development of schools
-
పేరెంట్ కమిటీలతో స్కూళ్ల సమగ్రాభివృద్ధి..!
రాష్ట్రంలో పాఠశాల విద్యా రంగంలో ఇక నుంచి విద్యార్థుల తల్లిదండ్రులదే కీలక భూమిక కానుంది. పాఠశాలల అభివృద్ధితోపాటు బోధనాభ్యసన కార్యక్రమాలు, ప్రమాణాల పెంపు అంశాల్లోనూ వారిని భాగస్వాములను చేస్తూ పాఠశాలల సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లను పేరెంట్ మేనేజ్మెంట్ కమిటీ (పీఎంసీ)లు లేదా పేరెంట్ కమిటీలుగా మార్పు చేసింది. ప్రభుత్వ స్కూళ్లలోనే కాకుండా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలోనూ ఈ కమిటీలను ఏర్పాటు చేయించి విద్యార్థి కేంద్రంగా విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. తద్వారా యాజమాన్య ప్రయోజనాలకు అడ్డుకట్ట వేయనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో పేరెంట్ కమిటీల ప్రాధాన్యతను పలుమార్లు నొక్కిచెప్పారు. సాక్షి, అమరావతి: పాఠశాలల అభివృద్ధిలో పేరెంట్ కమిటీలదే కీలక పాత్ర కావాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వాటికి మరింత ప్రాధాన్యత పెరుగుతోంది. గత టీడీపీ ప్రభుత్వం చాలాకాలం కమిటీలను ఏర్పాటు చేయలేదు. అయితే.. పాఠశాల యాజమాన్య కమిటీలు తప్పనిసరి అని, కమిటీలకు ఎన్నికలు నిర్వహించకుంటే సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులు నిలిపివేయాల్సి ఉంటుందని కేంద్రం తాఖీదులు ఇవ్వడంతో ఆదరాబాదరాగా ఎన్నికలు చేపట్టి వాటిని టీడీపీ నేతలతో నింపేసింది. పాఠశాలలకు ఎస్ఎస్ఏ ద్వారా ఇచ్చే నిధులను యాజమాన్య కమిటీల ఖాతాల్లో వేస్తారు. అయితే.. డమ్మీ కమిటీలను ఏర్పాటు చేసిన టీడీపీ.. క్రీడల నిర్వహణ, పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలకు ఇచ్చిన నిధులే కాకుండా సుద్దముక్కలు, డస్టర్లు, తెల్ల కాగితాలు, ఇతర బోధన పరికరాలకు కేంద్రం ఇచ్చిన మొత్తాలను భారీ ఎత్తున దారి మళ్లించింది. పేరెంట్ కమిటీల ఎంపిక ఇలా.. - పేరెంట్ కమిటీల్లో విద్యార్థుల తల్లిదండ్రుల్లో అన్ని వర్గాల వారికి భాగస్వామ్యం కల్పిస్తారు. - మూజువాణీ విధానంతో ఎన్నిక నిర్వహిస్తారు. అవసరమైతే రహస్య బ్యాలెట్ పద్ధతిని అనుసరిస్తారు. - తల్లిదండ్రులు, సంరక్షకుల్లో 50 శాతానికి తగ్గకుండా ఎన్నికకు హాజరు కావాల్సి ఉంటుంది. - తల్లిదండ్రుల్లో ఒక్కరికే ఓటుహక్కు ఉంటుంది. - ప్రతి తరగతి నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకులను సభ్యులుగా ఎన్నుకుంటారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందినవారితోపాటు ఇద్దరు మహిళలై ఉండాలి. - ఎన్నికైన సభ్యులు తమ నుంచి ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. వీరిద్దరిలో ఒకరు తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందినవారు, మరొకరు మహిళ ఉండాలి. - ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతి నుంచి ముగ్గురు చొప్పున 15 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 24 మంది సభ్యులుంటారు. - ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి 9 మంది సభ్యులను ఎన్నుకుంటారు. - సభ్యుల కాలపరిమితి రెండేళ్లు ఉంటుంది, లేదా ఆ విద్యార్థులు పాఠశాలను వదిలి వెళ్లే వరకు ఉంటుంది. - స్కూల్ హెడ్మాస్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఒక టీచర్, సంబంధిత వార్డు మెంబర్, కౌన్సిలర్/ కార్పొరేటర్, ఏఎన్ఎం, వార్డు