జానర్లో సినిమా ఓకే చేశాను. -
ఆ కాంప్లిమెంట్ నాకు ఆస్కార్‌తో సమానం
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిందే డైరెక్టర్ అవుదాం అని. కానీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరదాం అంటే ఒక్క డైరెక్టర్ అపాయింట్మెంట్ కూడా కుదర్లేదు. సడన్‌గా ఆడిషన్స్‌కి పిలిచారు. అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా ఆడిషన్ చేస్తారేమో అనుకున్నాను. కట్ చేస్తే ఈ సినిమాలో హీరో నువ్వే అన్నారు. కొన్ని డబ్బులు వస్తాయి, సినిమా కూడా నేర్చుకోవచ్చు అని కంటిన్యూ అయిపోయాను’’ అని రాహుల్ రవీంద్రన్ అన్నారు. సుశాంత్, రుహాని శర్మ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘చి ల సౌ’. సిరుని సినీ కార్పరేషన్ పతాకంపై జశ్వంత్ నడిపల్లి నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఆగస్ట్ 3న అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పలు విశేషాలను రాహుల్ పంచుకున్నారు. ► నాలుగేళ్ల క్రితం ఇంక డైరెక్టర్‌గా సినిమా స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను. అప్పుడు కుదర్లేదు. ఈ లోపు కొన్ని సినిమాలు సైన్ చేసి హీరోగా బిజీ అయిపోయా. చైతన్య–సమంత వెడ్డింగ్ అప్పుడు సుశాంత్‌ని కలిశాను. ఆ తర్వాత ఓ రోజు ఫొన్ చేసి కథ వినాలి బ్రో అంటే ‘మల్టీస్టారర్ సినిమా చేస్తున్నామా?’ అన్నాడు సుశాంత్. కాదు నేనే డైరెక్టర్ అని చెప్పాను. నా దగ్గర ఉన్న రెండు కథలు చెప్పా, సుశాంత్ లవ్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాడు. ► డైరెక్షన్ చేస్తున్నాను అని ఇండస్ట్రీలో ఎవ్వరికీ చెప్పలేదు. కేవలం నా క్లోజ్ ఫ్రెండ్స్‌కి తప్పా. ఒకవేళ డైరెక్షన్లో అనుకున్నట్టు జరగకపోతే యాక్టింగ్ కెరీర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆలోచించుకో అని ‘వెన్నెల’ కిశోర్ చెప్పాడు. అలాగే ఈ సినిమా టైటిల్‌ను కూడా ‘వెన్నెల’ కిశోర్ చెప్పాడు. ► 24 గంటల్లో జరిగే కథ ఈ సినిమా. 27 ఏళ్ల అబ్బాయి, 24 ఏళ్ల అమ్మాయి ఇద్దరూ పెళ్లి ముందు జర్నీ స్టోరీ లైన్. ఈ జనరేషన్లో అందరూ ఇండివిండ్యువాలిటీ కోరుకుంటున్నారు. మనకు కాబోయే పార్టనర్ వీళ్లే అని ఎలా తెలుసుకోగలం? అనే పాయింట్ చుట్టూ కథ ఉంటుంది. సుశాంత్ బయట ఎలా ఉంటాడో సినిమాలోనూ అలానే చూపించాం. అసలు మేకప్ వాడలేదు. ► డైరెక్టర్ అవుతున్నానంటే నాకంటే సమంత బాగా టెన్షన్ పడిపోయింది. తనకే ఫస్ట్ సినిమా చూపించాను. తనకీ, చైతన్యకి సినిమా నచ్చింది. ‘నాన్నని కూడా చూడమని చెబుతాను’ అని చైతన్య అంటే అర్థం కాలేదు. ఆ తర్వాత నాగ్‌సార్ కూడా చూసి చాలా ఎంజాయ్ చేసి, రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. సినిమా చూసి వెళ్లిపోయేప్పుడు ‘నీకు మంచి ఫ్యూచర్ ఉంది నాన్న’’ అన్నారు. ఆ కాంప్లిమెంట్ నాకు ఆస్కార్ సాధించినట్టు అనిపించింది. ► హీరోయిన్ పాత్రకు నా భార్య చిన్మయి డబ్బింగ్ చెప్పింది. తనకు సినిమా బాగా నచ్చింది. మా పెళ్లి కాకముందే ఈ కథ రాసుకున్నాను. మా పర్సనల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలు ఏమీ లేవు. ► మ్యూజిక్ ప్రశాంత్ విహారి, కెమెర సుకుమారన్ సార్ నెక్ట్స్ లెవెల్‌కి తీసుకువెళ్లారు. ప్రొడ్యూసర్ బాగా సపోర్ట్ చేశారు. ► ఆగస్ట్ 3న నా సినిమా శేష్ ‘గూఢచారి’ రిలీజ్ అవుతున్నాయి. ‘నా సినిమాని నువ్వు, నీ సినిమాను నేను ప్రమోట్ చేసుకుందాం’ అని శేష్‌తో అన్నా. నెక్ట్స్ సినిమా కూడా అన్నపూర్ణ బ్యానర్లోనే. హీరోగా ‘దృష్టి’, ‘యు టర్న్’ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. -
నాని సినిమాలు చూసి తెలుగు నేర్చుకున్నా
