doan thi huong
-
కిమ్ సోదరుడి హత్య వీడియో ప్రదర్శన
ప్యాంగ్యాంగ్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్ హత్యకు సంబంధించిన వీడియోను కోర్టు విచారణ సమయంలో ప్రదర్శించారు. ఈ కేసులో ప్రస్తుతం ఇద్దరు మహిళలు ప్రధాన నిందితులుగా విచారణ ఎదుర్కొంటుండగా ఆ హత్య తాము చేయలేందంటూ విజ్ఞప్తి చేస్తుండగా ఆ వీడియోను ప్రదర్శించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న కిమ్ జాంగ్ నామ్‌ను కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ తనిఖీ విభాగం వద్ద విష ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ చర్య తాము కావాలని చేయలేదని, తమతో చేయించినవారు రియాలిటీ షో అని చెప్పారని వారు అన్నారు. అయితే, తాజాగా వారి ముందే ప్రదర్శించిన ఆ వీడియోలో కిమ్ జాంగ్ నామ్ వస్తుండగా వియత్నాంకు చెందిన మహిళగా అనుమానిస్తున్న డోవాన్ తి హువాంగ్ తన రెండు చేతులతో నామ్ ముఖాన్ని గట్టిగా ఓసారి మూసి వెళ్లినట్లు కనిపించింది. అయితే, నామ్‌పై దాడిలో స్వయంగా సితీ ఐసియాహ్ అనే ఇండోనేషియా మహిళ లేనప్పటికీ వేరే డైరెక్షన్లో ఆమె పారిపోతున్నట్లు కనిపించింది. అంతేకాకుండా హువాంగ్ ప్రవర్తన ఈ సంఘటన జరగడానికి రెండు రోజుల ముందు చాలా భయానకంగా ఉందని ఈ సందర్బంగా ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి వాన్ అజిరుల్ నిజామ్ చేవాన్ అజిజ్ తెలిపారు. హువాంగ్ కోర్టును తప్పుదోవపట్టిస్తుందని, నామ్‌ను ఏమాత్రం క్షమించరాదనే దోరణితో ఆమె వ్యవహరించిందని, ఎట్టి పరిస్థితుల్లో ఆమెను శిక్షించాలని పేర్కొంది. -
కిమ్ సోదరుడిని చంపిన మహిళలకు ఉరి?
కౌలాలంపూర్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడిని హత్య చేసిన కేసులో అరెస్టయిన ఇద్దరు ఇండోనేషియా మహిళలకు ప్రాణభయంతో వణుకుతున్నారు. నేరం చేసినట్లు రుజువైతే వారికి ఉరి శిక్ష పడే అవకాశం ఉండటంతో తాము నేరం చేయలేదంటూ ప్రాధేయపడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న కౌలలంపూర్ విమానాశ్రయంలో కిమ్ జాంగ్ ఉన్ సోదరుడైన కిమ్ జాంగ్ నామ్(45)పై విషప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. ఓ మహిళ ఆయనకు ఎదురుగా వెళ్లి వీఎక్స్ అనే ప్రమాదకరమైన విష వాయువును నామ్ ముఖంపై కొట్టడంతో అతడు ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు. ఈ కేసులో ఇండోనేషియాకు చెందిన సితీ ఐసియా(25), డోవాన్ థి హువాంగ్(28)లను వియత్నాం నుంచి అరెస్టు చేసి తీసుకొచ్చారు. అయితే, తాము చేస్తుంది ఒక అంతర్జాతీయ హత్య అవుతుందని తాము అనుకోలేదని, ఓ టీవీ షోలో నటించాలని, అందులో భాగంగా తాము చెప్పినట్లు చేయాలని మోసం చేసి తమతో ఆ పనిచేయించారని వారి మలేషియా కోర్టులో వాపోతున్నారు. -
కిమ్ సోదరుడిని చంపిన మహిళలకు మరణ శిక్ష!
మలేషియా: ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్ సోదరుడు కింగ్ జాంగ్ నామ్ హత్య విషయంలో ఇద్దరు మహిళలపై మలేషియా పోలీసులు హత్యాభియోగాలు మోపనున్నారు. విచారణ పూర్తి చేసి వారు దోషులుగా తేలితే వారికి మరణ శిక్ష అమలు చేయనున్నారు. మలేషియా అటార్నీ జనరల్ మహ్మద్ అపాంది అలీ ఈ మేరకు బుధవారం వివరాలు తెలియజేశారు. నామ్ హత్యకు సంబంధించి తదుపరి జరగనున్న పరిణామాలను చెప్పారు. ఇండోనేషియాకు చెందిన సితి ఐసియా, వియత్నాంకు చెందిన డోవాన్ థి హువాంగ్ అనే ఇద్దరు మహిళలపై హత్యాభియోగాలు నమోదుకానున్నాయని, వారు దోషులుగా తేలితే మరణ శిక్షే ఉంటుందని తెలిపారు. అదొక సరదా కార్యక్రమం అని భావించి, అందులో నటించేందుకని అనుకొని తాను 90 డాలర్లు తీసుకొని అవతలి వ్యక్తి చేసినట్లు సితీ ఐసియా చెప్తుండగా మలేషియా పోలీసులు మాత్రం వారిద్దరు ఏం చేస్తున్నారనే విషయం వారికి ముందే తెలుసని చెప్పారు. మరో ఇద్దరిని కూడా పోలీసులు ఈ ఘటనకు సంబంధించి అరెస్టు చేయగా వారిలో ఒకరు ఇప్పటికే బెయిల్‌పై బయట ఉన్నారు. మరో ఉత్తర కొరియా వ్యక్తిని మాత్రం పోలీసులు విచారిస్తున్నారు. ఒక వేళ ఉత్తర కొరియాకు సంబంధించిన వ్యక్తిపై ఆరోపణలు నమోదు చేయాల్సి వస్తే అతడి విషయంలో కూడా చట్ట ప్రకారమే ముందుకు వెళతామని తెలిపారు. మరో ఏడుగురు ఉత్తర కొరియాకు చెందినవారి కోసం మలేషియా పోలీసులు గాలిస్తున్నారు. వీరిలో నలుగురు ఇప్పటికే తమ దేశం పారిపోయారట.