death day
-
పుట్టిన రోజు నాడు భోరున ఏడుస్తున్న ఆర్జీవీ!
సాక్షి హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుట్టిన రోజు ఈ రోజు (ఏప్రిల్, 7). ఈ సందర్భంగా సినీవర్గానికి చెందిన పలువురితో పాటు, ఆయన అభిమానులు రామూకి అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఎపుడూ వివాదాస్పద, వ్యంగ్య, కొంటె కమెంట్లతో వార్తల్లో నిలిచే ఆర్జీవీ మరోసారి తనదైన స్టయిల్లో తన పుట్టిన రోజు గురించి చెప్పుకొచ్చాడు. ఈ రోజు నా బర్త్‌డే కాదు..వాస్తవానికి నా డెత్ డే.. ఎందుకంటే నా ఆయుష్షులో ఇక సంవత్సరం తగ్గిపోయింది అంటూ బుధవారం ట్వీట్ చేశారు. ఏడుపుమొహం ఎమోజీలను పోస్ట్ చేశాడు. దీంతో వార్నీ... ఆర్జీవీ నీరూటే సెపరేటయ్యా.. కానీ.. అలాగే కానీ..అంటూ ఫ్యాన్స్ ఫన్నీగా కమెంట్ చేస్తున్నారు. కాగా హారర్, థ్రిల్లర్, పొలిటికల్, బయోపిక్స్ ఇలా అనేక జానర్లలో విలక్షణ రీతిలో బాలీవుడ్, టాలీవుడ్‌ను ఏలుతున్న ఆర్జీవీ శివ, రంగీలా, మనీ , గులాబీ, క్షణక్షణం, దెయ్యం, సత్య, సర్కార్ లాంటి అనేక సినిమాల ద్వారా తన స్టయిల్‌ను ప్రేక్షకులకు రుచిచూపించాడు. తాజాగా ‘ఆర్జీవీ దెయ్యం' పేరుతో మరో సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. No , it’s not my birthday but it’s my deathday today because one more year in my life died today 😢😢😢 — Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2021 No Thyaaaaanks! https://t.co/PgMhNLLQd9 — Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2021 -
‘డెత్ డే’ వేడుకలపై పోలీసుల సీరియస్
సాక్షి, హన్మకొండ చౌరస్తా : అధికార పార్టీకి చెందిన దివంగత కార్పొరేటర్ అనిశెట్టి మురళీ హత్యకు గురై ఏడాదైన సందర్భంగా హతుడి ప్రత్యర్థి మిత్రులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకోడాన్ని పోలీసుల్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నెల 13న హత్య కేసు ప్రధాన నిందితుడి ఇంట్లో జరిగి నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా మీడియా, పత్రికల్లో కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు వీడియో ఆధారంగా బాబురావు, రాజేశ్, రాకేష్, ధర్మ, సంజీవ్, బొమ్మతి విప్లవ్‌కుమార్, ఫయాజ్, అకాశ్, శ్రీధర్‌పై కేసు నమోదు చేశారు. ఈ తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలిసింది. డెత్‌డే సంబురాలు నిర్వహించడం వెనుక ఎవరి హస్తం ఉంది.. అందులో పాల్గొంది తొమ్మి ది మందేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. విచారణ అనంతరం బుధవారం వారిని అరెస్టు చూపెట్టనున్నట్లు సమాచారం. మురళీ భార్య, కార్పొరేటర్ సరిత ధర్నా కార్పొరేటర్‌గా కొనసాగుతున్న అనిశెట్టి మురళీ హత్య జరిగిన రోజున, ప్రత్యర్థుల మిత్రులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకోవడంపై మురళీ భార్య, 44వ డివిజన్ కార్పొరేటర్ సరిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ ప్రజలు, బంధువులతో కలిసి డివిజన్లోని కేయూ బైపాస్ రోడ్డు లోగల హనుమాన్ జంక్షన్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార పార్టీలో కొనసాగుతున్న తన భర్త హత్యకు గురైతే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. రాజకీయ కుట్రలతోనే తన భర్తను హత్య చేయించారని ధ్వజమెత్తారు. తన భర్త హత్యకు గురై ఏడాది గడుస్తున్నా నిందితులకు శిక్ష పడకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగిన సమయంలో ఆరుగురు ఉంటే అందులో ఏ ఒక్కరిని సాక్షులుగా చేర్చకపోవడంపై అనుమానాలున్నాయని అన్నారు. ఆరుగురి సభ్యుల్లో ఒకరిద్దరి సహకారంతోనే తన భర్త హత్య జరిగిందన్నారు. పది రోజుల్లో మంత్రి కేటీఆర్ డివిజన్‌కు వచ్చి నిందితులకు శిక్ష పడేలా చూస్తానని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే డివిజన్ ప్రజలతో కలిసి తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని అన్నారు. -
ఎదలోని నీబొమ్మ ఎన్నటికీ పదిలం
మహానేత వైఎస్‌ను స్మరించుకున్న ప్రజలు ఊరూవాడా దివంగత ముఖ్యమంత్రి ఏడో వర్ధంతి ఆయన స్ఫూర్తితో పలు సేవాకార్యక్రమాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : పేదల మనసే మందిరంగా కొలువుదీరిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏడవ వర్ధంతిని జిల్లావ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శేణులు చెమ్మగిల్లిన కళ్లతో జరుపుకొన్నారు. బరువెక్కిన హృదయాలతో ఆ జనప్రియుని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ లోకాన్ని వీడి ఏడేళ్లవుతున్నా.. ఆయనపై తమ అభిమానం చెక్కుచెదరలేదని చాటుకున్నారు. నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు ఆయన అందించిన సేవలు, వారి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మరోసారి గుర్తుకు తెచ్చుకుని నీరాజనాలు పలికారు. