చో రామస్వామికి అస్వస్థత
చెన్నై: ప్రముఖ తమిళ సినీ నటుడు, తుగ్లక్ పత్రిక వ్యవస్థాపకుడు చో రామస్వామి(80) ఆస్పత్రిపాలయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనను బుధవారం అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ధియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత పలు సినిమాల్లో నటించారు. 'మహ్మద్ బీన్ తుగ్లక్' నాటకంతో గుర్తింపు పొందారు. తుగ్లక్ పత్రిక స్థాపించి వ్యంగ్యస్త్రాలు సంధించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సలహాదారుగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. ప్రముఖ నటి రమ్యకృష్ణకు ఆయన స్వయాన మేనమామ.