యుద్ధరంగంలోకి మహిళలు..
► లింగపరమైన అడ్డంకులు అధిగమించి అనుమతిస్తాం
► ప్రస్తుతం ఈ మార్పుల ప్రక్రియ వేగంగా సాగుతోంది
► తొలుత మిలిటరీ పోలీస్‌గా మహిళల రిక్రూట్మెంట్
► వ్యూహాత్మక భాగస్వామ్య మోడల్ మంచిదే..
► మిలిటరీ ఆధునీకరణ ప్రక్రియకు చేయూత
► ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వెల్లడి
న్యూఢిల్లీ: భారత సైన్యం భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. లింగపరమైన అడ్డంకు లను అధిగమిస్తూ యుద్ధరంగంలోకి మహిళ లను అనుమతించనుంది. ఇప్పటి వరకు యుద్ధ క్షేత్రంలో పోరాటంలో పురుషులు మాత్రమే కనిపించగా.. ఇక ముందు మహి ళలు సైతం పాలుపంచుకోనున్నారు. ప్రస్తు తం కదన రంగంలో మహిళలకు కొద్ది దేశా ల్లోనే అనుమతి ఉంది. మహిళలను యుద్ధంలో అడుగుపెట్టేందుకు అనుమతిస్తా మని, దీనికి సంబంధించిన మార్పులకు రంగం సిద్ధం చేశామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వెల్లడించారు. పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ హోదాలోకి ఇకపై మహిళలను అనుమతి స్తామన్నారు.
ప్రస్తుతం ఈ ప్రక్రియ వేగంగా సాగుతోందని, తొలుతగా మహిళలను మిలి టరీ పోలీసులుగా రిక్రూట్మెంట్ చేసుకుంటా మని చెప్పారు. ‘మహిళలు జవాన్లుగా రావా లని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు తీసు కుంటున్నాం. తొలుత మిలిటరీ పోలీసు జవా న్లుగా మహిళలకు బాధ్యతలు అప్పగిస్తాం’ అని చెప్పారు. ప్రస్తుతం మిలిటరీ విభాగానికి అనుసంధానంగా ఉండే మెడికల్, లీగల్, ఎడ్యుకేషనల్, సిగ్నల్స్, ఇంజనీరింగ్ విభా గాల్లో ఇప్పటికే మహిళకు అవకాశం కల్పిస్తు న్నారు.
అయితే కార్యాచరణ ఇబ్బందులు, వసతి సమస్యల దృష్ట్యా యుద్ధ క్షేత్రంలోకి వారిని అనుమతించే వారు కాదు. జవాన్లుగా మహిళలను తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ప్రస్తుతం ఈ ప్రక్రియను మొదలుపెట్టామని రావత్ చెప్పారు. శత్రువుతో పోరాటంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు మహిళలు ధైర్యసాహసాలు చూపాలని, అడ్డంకులను అధిగమించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, బ్రిటన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, ఇజ్రాయెల్ తదితర దేశాలు మాత్రమే యుద్ధరంగంలోకి మహిళలను అనుమతిస్తున్నాయి.
భాగస్వామ్య మోడల్ మంచిదే..
రక్షణ రంగ ఉత్పత్తుల్లోకి ప్రైవేటు సంస్థలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొం దించిన వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా పద్ధతి మంచిదే అని ఆర్మీ చీఫ్ అభిప్రా యపడ్డారు. భారత సైనిక బలగాల ఆధునీక రణకు ఈ విధానం ఊతమిస్తుందని పేర్కొ న్నారు. ఈ కొత్త విధానం వల్ల ఆధునీకరణ ప్రక్రియ వేగంగా ముందుకెళుతుందని, కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చి.. ప్రధాన మిలిటరీ మౌలికవసతుల ప్రాజెక్టులకు సహా యపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా వల్ల కాలం చెల్లిన ట్యాంకులు, ఆయుధాల స్థానంలో అధునాతన ఆయుధాలు, విని యోగంలోకి వస్తాయని, రానున్న ఏడెనిమి దేళ్లలో పాత వ్యవస్థ స్థానంలో కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
సైనికులకు పనే మతం..
సైనికులకు పనే మతం అని, పనే దైవం అని రావత్ అన్నారు. శనివారం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద దాడిలో మరణించిన ఇద్దరు సైనికులకు ఆర్మీ చీఫ్, ఆర్మీ ఉన్నతాధికారులు ఆదివానం ఢిల్లీలో ఘనంగా నివాళు లర్పించారు. ‘దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులను మనం గౌరవించాలి. నివాళులర్పించాలి’ అని రావత్ అన్నారు.
మిలిటరీ పోలీస్ విధులు..
మహిళలను అనుమతించనున్న మిలిటరీ పోలీసుల విధులు ఏమిటంటే.. కంటోన్మెంట్, సైనిక స్థావరాల వద్ద పోలీసింగ్, సైనికులు నియమ, నిబంధనలను ఉల్లంఘించకుండా చూడటం, సైనికుల కదలికల్ని పర్య వేక్షించడం, యుద్ధం, శాంతి సమయాల్లో వసతి, రవాణా సదుపాయాలను పర్యవేక్షించడం, యుద్ధఖైదీలను హ్యాండిల్ చేయడం, అవసరమైన సమయాల్లో సివిల్ పోలీసులకు సహాయం అందజేయడం. ముగ్గురు మహిళలను ఫైటర్ పైలట్లుగా తీసుకుని వాయు సేన చరిత్ర సృష్టించిన ఏడాదిలోపేభారత ఆర్మీ ప్రయోగాత్మ కంగా యుద్ధరంగంలోకి మహిళలను అనుమతించేందుకు సిద్ధమైంది.