cosmotics
-
హిమాచల్‌లో అగ్ని ప్రమాదం.. దూకేసిన సిబ్బంది
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవివంచింది. ఓ కాస్మోటిక్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది భవనంపై నుంచి దూకేశారు. ఈ ప్రమాదంలో 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. మొత్తం 41 మంది సిబ్బందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. #Himachal: major fire in a cosmetic factory in Baddi factory. 32 injured rescued, 24 feared missing. pic.twitter.com/hhD0xakgDs — Diksha Verma (@dikshaaverma) February 2, 2024 Massive fire broke out in cosmetic & perfume manufacturing factory in Baddi, Himachal Pradesh. About 130 employees were working in the factory at the time & many are feared to be trapped. Fire brigade & health department teams reached the spot.#Baddi #HimachalPradesh #fire pic.twitter.com/AyDt6EyA5J — Mirror Now (@MirrorNow) February 2, 2024 -
రోజూ లిప్‌స్టిక్ వాడుతున్నారా? ఇందులోని కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ వల్ల..
అమ్మాయిలు అందంగా కనిపించేందుకు రకరకాల వస్తువులు వాడుతుంటారు. ముఖ్యంగా కాస్మొటిక్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు.వాటికోసం వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. బ్యూటీ ఉత్పత్తులపై రోజూ కొన్ని కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంటుంది. అందులో ఒకటి లిప్‌స్టిక్. ఈరోజుల్లో లిప్‌స్టిక్ వాడకం ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కొంతమంది అమ్మాయిలు అయితే లిప్‌స్టిక్ లేనిదే కాలు కూడా బయట పెట్టరు. లిప్‌స్టిక్ లేకుండా అసలు మేకప్ పూర్తి అవదు. ముఖాన్ని మరింత కాంతివంతంగా, అందంగా కనిపించేందుకు లిప్‌స్టిక్ వాడుతుంటారు. కొందరైతే డ్రెస్ కలర్‌కి తగ్గట్లు రకరకాల లిప్‌స్టిక్స్‌ను వాడుతుంటారు. అయితే అందాన్ని పెంచే లిప్స్టిక్స్ రోజూ వాడితే ప్రమాదం పొంచిఉన్నట్లే..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ♦లిప్‌స్టిక్ వేసుకున్న తర్వాత మనం ఏదైనా తిన్నా, తాగినా ఎంతోకొంత మన నోట్లోకి వెళుతుంది. లిప్‌స్టిక్‌లలో శరీరానికి హాని కలిగించే అనేక రకాల ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ♦ లిప్‌స్టిక్‌లో ఉండే అల్యూమినియం,క్రోమియం,కాడ్మియం వంటి హానికారమైన పదార్థాలు అనేక విధాలుగా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ♦ ముఖ్యంగా లిప్‌స్టిక్‌లోని అల్యూమినియం పొట్టలోకి చేరితే అల్సర్‌కు దారి తీస్తుంది.