neethuprasad
-
మరుగుదొడ్ల లక్ష్యం చేరాలి
హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెలాఖరులోగా వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మలవిసర్జన రహిత (ఒడిఎఫ్) ప్రాంతంగా ప్రకటించాలని కలెక్టర్ నీతూప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని మధువని గార్డెన్స్‌లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతిపై ప్రత్యేకాధికారులు, మండలస్థాయి అధికారులతో సమీక్షించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 24,193 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరుకాగా.. ఇప్పటివరకు 20 వేల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని ఈ నెలలోపు పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు తమ ఆధీనంలోని సిబ్బందిని ఇందుకు వినియోగించుకోవాలని సూచించారు. మేస్త్రీల కొరత ఉంటే ఇతర మండలాల నుంచి రప్పించాలని, నిర్మాణాలు పూర్తయిన వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించారు. మండల, గ్రామస్థాయి అధికారులు ప్రతిరోజూ గ్రామాలకు వెళ్లి పనులు పర్యవేక్షించాలని సూచించారు. 15 రోజులు కష్టపడితే వందశాతం చేరుకోవచ్చన్నారు. గ్రామ, మండల అధికారులు స్వచ్ఛ్ హుజూరాబాద్ గ్రూప్ పేరిట వాట్సప్ ప్రారంభించాలని సూచించారు. ఐఎస్ఎల్ నిర్మాణాల ప్రగతిని అందులో ప్రతిరోజూ అప్డేట్ చేస్తుండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రకాశ్‌రావు, డిఆర్డిఎ పీడి అరుణశ్రీ, డ్వామా పీడి వెంకటేశ్వర్లు, జిల్లా విధ్యాధికారి శ్రీనివాసాచారి, వయోజన విద్యాశాఖ డీడీ జైశంకర్, ప్రత్యేకాధికారి కిషన్‌స్వామి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మేడమ్ కంగ్రాట్స్
ముకరంపుర: జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లను శరవేగంగా నిర్మించి ప్రశంసతులు అందుకున్న కలెక్టర్ నీతూప్రసాద్‌ను శుక్రవారం పలువురు అభినందనలతో ముంచెత్తారు. నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ఎస్పీ జోయెల్ డేవిస్‌తో పాటు జిల్లా అధికారులు సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శాలువా బొకేలతో ఘనంగా సన్మానించారు. మేయర్ మొక్కను అందించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లను వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారని, అక్షరాస్యత పెంపునకు కృషిచేశారని స్వచ్ఛభారత్ బహుమతి జిల్లా అధికారులందరిదని అన్నారు. కార్యక్రమంలో జేసీ శ్రీ దేవసేన, ఏజేసీ నాగేంద్ర, డీఆర్వో వీరబ్రహ్మయ్య, అడిషనల్ ఎస్పీ అన్నపూర్ణ, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, హౌసింగ్ పీడీ నర్సింహరావు, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, పశుసంవర్థక శాఖ జేడీ రాంచందర్, డీఎస్వో నాగేశ్వర్రావు, ఉద్యానశాఖ డీడీ సంగీతలక్ష్మి, వ్యవసాయశాఖ జేడీ సుచరిత, వయోజన విద్య డీడీ జయశంకర్, జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్, ట్రాన్స్‌కో ఎస్ఈ నారాయణ, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మారం జగదీశ్వర్, సుగుణాకర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సుద్దాల రాజయ్య, నాగుల నర్సింహస్వామి తదితరులున్నారు. -
బెగులూర్‌లో కలెక్టర్
మహదేవపూర్ సామాజిక ఆసత్రి తనిఖీ గ్రామస్తులకు జ్వరాలు,పరిశుభ్రతపై అవగాహన కాళేశ్వరం: మహదేవపూర్ మండలం బెగులూర్‌లో వచ్చే జ్వరాలను అధికారులు, ప్రజలు సీరియస్‌గా తీసుకోవాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. మహదేవపూర్‌లోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని మంథని ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి మంగళవారం ఆమె పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఏప్రాంతం నుంచి జ్వరాలు, డయేరియా కేసులు వస్తున్నాయని స్థానిక వైద్యులతో ఆరాతీశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున్న వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం బెగులూర్ గ్రామంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, డీపీవో అధికారులతో పర్యటించారు. గ్రామస్తులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెగులూర్తోపాటు మండలంలో జ్వరాలతో సుమారు 10 మందికి పైగా మృతి చెందారన్నారు. గ్రామంలో నీటిసమస్య,పారిశుధ్య సమస్యలు ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. గ్రామస్తులందరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కోరారు. ప్రతీ ఇంటికి క్లోరినేషన్ బిళ్లలు ఇస్తామని, వాటిని నీటిలో వేసుకోని శుద్ధి చేసుకోవాలన్నారు. పంచాయతీ అధికారులకు గ్రామంలోని అన్ని వార్డుల్లో బ్లీచింగ్ చల్లాలని ఆదేశించారు. పంకెన, సూరారం, బెగులూర్, కిష్టరావుపేట, రాపల్లికోట, ఏన్కపల్లి గ్రామాల్లో ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 50వేల వరకు రక్త కణాలు తగ్గితే వెంటనే కరీంనగర్‌కు పంపాలని వైద్యాధికారులకు ఆదేశించారు. మంగళవారం ఒక్క రోజు 30 మందిని పరీక్షించి 20మందిని కరీంనగర్ ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు. బెగులూర్‌లో జ్వరాలు తగ్గుముఖం పట్టేవరకు ప్రత్యేక వైద్యులను నియమించాలని జిల్లా వైద్యాధికారి రాజేశంను కలెక్టర్ ఆదేశించారు. జ్వర పీడితులను కరీంనగర్లో ఓ ప్రవేటు ఆస్పత్రికి అంబులెన్స్‌ల ద్వారా వైద్య సిబ్బంది తరలించి వైద్య పరీక్షలకు పైసలు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచ్ తిరుపతి, ఎంపీపీ వసంత,జెడ్పీటీసీ హసీన భాను, సింగిల్‌విండో చైర్మన్ శ్రీపతిబాపు,మంథని సర్పంచి పుట్ట శైలజ, కాటారం ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు,డీసీహెచ్‌వో అశోక్‌కుమార్,డీపీవో సూరజ్‌కుమార్,డీఎల్పీవో శ్రీనివాసరెడ్డి,క్లస్టర్ ఎస్పీహెచ్వో సమియోద్దీన్,మహదేవపూర్ ఇంచార్జీ వైద్యాధికారి వాసుదేవారెడ్డి,తహశీల్దార్ జయంత్,ఎంపీడీవో సత్యనారాయణ పాల్గొన్నారు.