‘‘పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన తర్వాత మోడలింగ్ చేశా. కొన్ని యాడ్ ఫిల్మ్స్ కూడా చేశా. ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫొటోలు చూసిన నిర్మాతలు ‘చి.ల.సౌ’లో హీరోయిన్ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. నేను అప్పటి వరకూ చేసిన యాడ్స్ చూపించాను. ఆడిషన్స్ చేసి, నన్ను ఎంపిక చేశారు’’ అని కథానాయిక రుహానీ శర్మ అన్నారు. సుశాంత్, రుహానీ శర్మ జంటగా హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి, తెరకెక్కించిన చిత్రం ‘చి.ల.సౌ’. సిరునీ సినీ కార్పొరేషన్ పతాకంపై జశ్వంత్ నడిపల్లి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రుహానీ శర్మ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటరై్టనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. చాలా సంప్రదాయబద్ధంగా, స్వతంత్ర భావాలున్న అమ్మాయిగా నా పాత్ర ఉంటుంది. యాక్టింగ్‌కి చాలా స్కోప్ ఉంది. నాకు తెలుగు రాకపోవడంతో మొదట్లో కష్టంగా అనిపించింది. తెలుగు నేర్చుకోవటానికి హార్డ్ వర్క్ చేశా. తెలుగు లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవటానికి హీరో నాని సినిమాలు చూశా. ప్రస్తుతం నా తెలుగు చాలా బెటర్ అయిందనుకుంటున్నా. సుశాంత్‌తో నటించడం సౌకర్యంగా ఉండేది. షూటింగ్ సమయంలో తను ఇచ్చిన సపోర్ట్ మరవలేనిది. మా నుంచి సరైన నటన రాబట్టుకోవడానికి రాహుల్ రవీంద్రన్ హార్డ్ వర్క్ చేశారు. పైగా రాహుల్ నటుడు కావడం వల్ల ఆయన సలహాలు మాకు ఉపయోగపడ్డాయి’’ అన్నారు. -
ప్రతి ఒక్కడికీ కత్రినాకైఫ్ కావాలి.. కానీ!
హైదరాబాద్ : ‘ప్రతి ఒక్కడికీ కత్రినా కైఫ్ కావాలి.. కానీ ఎవ్వడూ రణ్‌బీర్‌లా ఉండడు’ అంటూ టాలీవుడ్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ పోస్ట్ చేశారు. అదేంటీ రకుల్‌ను ఎవరైనా హర్ట్ చేశారా అనుకుంటున్నారా. అదేం లేదండీ.. విడుదలకు సిద్ధంగా ఉన్న ‘చి ల సౌ’ మూవీ ప్రమోషన్లో భాగంగా నటి రకుల్ ఓ డైలాగ్‌ను డబ్స్మాష్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రకుల్ పోస్ట్ చేసిన ఆ డబ్స్మాష్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిలీజ్‌కు ముందే మూవీ చూడాలని ఉందా! హృద్యమైన ప్రేమకథా నేపథ్యంతో తెరకెక్కిన ‘చి ల సౌ’ సినిమాను జూలై 27న అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ద్వారా విడుదల చేయనున్నారు. ‘ఇక్కడ నా ఫెవరెట్ డైలాగ్ ఉంది. అమ్మాయిలు ఏమంటారు. మీరు విడుదలకు ముందే ఆ చిత్రాన్ని చూడాలనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ డబ్స్మాష్ వీడియోలను FunWithChiLaSow హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేయండి. మూవీ యూనిట్‌తో కలిసి సినిమా చూసే చాన్స్ రావచ్చు’ అంటూ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రకుల్ చేసిన పోస్టుకు భారీగా స్పందన వస్తోంది. అయితే కొందరు మాత్రం రకుల్ మీరు గతంలోలాగ చబ్బీగా లేరు.. డైటింగ్ తగ్గించి మళ్లీ బొద్దుగా తయారవ్వాలంటూ కామెంట్లు చేస్తున్నారు. సుశాంత్ కథానాయకుడిగా సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై జస్వంత్ నడిపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘చి ల సౌ’.. ఈ మూవీ ద్వారా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుశాంత్‌కు జోడీగా రుహాని శర్మ కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమా విజయంపై మూవీ యూనిట్ ధీమాగా ఉంది. Here’s a dubsmash of my current fav dialogue. Totally love it ! 😂❤️ what say girls ?? cant wait to watch #ChiLaSow...If you wanna watch the the film before release with the team.. send your dubsmashes with #FunWithChiLaSow and you could win a chance:) @AnnapurnaStdios @SiruniCineCorp @iamSushanthA @iRuhaniSharma @rahulr_23 @23_rahulr A post shared by Rakul Singh (@rakulpreet) on Jul 18, 2018 at 2:11am PDT -
వరుసగా రెండు సినిమాల్లో చై - సామ్
