'త్వరలో ఆలయ కమిటీల ఏర్పాటు'
యాదగిరిగుట్ట: త్వరలోనే రాష్ట్రంలోని దేవాలయాల ట్రస్ట్ బోర్డు కమిటీలను ప్రభుత్వ నియమించనుందని విప్ గొంగిడి సునీత వెల్లడించారు. శుక్రవారం ఆమె స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. ఏ కేటగిరీలో ఉన్న యాదాద్రి, భద్రాచలం, వేములవాడ ఆలయాలకు14 మందితో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే, బీ కేటగిరీలో 9, సీ కేటగిరీలో 5 మంది సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నియామకాలు ప్రకటించే ఆలోచనలో ఉందన్నారు. సుమారు వంద నామినేటెడ్ పోస్టులకు ఇప్పటివరకు వేల సంఖ్యలో దరఖాస్తులు అందాయని విప్ వివరించారు.