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన ఆయన స్ఫూర్తితో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా అంతటా వాడవాడలా వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ రహితంగా వైఎస్ అభిమానులు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు, మన్యం, మైదాన ప్రాంతం అనే తారతమ్యాలు లేకుండా ప్రతి చోటా ఆ మహానేతను మనసారా స్మరించుకున్నారు. ఆ మహనీయుని విగ్రహాలను, చిత్రపటాలను పూలమాలలతో ముంచెత్తారు. పల్లెల్లో జనం తమ స్తోమతకు తగ్గట్టు చందాలు వేసుకుని మరీ వర్ధంతి జరుపుకోవడం కనిపించింది. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న వైఎస్ విగ్రహాలను రంగులతో అలంకరించారు. నేతలు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల నుంచి యువకులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ సేకరించిన రక్తాన్ని మరొకరికి ప్రాణదానం చేసే లక్ష్యంతో రోటరీ, లయన్స్ వంటి సంస్థల బ్లడ్ బ్యాంక్‌లకు అందించారు. ఆస్పత్రుల్లో రోగులకు రొట్టెలు, పండ్లు, పాలు పంచిపెట్టారు. జనహృదయాల్లో నిలిచిన వైఎస్ : కన్నబాబు ఫీజు రీ యింబర్స్‌మెంట్, రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ వంటి కార్యక్రమాలు అమలు చేసి వైఎస్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగానిలిచిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిలా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. ఆయన కాకినాడ సమీపాన గల పగడాల పేటలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అనపర్తి మండలం రామవరంలో జరిగిన వైఎస్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్తపేట, తుని, రంపచోడవరం ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి తమ తమ నియోజకవర్గాల్లో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ కో ఆర్డినేటర్లు, రాష్ట్ర కార్యదర్శులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత వైఎస్ మాత్రమేనని నేతలు ఈ సందర్భంగా కొనియాడారు. -
తన పుట్టినరోజే యాకుబ్‌కు ఊరి
-
హాస్యానికి చిరునామా.. జంధ్యాల
వివేక్‌నగర్: ఆరోగ్యకర హాస్యానికి చిరునామా జంధ్యాల అని, నటుడు, దర్శకుడు, మాటల రచయితగా తన ప్రతిభను చాటుకున్న మహానీయుడని వక్తలు పేర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు జంధ్యాల వర్ధంతి సందర్భంగా కళానిలయం సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కళాసుబ్బారావు కళావేదికలో జరిగిన జంధ్యాల ఆత్మీయ పురస్కార ప్రదానోత్సవ సభలో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన సమాచార హక్కు కమిషనర్ పి.విజయబాబు మాట్లాడుతూ కుటుంబ సమేతంగా చూడదగ్గ హాస్య చిత్రాలు నిర్మించిన జంధ్యాల లాంటి దర్శకులు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. సినీ, టీవీ నటులు ప్రదీప్ మాట్లాడుతూ జంధ్యాల ఎందరో నూతన నటులకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రంగస్థల సినీ, టీవీ నటులు యు.సుబ్బరాయ శర్మకు జంధ్యాల ఆత్మీయ పురస్కారాన్ని బహూకరించి ఘనంగా సత్కరించారు. సభలో సాహితీ వేత్త డా.ద్వా.నా.శాస్త్రి, నటులు జెన్నీ, ఎ.యాదగిరి, పి.మనోహర్, ఎ.సురేందర్. పురస్కార గ్రహీత సుబ్బరాయ శర్మ తదితరులు సభలో పాల్గొని ప్రసంగించారు. -
మరణ తేదీని చెప్పేందుకు ఓ యాప్!!
మనిషికి తాను ఎంతకాలం బతుకుతానో.. ఎప్పుడు చనిపోతానో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండటం సర్వసాధారణం. కానీ అది తెలియడం అంత సులభం కాదనుకుంటున్నారా.. అయితే మీకోసం ఇదుగో, ఓ యాప్ సిద్ధంగా ఉంది. 'డెడ్‌లైన్' అనే ఈ యాప్.. మీ ఐఫోన్లో ఉన్న హెల్త్‌కిట్ టూల్ నుంచి సమాచారం మొత్తాన్ని స్కాన్ చేసి, మీరు ఏరోజు మరణిస్తారో చెప్పేస్తుంది. ఎత్తు, బీపీ, ఎంతసేపు పడుకుంటున్నారు, రోజుకు ఎంత నడుస్తున్నారు.. ఇలాంటి వివరాలన్నింటినీ ఈ యాప్ లెక్కకట్టేస్తుంది. ఈ సమాచారాన్ని ఉపయోగించి, దానికి మీ జీవనశైలికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు జోడించి.. వాటి సమాధానాల ద్వారా సుమారుగా మీ మరణ తేదీని చెబుతుంది. వాస్తవానికి ఏ యాప్ కూడా కచ్చితంగా మనం మరణించే తేదీని చెప్పలేపదని, కానీ ఇది మాత్రం వాస్తవానికి మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి అవసరమైన పక్షంలో వైద్యుడిని సంప్రదించాలని కూడా సూచిస్తుందని ఈ యాప్‌ను డెవలప్ చేసిన జిస్ట్ ఎల్ఎల్సీ సంస్థ యాపిల్ ఐట్యూన్స్ పేజీలో రాసింది. మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయడం ద్వారా మరణాన్ని వాయిదా వేసుకోవచ్చని కూడా అంటున్నారు.