అక్కినేని కోడలు సమంత పెళ్లి తరువాత కూడా అదే జోరు కొనసాగిస్తున్నారు. వరుస సినిమాతో నటిగా బిజీ అవుతున్నారు. ఇప్పటికే యు టర్న్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన సమంత, మరో రెండు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలో నాగచైతన్యతో కలిసి ఓ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో చై -సామ్ జంటగా నటించనున్నారు. ఈ సినిమాతో పాటు మరో సినిమాలోనూ ఈ జంట కనువిందు చేయనుందట. రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘చి ల సౌ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న రాహుల్ రవీంద్రన్ తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించాడు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఉంటుందని ప్రకటించిన రాహుల్.. నాగచైతన్య, సమంత కాంబినేషన్లో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
సమంత చేతుల మీదుగా ‘చిలసౌ’..?
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుశాంత్. కాళిదాసు సినిమాతో వెండితెరకు పరిచయమై సక్సెస్ సాధించారు. ఆ తరువాత ఆయన కెరీర్లో ‘కరెంట్’ సినిమా మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏ మూవీ విజయం సాధించలేదు. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సుశాంత్‌కు చిలసౌ సినిమాతో విజయం వరించబోతున్నట్లే కనిపిస్తోంది. ఆ మధ్య విడుదల చేసిన టీజర్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి మూవీపై హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీపై మరింత బజ్ క్రియేట్ చేసేందుకు జూలై 11న సాయంత్రం ఆరు గంటలకు పెళ్లి కూతురు (రుహాని శర్మ)కు సంబంధించిన టీజర్‌ను సమంత విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జూలై 27న విడుదల కానుంది. -
‘చి ల సౌ’ రిలీజ్ డేట్ ఫిక్స్
సుశాంత్ హీరోగా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘చి ల సౌ’.. హృద్యమైన ప్రేమకథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాను జూలై 27న అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాతో రుహానీ శర్మ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమా విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు హీరో సుశాంత్ తెలిపారు. -
బిగ్ బ్యానర్లో సెకండ్ ఛాన్స్
అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయిన యువ నటుడు రాహుల్ రవీంద్రన్. తొలి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ తరువాత ఆ ఫాంను కొనసాగించలేకపోయాడు. ఒకటి రెండు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిలసౌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు రాహుల్. ఈ సినిమా సెట్స్‌మీద ఉండగానే మరో సినిమాకు ఓకె చెప్పాడు. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ప్రస్టీజియస్ బ్యానర్లో దర్శకుడిగా తన రెండో సినిమా తెరకెక్కనుందట వెల్లడించారు రాహుల్. నటీనటులు సాంకేతిక నిపుణులను ఫైనల్ చేయాల్సి ఉందని తెలిపారు. Here’s the other news am soooper happy to share with you all:) I have signed with @AnnapurnaStdios for my second directorial:) Will be an absolute honour and I will work hard to make it count:) Cast and other details yet to be finalised. — Rahul Ravindran (@23_rahulr) 6 July 2018 -
కమింగ్ సూన్
సుశాంత్ హీరోగా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘చి ల సౌ’. ఈ సినిమాతో రుహానీ శర్మ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘‘రీసెంట్గా రిలీజైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. సుశాంత్, రుహానీ బాగా నటించారు. ప్రశాంత్ విహారి సంగీతం శ్రోతలను ఆకట్టుకుంటుంది. సినిమా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. వెన్నెల కిశోర్, జయప్రకాశ్, సంజయ్ స్వరూప్, రోహిణి, అనూ హాసన్, రాహుల్ రామకృష్ణ, విద్యుల్లేఖా రామన్ తదితరులు నటించిన ఈ సినిమాకు ఎం. సుకుమార్ ఛాయాగ్రాహకుడు. ఈ చిత్రానికి హరీష్ కోయాలగుండ్ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సంగతి ఇలా ఉంచితే నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్న రెండో సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపైనే తెరకెక్కనుంది. ఈ విషయాన్ని రాహుల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. -
సుశాంత్‌కు రానా సహాయం!
