మేడమ్ కంగ్రాట్స్
Published Fri, Aug 26 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
ముకరంపుర: జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లను శరవేగంగా నిర్మించి ప్రశంసతులు అందుకున్న కలెక్టర్ నీతూప్రసాద్‌ను శుక్రవారం పలువురు అభినందనలతో ముంచెత్తారు. నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ఎస్పీ జోయెల్ డేవిస్‌తో పాటు జిల్లా అధికారులు సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శాలువా బొకేలతో ఘనంగా సన్మానించారు. మేయర్ మొక్కను అందించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లను వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారని, అక్షరాస్యత పెంపునకు కృషిచేశారని స్వచ్ఛభారత్ బహుమతి జిల్లా అధికారులందరిదని అన్నారు. కార్యక్రమంలో జేసీ శ్రీ దేవసేన, ఏజేసీ నాగేంద్ర, డీఆర్‌వో వీరబ్రహ్మయ్య, అడిషనల్ ఎస్పీ అన్నపూర్ణ, డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ, హౌసింగ్ పీడీ నర్సింహరావు, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, పశుసంవర్థక శాఖ జేడీ రాంచందర్, డీఎస్‌వో నాగేశ్వర్‌రావు, ఉద్యానశాఖ డీడీ సంగీతలక్ష్మి, వ్యవసాయశాఖ జేడీ సుచరిత, వయోజన విద్య డీడీ జయశంకర్, జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ నారాయణ, టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మారం జగదీశ్వర్, సుగుణాకర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సుద్దాల రాజయ్య, నాగుల నర్సింహస్వామి తదితరులున్నారు.
Advertisement
Advertisement