ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల పేరుతో అభ్యర్థుల నుంచి కోట్లు వసూలు చేశాడో వ్యక్తి. జిల్లాలోని పెద్దపల్లి డీఎల్పీవో వెంకయ్య ఈ మోసానికి పాల్పడ్డారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆదిలాబాద్ జిల్లాలో పలువురి వద్ద రూ. 3 కోట్లు వసూలు చేశారు. ఉద్యోగాల గురించి అడిగితే తప్పించుకు తిరుగుతుండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న బెల్లంపల్లి పోలీసులు వెంకయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.