Data entry operators
-
రెండేళ్లు.. బాధితులు 6 వేలు
హిమాయత్‌నగర్: నిరుద్యోగులకు డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇస్తామంటూ పంజాగుట్ట కేంద్రంగా నడుస్తున్న ఓ నకిలీ కాల్ సెంటర్‌పై హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. దాదాపు రెండేళ్లుగా మోసానికి పాల్పడుతున్న ప్రధాన నిర్వాహకుడు గడగోని చక్రధర్, సహకారులు గణేష్, శ్రావణ్‌లతో పాటు మరో 32మంది టెలికాలర్స్(వీరిలో అమ్మాయిలు 11మంది)ని అరెస్టు చేసినట్లు సైబర్ క్రైం డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు. వారివద్ద నుంచి 14 ల్యాప్‌టాప్‌లు, 148 సెల్ఫోన్లు, రూ.1లక్షా 3వేలు నగదు, బీఎండబ్ల్యూ, ఫార్చునర్, ఇన్నోవా, మహేంద్ర కారులను స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. శనివారం బషీర్‌బాగ్‌లోని సైబర్ క్రైం కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావు, సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు రఘునా«థ్, శ్రీనాథ్‌రెడ్డిలతో కలసి స్నేహా మెహ్రా వివరాలను వెల్లడించారు. ప్రతి 45రోజులకు సిమ్‌లు మార్పు డబ్బులు వసూలు చేసిన తర్వాత ప్రతి 45 రోజులకోసారి ఫోన్ నెంబర్లను చక్రధర్‌గౌడ్ మార్చేసేవాడు. ఫేక్ కేవైసీల ఆధారంగా వందల కొద్దీ సిమ్‌లను అనంతపురం వాసి కృష్ణమూర్తి నుంచి కొనుగోలు చేసేవాడు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు డేటా ఎంట్రీ జాబ్ ఇస్తానంటూ మాయమాటలు చెప్పి వారి నుంచి రూ.2500 చొప్పున వసూళ్లు చేసి ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో ఆ ఇద్దరూ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి మొత్తం నిర్వాకాన్ని వెలికితీశారు. వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్, సైబర్‌క్రైం పోలీ సులు ఈ కాల్‌సెంటర్ గుట్టును రట్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావు తెలిపారు. రెండేళ్లు..6వేల మంది బాధితులు నగరంలోని బాచుపల్లిలో స్థిరపడ్డ సిద్దిపేటకు చెందిన గడగోని చక్రధర్‌గౌడ్‌కు గతంలో కాల్సెంటర్లలో పనిచేసిన అనుభవం ఉండటంతో 2021లో పంజాగుట్టలో రూ.1లక్షా 30వేల విలువ గల ఫ్లాట్‌ను తీసుకుని కాల్‌సెంటర్‌ను ప్రారంభించాడు. ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇస్తానంటూ వల వేశాడు. ఆయా రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులతో మాట్లాడేందుకు ఆ రాష్ట్రాలకు చెందిన వారినే టెలీకాలర్స్‌గా రూ.15వేల జీతానికి నియమించుకున్నాడు. ఈ రెండేళ్లలో ఒక్కో బాధితుడి నుంచి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు దాదాపు 6వేల మంది నుంచి వసూలు చేశారని గుర్తించారు. కొంతమంది నుంచి పెద్దమొత్తంలో కూడా వసూళ్లు చేశారు. -