మహిళా సమాఖ్య అధ్యక్షులు, అంగన్వాడీ వర్కర్లను నియమిస్తారు. - కోఆప్టెడ్ సభ్యులుగా పాఠశాల అభివృద్ధికి తోడ్పడే విద్యావేత్తలను, దాతలను, స్వచ్ఛంద సేవకులను ఎంపిక చేస్తారు. పేరెంట్ కమిటీలకు కీలక బాధ్యతలు ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో స్కూళ్ల సమగ్రాభివృద్ధికి పేరెంట్ కమిటీలను బలోపేతం చేయనుంది. కమిటీలకు ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే పాఠశాల విద్యా శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. కమిటీలను ఏర్పాటు చేసి కీలక బాధ్యతలు అప్పగించనుంది. - విద్యా హక్కు చట్టం ప్రకారం.. విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు అందేలా కమిటీలు చూస్తాయి. - నిధులను వినియోగించే అధికారం కమిటీలకే ఉంటుంది. - పాఠశాలల పనితీరును సమీక్షించి సరైన రీతిలో కొనసాగేలా చేస్తాయి. - స్కూళ్ల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించడంతోపాటు పనులు అనుకున్న విధంగా జరిగేలా చూస్తాయి. - ప్రభుత్వ నిధులతో కొనసాగే నిర్మాణ పనులు, ఇతర కార్యక్రమాల్లో లోపాలు లేకుండా పర్యవేక్షిస్తాయి. -
ప్రతి మండలంలో జూనియర్ కాలేజీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రతి మండలానికో జూనియర్ కాలేజీ ఉండాలని, ఇందుకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లను క్రమపద్ధతిలో ప్లస్ టూ వరకు పెంచుతూ జూనియర్ కాలేజీ స్థాయికి తీసుకు వెళ్లాలని సూచించారు. వీటిని ఎక్కడ, ఏ రకంగా చేయాలన్నదానిపై ఒక ప్రణాళికను రూపొందించాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అవసరమైన మౌలిక వసతులను కల్పించడం ద్వారా వాటిని అభివృద్ధి చేయడంపై సీఎం వైఎస్ జగన్ బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. స్కూళ్ల తరహాలోనే కాలేజీల్లో మౌలిక వసతుల కల్పనకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి ఒక కాలేజీ చొప్పున బాగు చేయడంపై దృష్టి సారించాలని చెప్పారు. డైట్స్‌ను బలోపేతం చేయాలి వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధనను అమలు చేయాలని, ఆ తర్వాత 9, 10 తరగతులకూ వర్తింప చేయాలని ఆదేశించారు. ఇందు కోసం 70 వేల మంది టీచర్లకు ఆంగ్ల బోధనలో శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆంగ్ల బోధనపై శిక్షణ ఇచ్చేలా డైట్స్‌ను బలోపేతం చేయాలని చెప్పారు. టీచర్లకు ఇచ్చే శిక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నప్పటికీ తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ సందర్బంగా విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడానికి కసరత్తు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఖాళీల భర్తీ పక్రియను ప్రతి ఏడాది జనవరిలో పూర్తి చేయాలని, ఏ శాఖ ఏ పరీక్షలు పెట్టాలన్నా జనవరిలో పెట్టాలని సీఎం సూచించారు. పర్యావరణం, వాతావరణంలో మార్పులు, రహదారి భద్రతకు సంబంధించిన అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని స్పష్టం చేశారు. పుస్తకాలు, యూనిఫామ్, షూ, స్కూలు బ్యాగు,.. ఇవన్నీ కూడా వచ్చే ఏడాది విద్యార్థులు స్కూల్లో చేరిన రోజే ఇవ్వాలని, ఎక్కడా ఆలస్యం కాకుండా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో 15,410 స్కూళ్లలో మౌలిక వసతులు ‘నాడు – నేడు’ కింద మొత్తం 44,512 పాఠశాలలను బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగంగా తొలి దశలో 15,410 స్కూళ్లలో ఈ కార్యక్రమం చేపడతున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో 9 రకాల కనీస వసతులను కల్పించనున్నట్లు తెలిపారు. పంచాయతీ రాజ్, మున్సిపల్, గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాలలు ప్రతి దశలో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. తొలి దశలో లక్ష్యం పెరిగినా పర్వాలేదని, ఏ పాఠశాల తీసుకున్నా 9 రకాల పనులు తప్పనిసరిగా పూర్తి కావాలని చెప్పారు. చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని, ఈ విషయంలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. 2020 మార్చి 14 నాటికి ‘నాడు – నేడు’ కింద తొలిదశ స్కూళ్లలో చేపట్టిన పనులు పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. స్కూళ్లలో చేపడుతున్న పనులకు విద్యా కమిటీల ఆమోదం ఉండేలా చూడాలని, ఈ కమిటీలు సామాజిక తనిఖీలు చేయాలని సీఎం సూచించారు. స్కూళ్ల బాగు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారంటూ ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. బడుల బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులదే అన్న భావన కలిగించాలని, స్కూళ్లను అభివృద్ధి చేయడంలో పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలన్నారు. స్కూళ్ల బాగు కోసం ప్రభుత్వం క్యాంపెయిన్ చేయడం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ప్రైవేట్ కాలేజీల్లో సరైన సదుపాయాలుఉండాలి ప్రయివేటు కాలేజీలకు అనుమతి ఇవ్వడం లేదన్నది అవాస్తవమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే అక్కడ సరైన మౌలిక సదుపాయాలు, ఉన్నాయా.. లేదా? అన్నది చూస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నప్పుడు ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లలో కూడా సరైన సదుపాయాలు ఉండాలని, అలా ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. కనీస ప్రమాణాలు, వసతులు లేకుండా ఏ విద్యా సంస్థ ఉండడం సరికాదని, ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుందని, ప్రయివేటు సంస్థలు చేయాల్సిన పనులు వాళ్లు చేయాలని సీఎం పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం కింద ఇస్తున్న కోడి గుడ్లపై గతంలో బాగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. అందుకే ప్రస్తుతం గుడ్ల పంపిణీని వికేంద్రీకరించామని చెప్పారు. నాణ్యమైన గుడ్లు విద్యార్థులకు అందేలా ఇంకా ఎలాంటి విధానాలు అనుసరించాలన్నదానిపై మరిన్ని ఆలోచనలు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల సొమ్ము నేరుగా లబ్ధిదారులకు అందేలా అన్ ఇన్‌కంబర్డ్ బ్యాంకు ఖాతాలను తెరిచే బాధ్యత గ్రామ వలంటీర్లదేనని సీఎం స్పష్టం చేశారు. -
కమీషన్ల కక్కుర్తి!
• యూనిఫారాల కుట్టు ఆర్డర్లలో చేతివాటం • జతకు రూ.5 నుంచి రూ. 