కొత్త కంపెనీల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: కొత్త కంపెనీల బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర పడింది. దేశంలో కార్పొరేట్ రంగాన్ని ఆరు దశాబ్దాలు నడిపించిన నిబంధనల స్థానం లో ఈ బిల్లు కొత్త చట్టం రూపంలో అమల్లోకి రానుంది. ఆగస్టు 29న రాష్ట్రపతి 2013 బిల్లుకు ఆమోదముద్ర వేసినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కొత్త చట్టానికి నిబంధనల తయారీ ప్రక్రియలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఉందని, రెండువారాల్లో ఇవి సిద్ధమవుతాయని సమాచారం.