ప్రశాంతంగా డైట్సెట్
సంగారెడ్డి మున్సిపాలిటీ : జిలాలో ఆదివారం నిర్వహించిన డైట్సెట్ ప్రశాంతం గా ముగిసింది. జిల్లా వ్యా ప్తంగా 19,285 మందికిగాను 18,206 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్, డీఈఓ రాజేశ్వర్రావు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా డైట్సెట్ పరీక్ష నిర్వహణకు కొండాపూర్, సదాశివపేట, సంగారెడ్డి, పటాన్చెరు, రాంచంద్రాపురం మండలాల్లోని 81 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సంగారెడ్డిలోని శ్రీతేజ జూని యర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని ఇన్చార్జి కలెక్టర్ శరత్ పరిశీలించారు. అనంతరం పరీక్ష కేంద్రాల వద్ద చేసిన ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమయానికంటే ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. డైట్సెట్ పరీక్ష సందర్భంగా ఉదయం, మధ్యాహ్నం పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు హోటళ్లు కిక్కిరిసి పోయాయి.
డీఈఓ రాజేశ్వరరావు కంది కేశవరెడ్డి, పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్, శాంతినగర్ సెయింట్ ఆంథోనీ హై స్కూల్, జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. తెలుగు మీడియంలో 18,593 మం దికి 17,536 మంది హాజరయ్యారు. ఉర్దూ మీడియంలో 695కు 670 మంది హాజరయ్యారు. పరీక్ష సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.