రండి...తాగండి...ముచ్చటించండి: షారుక్
తన జన్మదినాన్ని అభిమానులు జరుపుకోవడాన్ని అద్భుతంగా భావిస్తాను అని బాలీవుడ్ షారుక్ ఖాన్ అన్నారు. నా జన్మదినం సందర్భంగా మీడియాను ఆహ్వానిస్తున్నాను. బాంద్రాలోని బ్యాండ్ స్టాండ్ సమీపంలోని మన్నత్ నివాసానికి వచ్చి.. కూల్ డ్రింక్ లు తాగండి.. ఆతర్వాత నాతో ముచ్చటించండి అని లిస్టా జువెల్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షారుక్ తెలిపారు. శనివారం రోజున షారుక్ తన జన్మదినం జరుపుకోనున్నారు. నవంబర్ 2న షారుక్ 48 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నారు.
ఇక షారుక్ ఖాన్, మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్ నటించిన దిల్ తో పాగల్ హై చిత్రం అక్టోబర్ 31 తేదికి 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. 16 పూర్తి చేసుకుందనే విషయం గురించి ఆలోచించినపుడు తాను ఒక్కసారిగా ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లానని షారుక్ ట్విటర్ లో పేర్కోన్నారు. బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన యష్ జీ(యష్ చోప్రా) టీమ్ కు, మాధురీ, కరిష్మా కపూర్ లకు నా కృతజ్క్షతలు అని ట్విటర్ లో తెలిపాడు.