లిప్‌స్టిక్‌లోని సీసం సామర్థ్యం, జ్ఞాపకశక్తి స్థాయిని తగ్గిస్తుంది. ♦ అరుదైన సందర్భాల్లో, లిప్‌స్టిక్ వల్ల కళ్ల కింద దురద, ఉక్కిరిబిక్కిరి చేయడం, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ♦ లిప్‌స్టిక్స్‌లో వాడే సీసం వల్ల హైపర్‌టెన్షన్, గుండె సమస్యలు వస్తాయి. ♦ బిస్మత్ ఆక్సిక్లోరైడ్‌ను లిప్‌స్టిక్‌లో ప్రిజర్వేటివ్‌గా కూడా ఉపయోగిస్తారు. దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల అలర్జీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ♦ కొన్ని చవక లిప్‌స్టిక్‌లను వాడితే చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ లిప్స్టిక్స్ వాడాలనుకునేవారు ఖరీధైన, హెర్బల్ ఉత్పత్తులను వాడితే మంచిది. లిప్స్టిక్స్ వాడేముందు ఇలా చేయండి.. ► కొందరు తెలిసో తెలియకనో డైరెక్ట్‌గా లిప్స్‌కు లిప్‌స్టిక్‌ను వేసేసుకుంటారు. అలా అస్సలు చేయొద్దు. ముందుగా లిప్‌బామ్ రాసుకొని దానిపైన లిప్‌స్టిక్ వాడాలి. ► లిప్‌బామ్ అందుబాటులో లేకపోతే పెట్రోలియం జెల్లీ, కొబ్బరి నూనె లాంటివి కూడా వాడొచ్చు. ► లిప్స్టిక్స్ ప్రతిరోజూ వాడటం వల్ల పెదాలు నల్లగా మారిపోతుంటాయి. అందువల్ల పాలతో రబ్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. ► పడుకునేముందు కశ్చితంగా లిప్‌స్టిక్‌ను తొలగించిన తర్వాతే నిద్రపోవాలి. లేదంటే లిప్‌స్టిక్స్‌లోని కెమికల్స్ పెదాలను డ్యామేజ్ చేస్తాయి. ► పెదాలు హైడ్రేటెడ్‌గా ఉంచడానికి నీళ్లు ఎక్కువగా తాగాలి. లేదా పొడిబారే అవకాశం ఎక్కువగా ఉంటుంది -
నా సక్సెస్ సీక్రెట్ వాళ్లే
ఈరోజు నేనెప్పటికి మరిచిపోలేను, నా సక్సెస్ సీక్రెట్‌కి కారణం తెలుగు సినిమా పరిశ్రమలోని ఎంతోమంది నటీనటులే. వారితో పాటు దేశంలోని అనేకమంది రాజకీయ, వ్యాపారవేత్తలు నాకు ఆప్తులు అయ్యారంటే దానికి కారణం నా మేకోవర్ కంపెనీ ‘‘సెలబ్రిటీస్ సీక్రెట్’’ అన్నారు డాక్టర్ మాధవి. బ్రాండ్‌తో ఒక డాక్టర్‌గానే కాకుండా వారందరి కుటుంబ సభ్యుల్లా నేను అందరిని ట్రీట్ చేస్తాను. మొదట నా క్లైయింట్స్‌కి ట్రీట్మెంట్ చేసేముందు నాకు నేను టెస్ట్ చేసుకున్నాక అది సక్సెస్ అయితేనే ఆ ట్రీట్మెంట్ను నా క్లైయింట్స్‌కి చేసి మంచి రిజల్ట్ వచ్చేటట్లు చేస్తాను. తద్వారా వాళ్లు రిజల్ట్‌తో సంతృప్తిగా ఉండటంతో మరో పదిమందికి మా క్లినిక్ గురించి చెప్పటం వల్ల మౌత్ పబ్లిసిటీతో ఇక్కడ వరకు మా ప్రయాణం వచ్చింది. క్లైయింట్సందరూ ఎంజాయ్ చేసిన సేవలే నన్ను, మా వారు డాక్టర్ వెంకట్‌గారిని ఇంతమందికి దగ్గర చేశాయి అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అన్నారు ‘‘సెలబ్రిటీ సీక్రెట్స్’’ ఎండి డాక్టర్ మాధవి. బుధవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో మరో నూతన ప్రాజెక్ట్‌ను ప్రకటించారామె. డా.