8 వరకు కమీషన్ • ఇవ్వని డ్వాక్రా సంఘాలకు మొండిచెయ్యి • నిబంధనలను కాలరాస్తున్న ఎంఈవోలు మహారాణిపేట (విశాఖ) : విద్యాలయాలను తీర్చిదిద్దాల్సినవారే విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి.. బోధనపకరణాలకు అందుతున్న నిధులను బొక్కేస్తున్న కొందరు అధికారులు చివరికి విద్యార్థులకు ఇవ్వాల్సిన యూనిఫారాలను కుట్టడానికి ఏజెన్సీలను నిర్ణయించే విషయంలోనూ కమీషన్ల కక్కుర్తికి పాల్పడుతున్నారు. చాలా మండలాల్లో మండల విద్యాశాఖాధికారులు, ప్రధానాపాధ్యాయులు కుమ్మక్కై జతకు 5 నుంచి 8 రూపాయల వరకు కమీషన్లు దండుకుంటున్నారు. కమీషన్లు ఇవ్వని ఏజెన్సీలకు ఫ్యాబ్రిక్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. జిల్లాలో 2,36,818 మంది పిల్లలున్నారు. వీరందరికీ రెండేసి జతలు చొప్పున ప్రభుత్వం సరఫరా చేస్తుంది. అంటే 4,73,636 జతలు కుట్టించాల్సి ఉంది. ఒక్కో జతకు 5 నుంచి 8 రూపాయలు చొప్పున కమీషన్ వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన కనీసం రూ.20 లక్షల వరకు దండుకుంటున్నారని తెలుస్తోంది. డ్వాక్రా సంఘాలపై చిన్న చూపు డ్వాక్రా సంఘాలను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులతోపాటు చివరికి ఎంఈఓలు, హెచ్ఎంలు కూడా ఖాతరు చేయడం లేదు. నిబంధనల మేరకు ఈ సంఘాలకు ఇవ్వాల్సిన కట్టు ఆర్డర్లను కమీషన్ యావలో పడి ఈ సంఘాలకు దక్కకుండా చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే యూనిఫారాల కుట్టు బాధ్యతను పాఠశాల యాజమాన్య కమిటీల(ఎస్ఎంసీ) ద్వారా స్థానికంగా ఉన్న డ్వాక్రా సంఘాలకు అప్పగించాలి. దానికి విరుద్ధంగా కమీషన్ ఇచ్చిన ఏజెన్సీలకే కుట్టుపని అప్పగిస్తూ ఎంఈవోలు డిక్లరేషన్ ఫారాలు ఇస్తున్నారు. అలాగే డబ్బులిచ్చిన ఏజెన్సీలకే వర్క్ ఆర్డర్ ఇస్తూ ఫ్యాబ్రిక్ ఇవ్వాలని ఆప్కోకు సిఫారసు చేస్తున్నారు. కమీషన్ ఇవ్వకపోతే డిక్లరేషన్ ఫారంపై సంతకం పెట్టేదిలేదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. ఆర్డర్ ఒకరికి...ఫ్యాబ్రిక్ ఇంకొకరికి జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో డ్వాక్రా సంఘాలకు కుట్టు పని ఇస్తూ వర్క ఆర్డర్లు, డిక్లరేషన్లు ఇచ్చారు. వీరిలో కమీషన్ ఇచ్చిన వారికే క్లాత్ సరఫరా చేయాలని ఆప్కోకు సిఫారసు లేఖలు ఇస్తున్నారు. మిగిలిన వారికి వర్క్ ఆర్డర్లు తప్ప క్లాత్ సరఫరా చేయకపోవడంతో వారు పనులు చేపట్టలేకపోతున్నారు. ఉదాహరణకు విశాఖ నగర పరిధిలోని చినగదిలిలో ఒక డ్వాక్రా సంఘానికి వర్క్ ఆర్డర్ ఇచ్చారు. కానీ ఆ సంఘం కమీషన్ ఇవ్వకపోవడంతో ఆప్కోకు ఇవ్వాల్సిన సిఫారసు లేఖపై ఎంఈవో సంతకం చేసినా.. అందులో ఎంత క్లాత్ ఇవ్వాలన్న విషయాన్ని నమోదు చేయకుండా ఖాళీగా వదిలేశారు. ఫలితంగా క్లాత్ సరఫరా కాక ఆ ఏజెన్సీ ఇబ్బంది పడుతోంది. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడంలేదు. కాగా ఈ ఏజెన్సీ కమీషన్ చెల్లించకపోవడంతో దీనికి ఇచ్చిన వర్క్ ఆర్డర్‌ను మార్చి ఒక మంత్రి సన్నిహితుడికి చెందిన ఏజెన్సీకి కట్టబెట్టారని తెలిసింది. ఇదొక్కటే కాదు.. జిల్లాలోని చింతపల్లి, జి.కె.వీధి, మాడుగుల, పాడేరు, హుకుంపేట తదితర మండలాలతోపాటు పాటు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ ఇదే దందా సాగింది. కీలక అధికారి అండదండలతోనే డ్వాక్రా మహిళలకు కాకుండా ఏజెన్సీలకు కుట్టుపని దక్కేలా సర్వశిక్షా అభియాన్‌లోని ఒక కీలక అధికారి పావులు కదిపారు. కుట్టుపని దక్కాలంటే ఎంఈఓలకు కమీషన్లు ఇవ్వాలని ఆ అధికారి స్వయంగా ఏజెన్సీలకు సూచించారు. దాంతో ఏజెన్సీలు నేరుగా తమకు నచ్చిన మండలాలకు వెళ్లి కమీషన్లు సమర్పించి వర్క్ ఆర్డర్లు దక్కించుకున్నారు. కన్ని మండలాల ఎంఈవోలతో ఈ అధికారి నేరుగా మాట్లాడి తనకు అనుకూలమైన ఏజెన్సీలకు ఎక్కువమంది విద్యార్థులున్న మండలాల ఆర్డర్లు ఇప్పించినట్లు సమాచారం