సిస్టిమిక్ ల్యూపస్ ఎరిథెమాటసస్ (SLE)
SLE వలన శరీరంలోని అనేక అవయవాలు వ్యాధికి గురి అవుతాయి. ఇది గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కీళ్ళు, చర్మం, రక్తనాళాలు, నాడీవ్యవస్థను పీడిస్తుంది.
ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. మన రోగనిరోధక వ్యవస్థలోని తెల్ల రక్తకణాలు మన సొంత కణాలపై దాడి చేయడం వలన వచ్చే వ్యాధులను ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం.
ఇది 15 నుండి 35 సంవత్సరాల లోపు స్త్రీలలో అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ జబ్బు యొక్క దిశను ఊహించటం కష్టం. ఇది కొద్దిరోజులు తీవ్రంగానూ (Flare up), కొద్ది రోజులు వ్యాధి లక్షణాలు తక్కువ అవటం జరుగుతుంది. (Remissions)
లక్షణాలు
ఈ వ్యాధికి గురయ్యే అవయవాన్ని బట్టి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.
చర్మము: ముఖచర్మంపై దద్దుర్లు రావటం, చెంప మరియు ముక్కు పైన సీతాకోకచిలుక ఆకారంలో దద్దుర్లు రావటం చూస్తాము. దీనినే butterfly Rash అంటాము.
డిస్కాయిడ్ లూపస్ (Discoid lupus) : ఈ రకం SLE లో చర్మం ఎర్రబడటం, పొలుసులు రాలటం, చర్మంలోని లో పొరలలో నుంచి దళసరి పగుళ్ళు, రక్తస్రావంతో కూడిన పొలుసులు రాలటం, చర్మంపై నల్లటి మచ్చలు అవటం వంటివి జరుగుతాయి.
మూత్రపిండాలు: ఎక్కువ శాతం SLE రోగులలో మూత్రపిండాలు ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉంటుంది. దీనినే Lupus Nephritis అంటారు.
మూత్రంలో రక్తకణాలు, ప్రొటీన్లు కోల్పోతాయి.
శరీరమంతా వాపులు వస్తాయి, బరువు పెరుగుతుంది.
SLE దీర్ఘకాలంలో మూత్రపిండాలను పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. ఒక్కోసారి Dialysis గానీ మూత్రపిండ మార్పిడి గానీ చేయవలసిన అవసరం ఉండవచ్చు. అందువలన వ్యాధి తీవ్రమయ్యే కంటే ముందుజాగ్రత్త పడటం మంచిది.
గుండె: SLE రోగులలో గుండెకు సంబంధించిన సమస్యలతో మరణించే వారి సంఖ్య అధికం.
ముఖ్యంగా పెరికార్డైటిస్, మయోకార్డైటిస్ మరియు ఎండోకార్డైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివలన ఆయాసం, జ్వరము, నీరసం మొదలగు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది.
SLE వలన గుండెలోని రక్తనాళాలలో కొవ్వు పదార్థాలు వేగంగా, అధికంగా పేరుకుపోవడం వలన గుండెనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు రావటం. SLE సాధారణంగా అనేక కీళ్ళను, ముఖ్యంగా చిన్న కీళ్ళను ప్రభావితం చేస్తాయి.
రక్తహీనత, తెల్లరక్తకణాలు తగ్గటం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గటం జరుగుతుంది. దీనివల్ల తరచు ఇన్ఫెక్షన్లకు గురికావటం, అధిక రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది.
ఊపిరితిత్తులలో నిమ్ము చేరటం.
దీర్ఘకాలంలో SLE వలస Diffuse Interstitial Lung Disease బారినపడే అవకాశం ఉంటుంది.
నాడీవ్యవస్థ SLE వ్యాధి బారినపడితే మానసిక అశాంతి, పక్షవాతం, మూర్ఛవ్యాధి, తలనొప్పి మొదలగు లక్షణాలు వస్తాయి.
గర్భిణీలలో SLE వలన పిండ మరణం, గర్భస్రావం అధికంగా జరిగే అవకాశం ఉంటుంది.
వ్యాధి నిర్థారణ పరీక్షలు
CBP, ESR, CUE, రుమటాయిడ్ ఫ్యాక్టర్
C రియాక్టర్ ప్రొటీన్ (C-RP)
యాంటీ న్యూక్లియర్ యాంటీ బాడీ (ANA)
యాంటీ SM యాంటీ బాడీస్ (Anti SM- - Antibodies)
యాంటీ ds DNA, ఇతర పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చును.
సాధారణంగా ఈ వ్యాధికి అనేక చికిత్స పద్ధతులు ఉన్నప్పటికీ ఏ పద్ధతిలోనూ సంపూర్ణంగా నయం చేసే అవకాశం లేదు. కేవలం హోమియోపతి వైద్యవిధానంలో మాత్రమే మందుల వల్ల ఎటువంటి అసౌకర్యం, దుష్ఫలితాలు లేని చికిత్స చేయవచ్చు.
హోమియోకేర్ ఇంటర్నేషనల్లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం, అధునాతనమైన నిపుణులచే SLE ని అదుపులో ఉంచడమే కాకుండా ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు.
కారణాలు
శాస్త్రీయపరంగా SLE వ్యాధికి గల కారణాలు మనకు అందుబాటులో లేవు. కానీ, జన్యుపరమైన, పర్యావరణ కారణాలు మరియు మానసిక ఒత్తిడి వలన ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుస్తోంది.
డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్
సి.ఎం.డి.,
హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99
టోల్ ఫ్రీ: 1800 102 2202
బ్రాంచ్లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.