మాధవి ఉమెన్ ఎంటర్ ప్రైనర్, ఎస్తటిక్ ఫిజిషియన్, కాస్మేటలజిస్ట్. ఈ సందర్భంగా దా. మాధవి వెంకట్ మాట్లాడుతూ–‘‘ ఈ ప్రాజెక్ట్‌ను అతిత్వరలో ప్రారంభిస్తున్నాం అని నా పుట్టినరోజు రోజున ఎనౌన్స్ చేయటం ఆనందంగా ఉంది. అలాగే గతంలో హైదరాబాద్, విజయవాడ, కాకినాడల్లోని మా బ్రాంచెస్ పెద్ద స్థాయిలో విజయం సాధించటం వెనుక నా టీమ్ పడిన తొమ్మిదేళ్ల కష్టాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది ’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు ఆలీ, దివ్యవాణి, సన, రాజారవీంధ్ర, రజిత,హేమ, హిమజ, సురేఖావాణి, జ్యోతి, జయలక్ష్మీ గాయని మంగ్లీ, ‘బిగ్‌బాస్’ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, భాను, ఐఏఎస్ అధికారిణి బాలా కథ, యాంకర్ రవి, జెస్సీలతో పాటు జ్ఙాపిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత ప్రవీణ కడియాల, అనిల్ కడియాల తదితరులు పాల్గొన్నారు. -
మీ గుండెకు ‘మంచి’ చేసే వంట నూనె
రోజు మీరు ఉపయోగించే వంటనూనె మీ ఆరోగ్యానికి మంచిదేనా? మీ గుండెకు ఎలాంటి మేలు చేస్తుందో తెలుసా ? ఆరోగ్యాన్ని కాపాడుతూ గుండెకు మేలు చేయడంలో రైస్‌బ్రాన్ వంట నూనెలు ముందున్నాయని పలు పరిశోధనల్లో తేలింది. శరీరంలో కొలెస్ట్రాల్ సమతుల్యత సాధించడంలో రైస్‌బ్రాన్ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో పాటు అమెరికా హర్ట్ అసోసియేషన్లు ఇప్పటికే సూచించాయి. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేస్తుంది చుడటానికి చక్కని రంగులో కనిపించే రైస్‌బ్రాన్ ఆయిల్ వంటకు ఎంతో బాగుంటుంది. ఇందులో నాచురల్ యాంటీఆక్సిడెంట్ అయిన ఒరిజనోల్ పుష్కలంగా లభిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. దేశీయంగా తయారయ్యే రైస్‌బ్రాన్ ఆయిల్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ వాడకం మాత్రం తక్కువగానే ఉంది. బియ్యపు పొట్టు నుంచి రైస్‌బ్రాన్ ఆయిల్ అంటే బియ్యంలోని పోషక పదార్థాల నుంచి నూనెను సేకరిస్తారనే అపోహ ఉంది. కానీ వాస్తవంలో అది నిజం కాదు. బియ్యం గింజ చుట్టూ ఉండే పొట్టు నుంచి ఆయిల్‌ని సేకరిస్తారు. ఈ బ్రౌన్ కలర్ పొట్టు వల్లనే బ్రౌన్ రైస్‌కు అనేక పోషక గుణాలు కలిగాయి. సాధారణ పాలిష్డ్ రైసుతో పోల్చితే బ్రౌన్ రైస్ ఎంతో మేలనే విషయం మనందరికీ తెలిసిందే. బియ్యపు పొట్టుకి ఉన్న ఔషధ గుణాలన్ని కలిసిన ఫ్రీడమ్ రైస్‌బ్రాన్ ఆయిల్‌ని మార్కెట్లో అందుబాటులో ఉంది. మ్యాజిక్ చేసే ఒరిజనోల్ గోధుమ రంగులో