నిరుద్యోగం పెరుగుతోంది
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నర్సింహారెడ్డి
పరిగి:ఎన్నో హామీలు, కలల ప్రపంచాన్ని చూపి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమవుతోందని.. రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతోందని ఏఐవైఎఫ్(అఖిల భారత యువజన సమాఖ్య) జిల్లా కార్యదర్శి నర్సింహారెడ్డి అన్నారు. గురువారం పరిగిలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఆ సంఘం నియోజకవర్గ ప్రథమ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన భూములు అమ్ముకొని ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వం జిల్లా ప్రజలకు మాత్రం మొండి చేయి చూపిస్తుందన్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశా రు. సొంత లాభాల కోసం ప్రభుత్వం ప్రాజెక్టుల డిజై న్లు మారుస్తుందని విమర్శిం చారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఏఐ ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పీర్మహ్మద్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీని వాస్ మాట్లడుతూ విద్యార్థుల భిక్షతో అధికారం చేపట్టిన తెలంగాణ సర్కారు వారిని పూర్తిగా విస్మరిస్తోందన్నారు. ఇలాగే వ్యవహరిస్తే సీఎం క్యాంప్ఆఫీస్ ముట్టడిస్తామ న్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, నర్సింహ, చెన్నయ్య, మల్లేశం, రమేష్, శ్రీను,సైదులు, సత్తయ్య, శివశంకర్, నరేష్, బాల్రాజ్ పాల్గొన్నారు.