to collector
-
మేడమ్ కంగ్రాట్స్
ముకరంపుర: జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లను శరవేగంగా నిర్మించి ప్రశంసతులు అందుకున్న కలెక్టర్ నీతూప్రసాద్‌ను శుక్రవారం పలువురు అభినందనలతో ముంచెత్తారు. నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ఎస్పీ జోయెల్ డేవిస్‌తో పాటు జిల్లా అధికారులు సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శాలువా బొకేలతో ఘనంగా సన్మానించారు. మేయర్ మొక్కను అందించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లను వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారని, అక్షరాస్యత పెంపునకు కృషిచేశారని స్వచ్ఛభారత్ బహుమతి జిల్లా అధికారులందరిదని అన్నారు. కార్యక్రమంలో జేసీ శ్రీ దేవసేన, ఏజేసీ నాగేంద్ర, డీఆర్వో వీరబ్రహ్మయ్య, అడిషనల్ ఎస్పీ అన్నపూర్ణ, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, హౌసింగ్ పీడీ నర్సింహరావు, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, పశుసంవర్థక శాఖ జేడీ రాంచందర్, డీఎస్వో నాగేశ్వర్రావు, ఉద్యానశాఖ డీడీ సంగీతలక్ష్మి, వ్యవసాయశాఖ జేడీ సుచరిత, వయోజన విద్య డీడీ జయశంకర్, జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్, ట్రాన్స్‌కో ఎస్ఈ నారాయణ, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మారం జగదీశ్వర్, సుగుణాకర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సుద్దాల రాజయ్య, నాగుల నర్సింహస్వామి తదితరులున్నారు. -
రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించండి
కలెక్టర్‌కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ లేఖ కాకినాడ : అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబానికి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన ఆర్థిక సహాయాన్ని సత్వరమే అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్‌ను కోరారు. ఈ మేరకు ఆయన కలెక్టర్‌కు లేఖ రారు. కలెక్టర్‌కు పంపించిన లేఖ వివరాలు ప్రకారం ... అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన రైతు కొల్లా సత్యనారాయణ ఈ ఏడాది ఫిబ్రవరి 25న అప్పుల బాధ తాళ్ళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యపై జిల్లా యంత్రాంగం నియమించిన విచారణ కమిటీ నివేదికను వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్‌కు మే నెలలో అందజేశారు. ఆ మేరకు కొల్లా సూర్యనారాయణ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా గానీ, జిల్లా యంత్రాంగం నుంచి కానీ ఎలాంటి సహాయం అందలేదు. దీంతో అతని భార్య కె.వెంకటలక్ష్మి సమస్యను వైఎస్ఆర్సీపీ నాయకులు జున్నూరి రామారావు(బాబి) ద్వారా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో స్పందించిన జగన్ తక్షణమే ఆ కుటుంబానికి ప్రభుత్వపరంగా అందాల్సిన ఆర్థిక సహాయాన్ని అందజేయాల్సిందిగా కోరుతూ కలెక్టర్ అరుణ్‌కుమార్‌కు లేఖ రాశారు. జగన్ పంపిన లేఖను∙సత్యనారాయణ కుమారుడు కొల్లా బాబి గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి అందజేశారు.