ఉండే బియ్యపు పొట్టు, ఒరిజనోల్ అనే సూక్ష్మమైన ఔషధ గుణాన్ని కలిగి ఉంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి ఒరిజనోల్ అవసరమని ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) సూచించింది. ఫ్రీడమ్ రిఫైన్డ్ రైస్‌బ్రాన్ ఆయిల్లో 10,000 ప్లస్ పీపీఎం ఆఫ్ ఓరిజనోల్ ఉంటుంది. ఇది సహాజమైన యాంటాక్సిడెంట్‌గా పని చేస్తూ శరీరంలోని కొలెస్ట్రాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది. విటమిన్ల సమాహారం రైస్‌బ్రాన్ ఆయిల్లో మోనో ఆన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (ముఫా), ఒమెగా-6 పాలి అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (పుఫా)లు ఉన్నాయి. వీటి వల్ల శరీరంలో ఫ్యాట్ ప్రొఫైల్, టోకోఫెరోల్స్, టోకోట్రైనోల్స్ వంటి యాంటియాక్సిడెంట్లన్లు బ్యాలెన్స్ చేస్తోంది. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని రక్షించడంలో తోడ్పడుతాయి. అంతేకాదు రైస్‌బ్రాన్ ఆయిల్లో విటమిన్ ఏ, డీలు కూడా ఉన్నాయి. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి అవసరమైన అన్ని సుగుణాలతో ఫ్రీడమ్ రైస్‌బ్రాన్ ఆయిల్ మార్కెట్లో అందుబాటులో ఉంది, డీప్ ఫ్రైకి అనుకూలం భారతీయ వంటలకు అనువుగా దాదాపు 232 సెల్సియస్ డిగ్రీల దగ్గర కూడా రైస్‌బ్రాన్ అయిల్ వంటకు అనుగుణంగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత దగ్గర డీప్ ఫ్రై సాధ్యమవుతుంది. దీనివల్ల అప్పుడప్పుడు వేపుళ్లు తింటూ జిహ్యా చాపల్యాన్ని సంతృప్తి పరుస్తూనే ఆరోగ్యాన్ని కాపడుకునేందుకు రైస్‌బ్రాన్ ఆయిల్ అనువుగా ఉంటుంది. అంతేకాదు వండినప్పుడు ఆహార పదార్థాలు రైస్‌బ్రాన్ ఆయిల్‌ను తక్కువగా శోచించుకుంటాయి. రైస్‌బ్రాన్ ఆయిల్‌కి ఉన్న మరో మంచి లక్షణం ఇది. కాస్మోటిక్స్ తయారీలో రైస్‌బ్రాన్ ఆయిల్‌కి ఇన్ని సుగుణాలు ఉండటం వల్లే సౌందర్య ఉత్పత్తుల తయారీలో రైస్‌బ్రాన్ ఆయిల్‌ని విరివిగా ఉపయోగిస్తుంటారు. మనం నిత్య జీవితంలో ఉపయోగించే సన్‌స్క్రీన్ లోషన్, డే క్రీముల్లో రైస్‌బ్రాన్ నుంచి తీసిన పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం రైస్‌బ్రాన్ ఆయిల్‌తో ఎన్నో ఉపయోగాలు ఉండటంతో ఎంతో మంది భారతీయులు ఇతర కుకింగ్ ఆయిల్స్‌కి బదులుగా రైస్‌బ్రాన్ ఆయిల్‌ని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆరోగ్యమే మహా భాగ్యం అని చెప్పినట్టు రైస్‌బ్రాన్ ఆయిల్ ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటే ఆస్పత్రుల చుట్టూ తిరిగే శ్రమ తగ్గుతుంది, వైద్య ఖర్చులు తప్పుతాయి. అన్నింటికీ మించి రోగాల బారిన పడకుండా ఉంటాం.(అడ్వర్టోరియల్) -
బాలికలకు కానుక!