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుశాంత్. కరెంట్ సినిమాతో విజయాన్ని సాధించినా, ఈ మధ్యకాలంలో సరైన హిట్ రాలేదు. సుశాంత్ చివరగా ‘ఆటాడుకుందాం రా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అది కూడా నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం సుశాంత్, రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో చి.ల.సౌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పొస్టర్‌ను ఈ మధ్యే రిలీజ్ చేశారు. మే 7న టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. రానా దగ్గుబాటి ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. హీరోగా ఉన్న రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తీస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. -
వరుడు అర్జున్.. వధువు?
సుశాంత్ కథానాయకుడిగా సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై జస్వంత్ నడిపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘చి‘‘ ల‘‘ సౌ’. ఈ చిత్రం ద్వారా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రుహాని శర్మ కథానాయిక. ఇవాళ సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా ‘వరుడి పేరు అర్జున్.. మరి వధువు పేరేంటి?’ అంటూ ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘సుశాంత్ హీరోగా చేస్తున్న ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. దర్శకుడు రాహుల్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నాం. మే 11న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ సినిమాకు కెమెరా: యం.సుకుమార్, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారీ. -
హౌరా బ్రిడ్జ్ వచ్చేస్తోంది....
హౌరా బ్రిడ్జ్ రావడమేంటీ...? మనమే దాని దగ్గరకు వెళ్లి చూడాలి కదా అని అనుకుంటున్నారా? అలాంటిదేమీ లేదండీ. అందాల రాక్షసి ఫేమ్ రాహుల్ రవీంద్రన్ నటిస్తున్న ‘హౌరాబ్రిడ్జ్’ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. హౌరాబ్రిడ్జ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇద్దరు ప్రేమికులను ఈ హౌరాబ్రిడ్జ్ కలుపుతుందేమో? అందుకే ఈ సినిమాకు ‘కనెక్టింగ్ లవ్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. ఈ సినిమాలో రాహుల్ సరసన చాందిని, మనాలీ రాథోడ్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. రాహుల్ ప్రస్తుతం దృష్టి, శోభన్‌బాబు, హౌరాబ్రిడ్జ్ సినిమాలలో నటుడిగా బిజీగా ఉన్నారు. హౌరాబ్రిడ్జ్ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు రేవన్ యాదు(బూచమ్మ బూచోడు ఫేం) దర్శకత్వం వహిస్తున్నారు. జనవరిలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్దమైనట్లు సమాచారం.త్వరలోనే చిత్రయూనిట్ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించనుంది.సుశాంత్ హీరోగా రాహుల్ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ‘చి ల సౌ’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. -
ఈ సినిమా నాకు న్యూ చాప్టర్ – సుశాంత్
నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి, సుశాంత్ హీరోగా తెరకెక్కించనున్న ‘చి ల సౌ’ సినిమా బుధవారం మొదలైంది. తేజ్వీర్ నాయుడు సమర్పణలో సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై భరత్‌కుమార్ మలసాల, హరి పులిజల, జస్వంత్ నాడిపల్లి నిర్మిస్తున్నారు. రుహానీ శర్మ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి మలసాల దానమ్మ కెమెరా స్విచాన్ చేయగా, ఎమ్మెల్యే పీల గోవింద్ సత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా హీరో సుశాంత్ మాట్లాడుతూ– ‘‘నాకీ చిత్రం న్యూ చాప్టర్ వంటిది. స్వీట్ అండ్ ప్లేజెంట్ లవ్‌స్టోరీ మూవీ. నా మిగతా సినిమాలకంటే డిఫరెంట్‌గా ఉంటుంది’’ అన్నారు. రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ– ‘‘యాక్టర్‌గా నటనను ఎంజాయ్ చేశాను. అయితే డైరెక్టర్ కావాలన్న నా చిన్ననాటి కల ఇప్పటికి నేరవేరింది. డైరెక్టర్‌గా సక్సెస్ అయితే మరిన్ని చిత్రాలను తెరకెక్కించవచ్చు. అయితే నటుడిగా కొనసాగుతాను. ఈ సినిమాలో కొత్త సుశాంత్‌ను చూస్తారు. రెగ్యులర్ షూట్‌ను నవంబర్‌లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘కొత్తరకం లవ్‌స్టోరీతో ఈ సినిమా తీస్తున్నాం. హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు భరత్. ‘‘హిందూ సంప్రదాయం జోడించి మంచి టైటిల్ పెట్టారు. సినిమా సూపర్‌హిట్ అవ్వాలి. హీరోగా సుశాంత్‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు గోవింద్ సత్యానారాయణ. ‘‘తెలుగులో నాకిది మొదటి సినిమా’’ అన్నారు రుహానీ శర్మ. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరీశ్, కెమెరామేన్ ఎమ్. సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'చిll లll సౌll' సినిమా ప్రారంభం