మరోసారి ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్స్
ముంబై: బిగ్ దివాలీ సేల్ ద్వారా బంపర్ అమ్మకాలు సాధించిన ప్రముఖ రీటైల్ ఇ-టైలర్ ఫ్లిప్‌కార్ట్ మరోసారి ఫ్లిప్‌కార్ట్ భారీ అమ్మకాలపై కన్నేసింది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు నాలుగు రోజుల డిస్కౌంట్ అమ్మకాల బిగ్ ఆఫర్ ను ప్రకటించింది. అన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, స్మార్ట్ ఫోన్ల పై భారీ డిస్కౌంట్ లను అందించనుంది. డిశెంబర్ 18 నుంచి డిశెంబర్ 21 తో ముగిసే బిగ్ షాపింగ్ డేస్ ను వెల్లడించింది. . దీంతో పాటు ఫ్రీ షాపింగ్ విన్-విన్ ఆఫర్‌ను కూడా అందించనుంది. అంతేకాదు ఎక్కువగా కొనుగోలు చేసిన వారిలో టాప్ టెన్ జంటలకు అదనంగా యూరోప్ గాని, శ్రీలంక, అండమాన్, మారిషస్, హిమాచల్ ప్రదేశ్ లోగానీ ఉచితంగా పర్యటించే హాలిడే ట్రిప్ ను కల్పిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ కొనుగోలుదారులు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే బిగ్ షాపింగ్ డేస్ షాపింగ్‌లో 10 శాతం తగ్గింపు. దీంతోపాటు ఒక విన్-విన్ ఆఫర్ లో ఫ్లిప్ కార్ట్ యూజర్ సైట్ లో ఉచితంగా షాపింగ్ చేయడానికి ఒక అవకాశాన్ని కూడా ప్రవేశపెట్టింది.
ఆఫర్ల పూర్తి వివరాలను ప్రకటించకపో్యినప్పటికీ ఈ నాలుగు రోజుల బిగ్ షాపింగ్ డేస్ లో మోటార్ ఈ3, శామ్సంగ్ గేర్ ఫిట్ 2, మరియు వు టీవీ లను విక్రయించనున్నట్టు తెలుస్తోంది. గత దివాలీ ఆఫర్ , బిగ్ బిలియన్ సేల్స్ లో మాదిరిగానే ప్రత్యేక స్మార్ట్ ఫోన్ లాంచ్, డిస్కౌంట్ ధరలు, ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. గత బిగ్ షాపింగ్ డేస్ అమ్మకాల్లో అక్టోబర్ లో ఆపిల్ వాచ్ , సోనీ ప్లేస్టేషన్ 4 లాంటి ఉత్పత్తులపై డిస్కౌంట్ అందించిన సంగతి తెలిసిందే.