derailed jump
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
శ్రీకాకుళం: మండలంలోని బొడ్డవర వద్ద గూడ్స్ రైలు ఆదివారం సాయంత్రం పట్టాలు తప్పింది. కిరండూల్ నుంచి విశాఖకు ఐరన్ ఓర్‌తో వస్తున్న గూడ్స్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఆరు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ప్రమాద సమయంలో 20 కి.మీ వేగంతో రావాల్సిన రైలు 40 కి.మీ వేగంతో రావడం ప్రమాదానికి కారణం కావచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. వరుస గా ఉన్న నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పగా మధ్యలో రెండు మినహా తరువాత మరో రెండు వ్యాగన్లు మొత్తంగా ఆరు వ్యాగన్లు పట్టాలు తప్పా యి. ఐరన్ ఓర్ సమాంతరంగా వేయకపోవడం ప్రమాదానికి ఒక కారణం కావచ్చని భావిస్తున్నా రు. సోమవారం నాటికి ట్రాక్ పునరుద్ధరణ పను లు పూర్తవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. -
పట్టాలు తప్పిన అవధ్ - అసోం రైలు
పట్నా: బిహార్ లో ముజఫర్ పూర్ జిల్లాలో అవధ్ - అసోం ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. బాగా రద్దీగా ఉండే హజీపూర్ - ముజఫర్ నగర్ మధ్య సోమవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు మూడు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. మీరాపూర్ రైల్వే స్టేషన్ కు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో కొన్ని మీటర్ల మేర ట్రాక్ దెబ్బతింది. పలు రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు కొన్ని రైళ్లను దారి మళ్లించారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. పరిస్థితిని అంచనా వేస్తున్నామని ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.