కిమ్ జాంగ్ నామ్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సితీ ఐసియా, డోవాన్ థి హువాంగ్
కౌలాలంపూర్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడిని హత్య చేసిన కేసులో అరెస్టయిన ఇద్దరు ఇండోనేషియా మహిళలకు ప్రాణభయంతో వణుకుతున్నారు. నేరం చేసినట్లు రుజువైతే వారికి ఉరి శిక్ష పడే అవకాశం ఉండటంతో తాము నేరం చేయలేదంటూ ప్రాధేయపడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న కౌలలంపూర్ విమానాశ్రయంలో కిమ్ జాంగ్ ఉన్ సోదరుడైన కిమ్ జాంగ్ నామ్(45)పై విషప్రయోగం జరిగిన విషయం తెలిసిందే.
ఓ మహిళ ఆయనకు ఎదురుగా వెళ్లి వీఎక్స్ అనే ప్రమాదకరమైన విష వాయువును నామ్ ముఖంపై కొట్టడంతో అతడు ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు. ఈ కేసులో ఇండోనేషియాకు చెందిన సితీ ఐసియా(25), డోవాన్ థి హువాంగ్(28)లను వియత్నాం నుంచి అరెస్టు చేసి తీసుకొచ్చారు. అయితే, తాము చేస్తుంది ఒక అంతర్జాతీయ హత్య అవుతుందని తాము అనుకోలేదని, ఓ టీవీ షోలో నటించాలని, అందులో భాగంగా తాము చెప్పినట్లు చేయాలని మోసం చేసి తమతో ఆ పనిచేయించారని వారి మలేషియా కోర్టులో వాపోతున్నారు.