వనపర్తి/కొత్తకోట: కస్తూర్బా విద్యాలయాల్లో చదువుతున్న బాలికలకు కొత్త సంవత్సరం కానుకగా ప్రతి మూడు నెలలకోసారి కాస్మొటిక్ కిట్టును సరఫరా చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ‘ఆరోగ్య పరిరక్షణ కిట్’ పేరిట 15 రకాల వస్తువులు అందజేయనుంది. ఇప్పటి దాకా ప్రభుత్వం కాస్మొటిక్ చార్జీల కింద నెలకు రూ.వంద చెల్లిస్తుండగా.. ఇవి ఏ మూలకూ సరిపోయేది కాదు. అవి కూడా సక్రమంగా వచ్చేవి కాదు. కానీ ప్రస్తుతం కిట్లు ఇవ్వనుండడం, అందులో సబ్బులు, షాంపూలు, పౌడర్ లాంటి సౌందర్య సాధనాలతోపాటు నాప్యెన్లు కూడా ఉండటంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ కిట్ల సరఫరా, పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా విద్యాశాఖకు అప్పగించింది. ఫిబ్రవరి మొదటి వారంలో.. ‘ఆరోగ్య పరిశుభ్రత కిట్’లో నాలుగు స్నానం సబ్బులు, రెండు దుస్తుల సబ్బులు, 24 శాంపులు, 175 మి.లీ. కొబ్బరి నూనె, 50 గ్రాముల పౌడర్, వంద గ్రాముల టూత్ పేస్ట్, టూత్ బ్రెష్, టంగ్ క్లీనర్, దువ్వెన, స్టిక్కర్లు (బొట్టు బిళ్లలు), రెండు 2.5 మీటర్ల నైలాన్ రిబ్బన్లు, రెండు హెయిర్ బాండ్లు, 18 నాప్ కిన్స్, ఒక మస్కిటో కాయిల్, హ్యాండ్‌వాష్ బాటిల్ (182 మి.లీ.) ఇలా 15 రకాల వస్తువులున్నాయి. మొట్టమొదటగా ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లాలోని ఆయా కస్తూర్బాల్లో ‘ఆరోగ్య పరిశుభ్రత కిట్’లను అధికారులు అందజేశారు. కస్తూర్బాలతోపాటు మోడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలల్లోని బాలికలకు సైతం ఈ కిట్లను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. విద్యార్థినులకు మేలు వనపర్తి జిల్లాలో 15 కస్తూర్బా విద్యాలయాలున్నాయి. వీటిలో 6 నుంచి 10వ తరగతి వరకు సుమారు 2,500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వసతి సౌకర్యం కూడా పొందుతున్న విద్యార్థినులకు ఇప్పటి వరకు ప్రతినెలా కాస్మొటిక్ చార్జీల పేరిట రూ.వంద చెల్లించేవారు. 2017 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ డబ్బులు సైతం రాలేదు. విద్యార్థినులందరికీ బ్యాంకు ఖాతాలు లేదనే కారణంతో డబ్బు జమ చేయలేనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో విద్యార్థినులకు కొబ్బరి నూనె, సబ్బులు, బాడీ లోషన్స్ క్రిములు అత్యవసరం. కానీ డబ్బు రాకపోవడంతో చాలామంది కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆనందంగా ఉంది.. ఆరోగ్య పరిశుభ్రత కిట్‌లో ప్రతిరోజు ఉపయోగించే అన్ని రకాల వస్తువులున్నాయి. దువ్వెన నుంచి మేకప్ చేసుకునే వస్తువులు ఇచ్చారు. హాస్టల్లో ఉండే అందరికి ఈ వస్తువులు ఇవ్వడం ఆనందంగా ఉంది. ఒకరి వస్తువులు మరొకరు వాడుకునే పరిస్థితి పోయింది. – స్వప్న, 9వ తరగతి, అమడబాకుల కేజీబీవీ నిరుపేద విద్యార్థులే అధికం.. కస్తూర్బాల్లో ఎక్కువగా తల్లిదండ్రులు లేని వారు, నిరుపేదలైన బాలికలే చదువుకుంటున్నారు. ప్రభుత్వం వారి అభ్యున్నతికి ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు ఆరోగ్య పరిశుభద్రత కిట్ ఇవ్వడం మరీ మంచిది. ఆడపిల్లలకు వీటి అవసరం చాలా ఉంటుంది. – శిరీష, ప్రిన్సిపాల్, అమడబాకుల, కేజీబీవీ