తమిళనాడులో 27 వేల కోట్లతో పోర్ట్
న్యూఢిల్లీ: తమిళనాడులోని కోలాచెల్ సమీపంలో రూ.27,570 కోట్లతో డీప్ సీ పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పోర్టు అభివృద్ధితో తూర్పు-పశ్చిమ నౌకా మార్గం మరింత చేరువవుతుందని కేంద్ర నౌకాయాన సహాయ మంత్రి రాధాకృష్ణన్ గురువారం ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేసే ఈ పోర్టు 2030 లోగా పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. సాగరమాల దీర్ఘకాల ప్రాజెక్టుని, కోటి మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.