టీకాతో ఆరోగ్యానికి భరోసా
అనంతపురం సిటీ: చిన్నారులకు టీకా వేయించడం ద్వారా వారి ఆరోగ్యానికి భరోసా కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, డాక్టర్ వెంకటరమణ, ప్రాంతీయ సర్వెలెన్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రగత్ సూచించారు. బుధవారం స్థానిక జిల్లా ఆరోగ్యశాఖాధి కార్యాలయంలోని సమావేశ భవనంలో నిర్వహించిన కమ్యూనీటి ఆర్గనైజర్ల సమీక్షలో ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. మాతా శిశు మరణాల సంఖ్యను తగ్గించి అనంతను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.