నా పెళ్లాంతో గొడవ పడుతుంటే అడ్డొస్తావా!
తాను తన భార్యతో గొడవ పడుతుంటే.. మధ్యలో అడ్డు తగిలినందుకు ఓ వైద్యుడిని చితక్కొట్టాడో పెద్దమనిషి. విషయం ఏమిటంటే, ఓ మహిళను ఆమె భర్త శివకుమార్ (33) తీవ్రంగా కొట్టడంతో గాయపడి.. మెట్టుపాళ్యంలో గల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. శుక్రవారం నాడు ఆమెకు ఓ వైద్యుడు చికిత్స చేస్తున్న సమయంలో శివకుమార్ అక్కడకు వచ్చాడు.
ఆమెను తిట్టడం మొదలుపెట్టాడు. అయితే, వైద్యుడు కలగజేసుకుని.. ఆమెకు అసలే బాగోలేదని, ఎందుకలా చేస్తున్నావని అడగడంతో అసలు తన భార్యకు చికిత్స చేయడానికి నువ్వెవరంటూ ఆ వైద్యుడిపై తిరగబడ్డాడు. ఆయనను బాగా కొట్టడమే కాక, మళ్లీ ఇలా మధ్యలో అడ్డొస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. వైద్యుడి ఫిర్యాదుతో పోలీసులు శివకుమార్‌ను అరెస్టు చేసి మెట్టుపాళ్యం కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు అతడిని 15 రోజుల రిమాండుకు పంపింది.