జాబ్స్.. గాయబ్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారికి వేతన జీవులు విలవిల్లాడుతున్నారు. ఇంజనీర్లు, అకౌంటెంట్లు, ప్రైవేట్ టీచర్లు వంటి వివిధ రంగాల వైట్ కాలర్ వృత్తి నిపుణుల తో పాటు వివిధ కేటగిరీల్లో పారిశ్రామిక రం గంలో పనిచేసే ఇండస్ట్రియల్ వర్కర్స్‌నూ తీవ్రంగా ప్రభావితం చేసింది. లాక్‌డౌన్‌ను ఎ త్తేశాక కోవిడ్ దుష్పరిణామాల తీవ్రత ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మే నుంచి ఆగస్టు వరకు.. కొన్ని ప్రైవేట్, ప్రభుత్వ సం స్థల్లో పనిచేస్తున్న దాదాపు 60 లక్షల వృత్తి నిపుణులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. అంతకుముందు రోజులను కూడా కలుపుకుంటే మొత్తం 66 లక్షల మంది ౖ‘వెట్ కాలర్’వృత్తి నిపుణుల జాబ్స్ పోయాయి. స్వ యం ఉపాధితో పాటు సొంతంగా కొనసాగుతున్న వృత్తి నిపుణులు ఈ జాబితాలోకి రారు. వైట్ కాలర్స్పై అధిక ప్రభావం... ఈ ఏడాది మే–ఆగస్టు మధ్యకాలంలో సెంట ర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) ‘ట్వంటీయెత్ వేవ్ ఆఫ్ కన్జ్యూమర్ పిరమిడ్స్ హౌస్ హోల్డ్స్ పేరుతో సర్వే చేసిం ది. ఇందులో వైట్ కాలర్ వృత్తి నిపుణులు, ఇండస్ట్రీయల్ వర్కర్లపై కరోనా ప్రభావం.. వారు కోల్పోయిన ఉద్యోగాల గురించి వివ రించింది. వైట్‌కాలర్ వృత్తి నిపుణులైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అకౌంటెంట్లు, అనాలిస్ట్లు తదితర రంగాలకు చెందిన వారి ఉద్యోగాలపై కరోనా తీవ్రంగా పడినట్టు స్పష్టం చేసిం ది. 2016 తర్వాత వైట్ కాలర్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల్లో వృద్ధి పుంజుకోగా, ఆ ఏడాది జ నవరి–ఏప్రిల్ మధ్య 1.25 కోట్ల మంది వివిధ రంగాల్లో కొనసాగారు. అదే 2019, మే–ఆగస్టు నాటికి 1.88 కోట్ల మంది ఉద్యోగాల్లో ఉన్నారు. 2019 సెప్టెంబర్–డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 1.87 కోట్లు ఉండగా, ఈ ఏడాది జనవరి–ఏప్రిల్ నాటికి 1.81 కోట్లకు తగ్గిపోయింది. లాక్డౌన్ ప్రభావం కారణం గా ఈ సంఖ్య స్వల్పంగా తగ్గగా, అది ఎత్తే సిన తర్వాత మే–ఆగస్టు నాటికి వృత్తి నిపుణు ల ఉద్యోగాలు 1.22 కోట్లకు తగ్గిపోయాయి. అంటే మొత్తంగా దాదాపు 66 లక్షల ఉద్యోగాలకు కోత పడింది. గత నాలుగేళ్లలో సృష్టించిన దాదాపుగా అన్ని ఉద్యోగాలు పోయా యని సీఎంఐఈ విశ్లేషించింది. ఈ ఏడాది మే–ఆగస్టు మధ్యలో 59 లక్షల మంది, అంతకుముందు నాలుగు నెలలు (జనవరి–ఏప్రిల్ మధ్యలో) కూడా కలిపితే మొత్తం 66 లక్షల ఉద్యోగాలు పోయినట్లు (2019 మే–ఆగస్టుతో పోల్చితే)గా ఈ సర్వే తేల్చింది. వీరిపై లాక్డౌన్ ప్రభావం లేదు.. ఆఫీసుల్లో పనిచేసే క్లర్క్‌లు, సెక్రటరీలు, బీపీవో, కేపీవో, డేటా ఎంట్రీ ఆపరేటర్ల వంటి వారి ఉద్యోగాలపై కరోనా లాక్డౌన్ ప్రభావం పడలేదని అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో అధిక శాతం లాక్‌డౌన్‌తో ఇంటి నుంచి పనిచేసే విధానానికి మళ్లినట్లు తెలుస్తోంది. 50 లక్షల మంది ఉద్యోగాలపై దెబ్బ.. లాక్డౌన్ ఎత్తేశాక 50 లక్షల మంది ఇండస్ట్రీయల్ వర్కర్లు ఉద్యోగాలు కోల్పోయారు. చి న్న తరహా పరిశ్రమలు, ఇండస్ట్రియల్ యూ నిట్‌లలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరిం త తగ్గి ఉంటాయని ఈ సర్వే విశ్లేషించింది. ఇటీవలి కాలంలో మైక్రో, స్మాల్ అండ్ మీడి యం ఇండస్ట్రియల్ యూనిట్స్‌లోనూ ఉద్యో గాలు తగ్గినట్టుగా సీఎంఐఈ పేర్కొంది. -
చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరి
వేములవాడఅర్బన్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండల విద్యా వనరుల కేంద్రాల్లో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు పదేళ్లుగా వెట్టిచాకిరి చేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలు గడవక చేసేది ఏమీ లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్సీల్లో 9 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 9 మంది మండల సమన్వయ కర్తలు పనిచేస్తున్నారు. తమకు కనీస వేతనాలు పెంచాలని వారు ప్రభుత్వన్ని కోరుతున్నారు. అప్పట్లో వీరిని ఎంపిక చేసి ఔట్ సోర్సింగ్‌పై నియమించారు. వీరు అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్ విభాగం, కంప్యూటర్ రంగంలో పరిజ్ఞానం కలిగిన వారిని ఎంపిక చేశారు. ఎమ్మార్సీ కార్యాలయంలో డేటా ఎంట్రీ మండల విద్యావనరుల కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మండల సమన్వయ కర్తలుగా నియామకమైన వీరు మండ కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో ఉపాధ్యాయుల నెలవారీ వేతనాలతో పాటు పాఠశాలకు మంజూరయ్యే నిధులు, ఖర్చుల వివరాలను నమోదు చేస్తారు. ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈవోల అసిస్టెంట్లుగా ఉంటున్నా వీరు అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. చాలీచాలని వేతనం.. పదేళ్ల క్రితం నియామకమైన వీరికి కనీస వేతనాల ఊసేలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎమ్మార్సీ కార్యాలయాల్లో అన్ని పనులు చేస్తుంటారు. కానీ వారికి వేతనం రూ.15 వేలు మించదు. దాంతో వారి కుటుంబాలు గడవక వీధిన పడే పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. అయినా ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం విధానాన్ని అమలు చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. వారి డిమాండ్లు ఇవే.. ∙సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ∙ఏడాదికి 22 సెలవులు ఇవ్వాలి. ∙మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ∙రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందజేస్తున్న జీవో నెం 14 ప్రకారం వేతనాలు ఇవ్వాలి. ∙ఉద్యోగ భద్రత కల్పించి హెల్త్ కార్డులు అందించాలి. ∙ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సెలవులు, అలవెన్సులు కల్పించాలి. -
డేటా ఎంట్రీ ఆపరేటర్లకు దరఖాస్తులు
విశాఖపట్నం: ఏజెన్సీ పోలీస్ స్టేషన్లలో ఆరు నెలలు పనిచేసేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశాఖపట్నం జిల్లా పోలీసులు, ఇక్విసిటివ్ ప్రయివేటు సంస్థ సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి పూర్తిగా ప్రయివేటు సంస్థ నియామకాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు పోలీస్ స్టేషన్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. డిగ్రీ లేదా పీజీ విద్యార్హత కలిగి, కంప్యూటర్ డేటా ఆపరేటర్‌గా అనుభవమున్న పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల వయసుండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.2500 చెల్లిస్తారు. ఆసక్తి ఉన్నవారు 13వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులను ఎన్.ధర్మాజీ, ఏరియా మేనేజర్, ఇవిజిటివ్ (ఎడ్యూ కన్సల్టింగ్ రీసెర్చ్) సంస్థ, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట అందజేయాలి. వివరాలకు ఫోన్ న ంబరు 9848098060 నంబరులో సంప్రదించాలి.